For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ పూజారి శివలింగంపై కాలు మోపేవారు.. అయినా ఎవ్వరూ తప్పుగా భావించే వారు కాదు.. ఎందుకో తెలుసా...

శివుని కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కెఎన్ క్రిష్ణ భట్ గురించి కొన్ని ఆసక్తికరమైన కథలను తెలుసుకుందాం.

|

మనలో చాలా మందికి చారిత్రక ప్రదేశం హంపి గురించి తెలిసే ఉంటుంది. మన భారతదేశంలో ఇప్పటికీ చారిత్రక ప్రదేశాల్లో హంపి ఒకటిగా విరాజిల్లుతోంది. హంపి పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా హోస్పేట్ సమీపంలో ఉండే ఈ ప్రాంతానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ పోతుంటారు.

The Story Of KN Krishna Bhat, A Priest Who Dedicated His Life To Maha Shiva in Telugu

ఇక్కడ ఉండే చారిత్రక ప్రదేశాలు, రాళ్లతో నిర్మించిన సంగీత వాయిద్యాలు, రాయిని మీటితే వచ్చే సంగీత శబ్దాలు వంటి వాటితో పక్కనే తుంగభద్ర ఒడ్డున ఉండే విరుపాక్షి దేవాలయం, విజయనగర సామ్రాజ్య వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అక్కడ ఉండే బదవలింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

The Story Of KN Krishna Bhat, A Priest Who Dedicated His Life To Maha Shiva in Telugu

హంపిలోకి ప్రవేశించడానికి ముందే మనకు ఎదురయ్యే బదవలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ శివాలయంలో పూజలు చేసే పూజారి తన జీవితాన్ని శివునికి అంకితం చేశాడు. ఇటీవలే తను శివైక్యం చెందాడు. ఈ సందర్భంగా తన సేవల గురించి ఈ బదవలింగం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

500 ఏళ్ల క్రితం..

500 ఏళ్ల క్రితం..

చరిత్రను పరిశీలిస్తే, 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యం అక్రమ దాడులకు గురైంది. ఈ విధ్యంసం వల్ల చారిత్రక ప్రదేశం హంపిలో ఉన్న బదవలింగ మహాదేవ ఆలయంలోని పరమేశ్వరునికి పూజలు జరగలేదు. ఈ ఆలయంలోని శివుడిని బదవ లింగం అని అంటారు. ఈ దాడుల్లో బదవలింగం పైకప్పు ధ్వంసం చేయబడింది. కానీ బదవ లింగం మాత్రం చెక్కు చెదరలేదు.

సూర్యకిరణాలు నేరుగా..

సూర్యకిరణాలు నేరుగా..

అంతేకాదు, ధ్వంసం అయిన స్థానం నుండి సూర్యకిరణాలు నేరుగా బదవ లింగంపై నేరుగా పడి శివ లింగాన్ని తేజోవంతంగా చేయడం ప్రారంభమైంది. కన్నడంలో బదవి అంటే పేద మహిళ అని అర్థం. బదవి లింగం అంటే పేద మహిళ యొక్క శివ లింగం అని అర్థం. ఈ పేద మహిళని ఏ ఒక్కరు గుడి మెట్లను ఎక్కనివ్వకపోవడంతో స్వయానా ఆమె డబ్బులు సేకరించి ఈ ఆలయాన్ని స్థాపించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

1980 నుండి..

1980 నుండి..

ఈ బదవ లింగానికి 1980 నుండి భక్తులు పూజలు చేయడం ప్రారంభించారు. 40 సంవత్సరాల క్రితం శ్రీ కే.ఎన్.క్రిష్ణ భట్ అనే ఒక పూజారి ఓ చిన్న గ్రామం నుండి హంపికి చేరుకున్నారు. తను దాదాపు ముప్పై సంవత్సరాల నుండి శివయ్య సేవలోనే సేదతీరారు. హంపిలో రాళ్లు మండుతున్న, ఒంట్లో సత్తువ లేకున్నా ఆయన శివునికి సేవ చేయడం ఏనాడు ఆపలేదు.

ఎలాంటి సాయం లేకుండా..

ఎలాంటి సాయం లేకుండా..

సాధారణంగా మనలో ఎవరైనా పొరపాటున ఏదైనా చిన్న వస్తువును లేదా ఎవరికైనా కాలు తగిలితే చాలా తప్పుగా భావిస్తాం. అలాంటి దేవుని విగ్రహానికి మన కాలు తగిలితే, కచ్చితంగా పాపం వస్తుందని భావిస్తారు. అయితే కెఎన్.క్రిష్ణ భట్ పూజారి విషయంలో ఇవేవీ చెల్లవు. ఎందుకంటే ఆయన సుమారు 30 ఏళ్ల నుండి 10 అడుగుల బదవిలింగాన్ని ఎలాంటి సాయం లేకుండా ఎక్కి స్వయంగా తానే శుభ్రపరచడమే కాదు, ఆ లింగాన్ని అందంగా అలంకరించి, విభూది రాసి శివయ్యకు తోడుగా నీడగా ఉన్నాడు.

మహాభక్తుడిలా క్రిష్ణ భట్..

మహాభక్తుడిలా క్రిష్ణ భట్..

అందుకే శివయ్య ఆ లింగంపై కాలు మోపినా కూడా ఎవ్వరూ దాన్ని తప్పుగా భావించరు. ఎందుకంటే తను మహాభక్తుడిలా కనిపిస్తాడు. అందుకే హంపికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఆయన గుర్తుండిపోతారు. ఈ మహా పండితుడికి రెండేళ్లకు లేదా ఆరు నెలలకు ఒకసారి మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. అయినా కూడా ఆయన 40 ఏళ్ల నుండి ఏ ఒక్కరోజు శివుని సేవకు దూరం కాలేదు.

ఇటీవలే శివైక్యం..

ఇటీవలే శివైక్యం..

అలాంటి మహాభక్తుడు క్రిష్ణభట్ ఇటీవలే శివైక్యం చెందారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు శివుని సేవలోనే జన్మించారు. ఇప్పుడు ఆయన మరణంతో శివుడిని చేరి ఉంటారని చాలా మంది నమ్ముతారు. మనలో ఎందరో దేవుళ్లను పూజిస్తారు. కానీ కొందరే దేవుడికి దగ్గరవుతారు. అతి కొద్ది మందే దేవుని అనుగ్రహం పొందుతారు. మరి కొందరు దేవునిలో కలిసిపోతారు. అలాంటి వారిలో క్రిష్ణ భట్ కచ్చితంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

English summary

The Story Of KN Krishna Bhat, A Priest Who Dedicated His Life To Maha Shiva in Telugu

Here we are talking about the story of KN krishna bhat, a priest who dedicated his life to Maha Shiva in Telugu. Read on
Story first published:Monday, May 24, 2021, 14:11 [IST]
Desktop Bottom Promotion