Latest Updates
-
వారపు రాశి ఫలాలు 22 నుండి 28 మార్చి: ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతోంది, మీ రాశి ఉందేమో చూడండి! -
ఆరోగ్యానికి అమృతం లాంటి నల్ల నువ్వుల లడ్డూ..ఇలా చేసి రోజుకొకటి తింటే జుట్టు రాలడం, PCOD పరార్! -
ఈరోజు రాశి ఫలాలు (22.03.26): ఆదివారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
పనీర్ లేకుండానే పాలక్ పనీర్!..ఈ 2.0 రెసిపీ చూస్తే వెంటనే వండేస్తారు! -
అబ్బాయిలు vs అమ్మాయిలు..ప్రేమ విషయంలో ఎవరు ఎక్కువ సీరియస్ గా ఉంటారు? -
పర్ఫెక్ట్ అల్లం టీ తయారీకి సీక్రెట్ ఇదే.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి! -
నోరూరించే చెట్టినాడ్ చికెన్.. తింటుంటే వావ్ అనాల్సిందే! -
నోరూరించే భాయ్ స్టైల్ చికెన్ బిర్యానీ.. మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
కాఫీ, టీలు ఎక్కువ తాగుతున్నారా? అయితే ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
రొటీన్ మటన్ కూరలతో బోర్ కొట్టిందా? అయితే ఈ రంజాన్ కు క్రీమీ ఆఫ్ఘానీ మటన్ ట్రై చేయండి..డబుల్ మజా!
కామ సూత్ర బూతు బొమ్మల పుస్తకం కాదు, ఆ పుస్తకంలో అసలు పరమార్ధం వేరు..
చాలా ధార్మిక సంఘాల్లో శృంగారం అనేది చాలా వివాదాస్పద అంశం. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకునేవారికి శృంగారం, ప్రణయం అవరోధాలని ప్రధాన మతాలు అన్నీ బోధిస్తాయి. మరో వంక ఈ మతాలలోనే పరమాత్మను కనుగొనడానికి ఇదే మ
చాలా ధార్మిక సంఘాల్లో శృంగారం అనేది చాలా వివాదాస్పద అంశం. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకునేవారికి శృంగారం, ప్రణయం అవరోధాలని ప్రధాన మతాలు అన్నీ బోధిస్తాయి. మరో వంక ఈ మతాలలోనే పరమాత్మను కనుగొనడానికి ఇదే ముఖ్యమైన మార్గమని భావించే వర్గాలు కూడా వున్నాయి.
భారతీయ సందర్భంలో శృంగారాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ముందుగా మనసులో మెదిలేది కామ సూత్ర. చాలా మంది దాన్ని రతి భంగిమలు, బూతు బొమ్మలు ఉండే పుస్తకంగా భావిస్తారు. కానీ ఎలా చూసినా కామ సూత్ర బూతు బొమ్మల పుస్తకం కాదు. ఆ పుస్తకంలోని అసలు పరమార్ధం భౌతిక వాదం కన్నా ఉన్నతమైనది.
లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్:క్లిక్ చేయండి
పునరుత్పత్తి, సృష్టి చేసే పవిత్ర కార్యం శృంగారం. విశ్వోలోని ప్రకృతి, పురుష శక్తుల కలయిక అది. ఒక నాగరిక వ్యక్తిని ప్రేమ, శృంగారం, జీవితపు సంతోషాల వైపు మార్గదర్శనం చేసి నడిపిస్తుంది కామసూత్ర. అందులోని 64 కళలు ఒక మంచి భార్యకు మార్గదర్శనం చేయడమే కాదు, ఒక సంస్కారవంతమైన, నిపుణురాలు, అర్ధం చేసుకునేది, అందమైనది, తెలివిగలది అయిన నాగరిక మహిళకు మార్గదర్శనం చేస్తుంది.

కామసూత్రలోని ఆధ్యాత్మిక కోణం !!
జంతువులలో శృంగార ప్రక్రియ కేవలం జీవ సృష్టికే పరిమితం అవుతుంది. అయితే, మానవులలో మాత్రం అన్ని స్థాయిలలో - శారీరిక, మానసిక, స్థాయిల్లో కూడా సృష్టికి పనికి వస్తాయి. అందువల్ల, మనం ఎప్పుడైనా ఆకర్షణ, ఉద్దీపన, జాగరణ, తీవ్రేచ్చ, ఆసక్తి, ఉత్సాహం లేదా సృజనాత్మకత అనుభవించితే అది శృంగార శక్తి వల్లనే. కామసూత్ర ఈ శక్తిని శ్రద్ధగా, ఉత్సాహంతో పెంపొందించి ఉత్తమ లక్ష్యాల వైపు ఎలా వ్నియోగించాలో కామసూత్ర నేర్పిస్తుంది.

