Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పార్వతికి శివుడు వివరించిన ఐదు నగ్నసత్యాలు!
పార్వతికి శివుడు వివరించిన ఐదు నగ్నసత్యాలు!
సతీదేవి, తన రెండవ జన్మలో పార్వతీ దేవిగా జన్మించింది. పార్వతి, పర్వత రాజైన హిమవంతుడు, రాణి మైనాల తనయ. శివుని వివాహం చేసుకోవడం బాల్యం నుండి ఆమె కల. నారద మహాముని కూడా ఆమె శివుడిని భవిష్యత్తులో పరిణయమాడబోతుందని చెప్పారు.
వయస్సు పెరిగే కొద్దీ శివునిపై ఆమె ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. ఎంతో తపస్సు చేసి, ఎన్నో శ్రమలకు ఓర్చి, ఆమె శివుని కళ్యాణమాడింది.

శివుడు అపార మేధస్సు మరియు ఎంతో జ్ఞానం సముపార్జించిన యోగి. ఆయన తన జ్ఞానాన్ని, అనుభవాలను పార్వతితో పంచుకునేవారు. ఆమెకు అతను సృష్టి రహస్యాలను, ప్రజల కష్టనష్టాల వెనుక ఉన్న కారణాలను విడమర్చి చెప్పేవారు. అలా శివుడు పార్వతితో పంచుకున్న ఐదు ముఖ్య విషయాలను ఇప్పుడు మేము మీకు వివరించబోతున్నాం. చదవండిక!

1. అతి పెద్ద కీడు మరియు అతి పెద్ద మేలు:
శివుడు పార్వతితో ఈ విధంగా చెప్పాడు. నిజమైన మంచితనం ఎప్పుడు సత్యంతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడు సత్యాన్ని పలకాలి. ఎప్పటికైనా సత్యమే నిలిచి ఉంటుంది. దీనిపైనే విశ్వమంతా ఆధారపడి ఉంటుంది.
అదేవిధంగా ప్రతిఒక్కరు అబద్దానికి దూరంగా ఉండాలి. అబద్దమాడటం అనేది ప్రతి మనిషి జీవితంలో అతి ఘోరమైన పాపం. ఒక అబద్ధం భవిష్యత్తులో మరిన్ని అబద్దాలకు తావిస్తుంది. ఈ చట్రంలో ఇరుక్కున్న మానవుడుపాపిగా మారతాడు.
అబద్దమాడరాదని నిశ్చయించుకున్న మనిషి, దానికి దారితీసే పరిస్థితుల నుండి దూరంగా ఉండటం మొదలు పెడతాడు. తప్పులు చేయడం లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటాడు. దీనివలన ఒకదాని తరువాత ఒక అబద్దం ఆడవలసిన పరిస్థితి నివారింపబడుతుంది.

2. నీ కర్మలకు నువ్వే సాక్షివి:
మానవుడు తనను ఎవరూ గమనించడం లేదనుకుని పాపాలు చేస్తాడు. ఇదంతా తన భ్రమ అని మరచిపోతాడు. ప్రతిమనిషి తన కర్మలకు తానే సాక్షి అని మరచిపోతాడు. తన దేహం చేసే తప్పుడు పనిని, తన ఆత్మ గమనిస్తుందని అంగీకారానికి వచ్చినప్పుడు, అతను తప్పు చేయడానికి వెరుస్తాడు. ఎవరూ తమ ఆత్మ నుండి తప్పించుకోలేరు. ఆత్మకు భయపడేవాడు తప్పు చేయడు.

3. ఈ మూడు పనులను ఎన్నడూ చేయరాదు:
పాపం చేయడానికి మూడు మార్గాలుంటాయి. అవే మనస్సు, వాక్కు మరియు కర్మ. ఈ మూడింటిని నియంత్రణలో ఉంచకపోతే, పాపాలు జరుగుతాయి
పరమశివుడు, అన్ని శాస్త్రాలలో , పాపం చేయాలనే ఆలోచనను మనస్సులో చేయడం కూడా నిషేధింపబడిందని తెలిపారు. ఇతరుల మనస్సును మన మాటలతోనైనా కూడా గాయపరచరాదు. అటువంటి దుశ్చర్యలకు ప్రతిఫలం ఈ జన్మలోనే కాక మారు జన్మలోనూ అనుభవించవలసి వస్తుంది.

4. విజయానికి మార్గం:
ప్రపంచమంతా భౌతిక సుఖాలకై ఆరాటంలో బంధీ అయ్యి ఉంది. మానవుడు ఈ తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతుంటాడు. ఈ సుఖాలన్ని ఒక మాయ తప్పితే శాశ్వతమైనవి కావు. ఆ భ్రమలో నుండి బయటపడితే కానీ మానవుడు అజేయుడు కాలేడు. ఈ ప్రపంచంలో మనుషులందరు ఒక వస్తువు పట్లనో లేక ఒక వ్యక్తి పట్లనో వ్యామోహం పెంచుకుని, అందుకై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అపజయాలకు ఇది ముఖ్యకారణం. విజయప్రాప్తికై మనిషి, తాత్కాలిక సుఖాలకు దూరంగా ఉండాలి.

5. నీ జీవితాన్ని మార్చేయగల సాధనం:
అత్యాశ మాత్రమే మనిషి సుఖాల వెనుక పరిగెట్టడానికి కారణం. డబ్బుకై అత్యాశ, ప్రేమకై అత్యాశ, పేరుకై అత్యాశ, ఇలా వివిధ రకాలైన అత్యాశల వలన ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి అడ్డంకులుగా మారతాయి. ఇవన్నీ జీవించడానికి అవసరమైనప్పటికి,వాటి కొరకు అతిగా అర్రులు చాచకూడదు.
వీటన్నింటినీ జీవితంలో సమతూకంలో ఉంచాలంటే, ధ్యానం మరియు యోగా ద్వారా సాధ్యమవుతుందని ఆ పరమేశ్వరుడు సెలవిచ్చాడు. ఇక్కడి నుండే ఆధ్యాత్మికత మొదలవుతుంది.



Click it and Unblock the Notifications