Latest Updates
-
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి! -
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? -
మిక్సీ, స్టవ్ తో పనేలేదు.. 5 నిమిషాల్లో అద్భుతమైన రాజస్థానీ స్పెషల్ డుంగ్రీ చట్నీ ఎలా చేసుకోవాలంటే.. -
ఆగష్టులో ప్రధాన గ్రహాల రాశి మార్పులు.. ఈ నాలుగు రాశుల వారికి లక్కే లక్కు.! -
శుక్ర గ్రహ గోచారం.. ఈ మూడు రాశుల వారికి కెరీర్లో కొత్త అవకాశాలు.! -
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.!
గుడిలోకి వెళ్లేముందు గంట ఎందుకు కొట్టాలి? గుడి గంట మోగించడంలో దాగిన రహస్యం ఇదే
సాధారణంగా మనం ఏ హిందూ గుడికి వెళ్లినా అక్కడ ఖచ్చితంగా గంట ఉంటుంది. ఆ గుడిలోకి వచ్చేవాళ్లందూ దానిని మోగిస్తుంటారు. అది కొంచెం ఎత్తులో ఉన్నా సరే ఎగిరి గంట కొట్టడం లేదా మన పెద్దలు మనల్ని ఎత్తుకొని ఆ గంట కొట్టించడం చేస్తుంటారు. అయితే అసలు గుడి లోపలకి వెళ్లేముందు గంట ఎందుకు మోగిస్తాం అని ఎప్పుడైనా ఆలోచించారా? వందలు, వేల సార్లు గుడికి వెళ్లి గంటలు మోగించినవాళ్లు కూడా దీనికి సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. అందరూ మోగిస్తున్నారు..అందుకే మేము మోగిస్తున్నాం అని కొందరు సింపుల్ గా సమాధానమిస్తారు. ఆలయంలోకి వెళ్లాక మీ ముందు గంట ప్రతిధ్వనించే శబ్దాన్ని విన్నట్లయితే అది ఒక ఆహ్వానంలా మీకు అనిపించి ఉండవచ్చు. అయితే వాస్తవానికి దీని వెనుక పెద్ద రహస్యమే ఉంది.
కేవలం శబ్దం కాదు
గంట శబ్దంలో ఒక రహస్యం దాగి ఉంది. అదేంటంటే..ఈ ప్రపంచపు హడావిడిని మరిచి ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడమని అది సూచిస్తుంది. ప్రపంచపు హడావిడిలో పరుగెడుతున్న మన ఆలోచనలకు విరామం ఇస్తుంది. గంట సౌండ్..మీ మనస్సును శాంతపరచి..మీ ఆత్మతో మీరు సంభాషించడానికి ఒక అవకాశం ఇస్తుంది. ఆ గంట మోగిన ప్రతిసారీ మీ హృదయం ఏదో పవిత్రమైన దానితో అనుసంధానం కావడానికి సిద్ధమవుతుంది. ఇది కేవలం శబ్దం కాదు..మీ అంతరంగంలోకి ప్రవేశించడానికి ఒక దివ్యమైన తాళం చెవి లాంటిది.

తంత్రశాస్త్రం చెబుతుందిదే
గంట శబ్దం..మనస్సుని ఆధ్యాత్మిక చింతనకు సిద్దం చేస్తుంది. మానసిక గందరగోళాన్ని తొలగిస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలిపారు. తంత్ర శాస్త్రం ప్రకారం గంట ధ్వని మనలోని ఉన్నత చక్రాలను మేల్కొలుపుతుంది. అది కేవలం శబ్దం కాదని..లోతైన సృహను చేరుకోడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన తరంగం అని ఆధ్యాత్మిక పండితులు చెప్పారు. ఆ శబ్దం విడుదల చిహ్నం కూడా అని..మనం మోస్తున్న బరువుని కొద్దిసేపు పక్కనపెట్టాలని ఆహ్వానిస్తుందని..ఆ శబ్దం మన ఆందోళనల కంటే జీవితంలో ఇంకా ఎంతో ఉందని గుర్తు చేస్తుందని చెప్పారు.
చెడు శక్తి నాశనం
మత విశ్వాసాల ప్రకారం మనం ఆలయానికి చేరుకునేటప్పుడు గంట మోగించడం వల్ల మన శరీరంలోని చెడు శక్తి అంతా తొలగిపోతుందట. దేవుడు గంట శబ్దాన్ని ఆరాధిస్తాడని చెబుతారు. గంట మోగించడం ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి, దేవతల దృష్టి తమవైపు ఆకర్షించుకోడానికి..వారి పూజలను అర్పించడానికి దేవుడిని అనుమతి అడుగుతారు.
సృష్టి ప్రారంభంలో గంట శబ్దం
హిందూ సంప్రదాయంలో గంట దైవిక ఉనికి సూచిస్తుంది..అది దేవతలను ఆహ్వానించడమే కాకుండా మనలోని దైవికతలను కూడా గుర్తు చేస్తుందని పండితులు తెలిపారు. మనం విశ్వంలో ఒక భాగమని తెలియజేస్తుందని చెప్పారు. ధ్వనికి లోతైన స్థాయిలో మనల్ని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ఆలయ గంట శబ్దం మన స్పృహను పెంచడానికి ఎంపిక చేయబడిన ఒక నాదం. గందరగోళంలో సృష్టత ఇస్తుంది..స్థిరత్వానికి పిలుస్తుంది..వేగవంతమైన జీవితంలో ఒక లోతైన లయ ఉందని గుర్తు చేస్తుంది.
మతపరమైన సిద్దాంతం ప్రకారం సృష్టి ప్రారంభంలో గంట శబ్దం మోగింది. గంటను మోగించడం ద్వారా ఓంకార మంత్రాన్రి పూర్తిగా ఉచ్చరించవచ్చని కూడా చెప్పబడింది. ఈ ఆచారం విగ్రహాల చైతన్యాన్ని మేల్కొలిపి భక్తి ప్రభావాన్ని పెంచుతుందని చెబుతారు.



Click it and Unblock the Notifications