కామసూత్రలోని ఆధ్యాత్మిక కోణం !!
కామసూత్ర గ్రంథాన్ని వేదాల ఆధారంగా రూపొందించారని చెప్తారు. కామసూత్ర గ్రంధంలోని మొదటి సూత్రాన్ని శివుడి వాహనం నంది కి అంకితం చేసారు. తరువాత క్రీ.శ. ఒకటో శతాబ్దానికి ఆరో శతాబ్దానికి మధ్య దాన్ని వాత్సాయన మహర్షి కామసూత్రాలుగా రాశారు.

కామసూత్రలోని ఆధ్యాత్మిక కోణం !!
ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మానవ జీవితానికి సంబంధించిన మూడు పురాతన గ్రంథాల్లో కామసూత్ర ఒకటి. నైతికత గురించి చెప్పే ధర్మశాస్త్రం, ఐహిక ఆర్ధిక విషయాలను గురించి చెప్పే అర్ధ శాస్త్రం మిగిలిన రెండు గ్రంథాలు. కామాన్ని జీవితంలోని మూడో పరమార్ధంగా చెప్తారు. కామం అంటే వినడ౦, అనుభవించడ౦, చూసడడం, రుచి, వాసన చూడడానికి ఉపయోగపడే జ్ఞానేన్ద్రియాలతో పాటు మనసు, ఆత్మ కలిసి ఆయా వస్తువులను ఆస్వాదించడం అని నిర్వచించారు.

కామసూత్రలోని ఆధ్యాత్మిక కోణం !!
రతి కలయికలో శరీరం, ఆత్మ సంగమిస్తాయి. అందువల్ల ఆ కోరిక పవిత్రంగా వుంటుంది. సరదాల ద్వారా కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా వ్యక్తులకు మార్గదర్శనం చేస్తుంది కామసూత్ర. అవసరం బదులు, సరదా వుంటే రతి క్రీడ ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్ల తనలోని శృంగారపరమైన అవసరాలను అణిచి పెట్టి వుంచుకున్న వారిలో మానసిక సంఘర్షణ కలిగి, చివరికి జీవితంలో అసంతృప్తికి దారి తీస్తుంది.

కామసూత్రలోని ఆధ్యాత్మిక కోణం !!
ఆధ్యాత్మిక గురు దీపక్ చోప్రా చెప్పినట్లు - "శృంగారం, బలహీనత, పెడధోరణులు , శృంగారంలో విపరీత ధోరణులు, హింస, దుర్వినియోగం లాంటివి శృంగార వాంచల వల్ల కాక వాటిని అణిచివుంచడం, వ్యతిరేకత లాంటి వాటి వల్ల కలుగుతాయి. ఎటువంటి బిడియం, సంకోచం లేకుండా మన కోరికలు తీర్చుకునే అవకాశం వుంటే అవి తీవ్ర రూపం దాల్చవు. ఏ రూపంలోనైనా విపరీత ధోరణి బిడియం, అణచివేత లకు మరో రూపం మాత్రమె. దూకుడు, హింస అనేవి భయానికి, అసమర్ధతకు నీడ లాంటి శక్తులు."

కామసూత్రలోని ఆధ్యాత్మిక కోణం !!
అత్యంత ఆశ్చర్యకరమైన ఈ పుస్తకాన్ని మరింత శోది౦చేకొద్దీ ప్రతి శృంగార భంగిమకూ ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక పరమార్ధం వుందని అర్ధం అవుతుంది. అందువల్ల మనం ఇన్నాళ్ళూ ఊహించిన దానికన్నా కామసూత్ర చాలా భిన్నమైనది. అయితే ఆనందం అనే మరో కోణం నుంచి దీన్ని చూసి ఆనందించాలి అంతే. ఆ విధంగానే మీరు చివరికి ఆధ్యాత్మికతను అనుభవించగలరు.



Click it and Unblock the Notifications









![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)

