For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్తర ప్రగల్భాలు అనే మాట అలా వచ్చింది, ఉత్తరుడిలా మాట్లాడకండి దమ్ముంటే చేసి చూపించాలి

ఉత్తర కుమారుడు "ఆ కౌరవులను మట్టుబెడుతాను. మన రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను. ఇక నుంచి ఇటు వైపు వారు రావాలంటే ముచ్చెమటలు పడతాయి. వారికి ఉత్తరకుమారుడి దమ్ము, ధైర్యం ఏమిటో చూపిస్తాను" అని అంటాడు

|

ఉత్తర కుమారుడు ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. ఇప్పుడున్న రాజకీయనాయకుల్లో చాలా మందిని ఉత్తర కుమారుడితో పోల్చుతుంటారు. ఉత్తర ప్రగల్భాలు పలకవద్దని విమర్శిస్తుంటారు.

ఉత్తర కుమారుడు విరాటరాజుకు రెండో కుమారుడు. ఇతన్ని భూమింజయుడు అని కూడా అంటారు.
అవి పాండువులు అరణ్యవాసం చేస్తున్న రోజులు. అయితే దుర్యోధనుడు మారు రూపంలో ఉన్న పాండవులను కనిపెట్టాలని ప్రయత్నిస్తుంటాడు.

ఉత్తర కుమారుడి రాజ్యంలో ఉన్నారని..

ఉత్తర కుమారుడి రాజ్యంలో ఉన్నారని..

అలా చేస్తే మరో 12 సంవత్సరాలు పాండవులు అరణ్యవాసం చేసేలా చేయొచ్చని దుర్యోధనుడుఅనుకుంటాడు. అందుకోసం కొందరు మనుషులను నియమించి రహస్యంగా పాండువుల కోసం వెతుకుతుంటాడు. ఉత్తర కుమారుడి రాజ్యంలో ఉన్నారని సమాచారం రావడంతో అక్కడ ఎక్కువగా గాలింపు చర్యలు చేపడుతారు. అయితే ఎక్కడా కూడా పాండవులు దొరకరు. దీంతో విసుగు వచ్చిన కౌరవులు వారికి ఏదో ఒక నష్టాన్ని కలిగించాలని అనుకుంటూ ఉంటారు.

ఆవులను దొంగలించడం

ఆవులను దొంగలించడం

పాండువులు దొరకలేదని ఆవులను దొంగలించుని వెళ్తుంటారు. దీంతో ప్రజలంతా తమ బాధలను యువరాజు ఉత్తర కుమారుడికి చెబుతారు. "మాపై ఎవరు దాడికి పాల్పడుతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు దాడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. మా ఆవులను ఎవరు తీసుకెళ్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ ఇదంతా కౌరవులే చేస్తున్నారని మాకు అనుమానంగా ఉంది " అంటూ తమ బాధ చెప్పుకుంటారు ప్రజలు.

ముచ్చెమటలు పట్టిస్తాను

ముచ్చెమటలు పట్టిస్తాను

దీంతో ఉత్తర కుమారుడు "ఆ కౌరవులను మట్టుబెడుతాను. మన రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను. ఇక నుంచి ఇటు వైపు వారు రావాలంటే ముచ్చెమటలు పడతాయి. వారికి ఉత్తరకుమారుడి దమ్ము, ధైర్యం ఏమిటో చూపిస్తాను" అని అంటాడు. దీంతో రాజ్యంలోని యాదవులంతా ఆనందపడతారు. ఇక అక్కడే మారువేషంలో ఉండే పాండువులు కూడా ఉత్తరకుమారుడిని యుద్ధానికి సిద్ధం చేస్తారు.

గజగజ వణికిపోతాడు

గజగజ వణికిపోతాడు

అయితే ఉత్తమ కుమారుడు ఎప్పుడు కూడా కత్తి పట్టి ఉండడు. అలాగే యుద్ధం అంటే కూడా ఉత్తరకుమారుడికి చాలా భయం. రణభూమిలో కౌరవ సేనను చూసి గజగజ వణికిపోయాడు. ఉత్తరకుమారుడికి రథసారథిగా అర్జునుడు ఉంటాడు. కానీ అర్జునుడు బృహన్నల మాదిరిగా మారువేషంలో ఉంటాడు కాబట్టి ఆయన అర్జునుడు అని ఉత్తమ కుమారుడికి తెలియదు.

యుద్ధం వచ్చే సరికి చేతులెత్తేశాడు

యుద్ధం వచ్చే సరికి చేతులెత్తేశాడు

ఉత్తర కుమారుడు అది చేస్తా ఇది చేస్తా అని తీరా యుద్ధం వచ్చే సరికి చేతులేత్తేశాడు. అందుకు ఇప్పటికీ ఉత్తర ప్రగల్భాలు పలకకు అంటూ ఉంటారు. ఉత్తర కుమారుడు అర్జునుడిని వేడుకుంటాడు. దయజేసి ఇక్కడి నుంచి రథాన్ని మళ్లించు అని కోరతాడు. కానీ అప్పటికే అరణ్యవాసం అయిపోవడంతో అర్జునుడు తన నిజరూపం చూపిస్తాడు. దీంతో ఉత్తరకుమారుడు ఆశ్చర్యపోతాడు.

దమ్ముంటే చేసి చూపించాలి

దమ్ముంటే చేసి చూపించాలి

అక్కడ శమీ చెట్టుపై ఆయుధాలుంటాయి అవి తీసుకురా అంటాడు. కానీ అవన్నీ అతనికి పాముల మాదిరిగా కనపడతాయి. చివరకు వాటిని ఎంతో ధైర్యం చేసి తీసుకొని వచ్చి అర్జునుడికి ఇస్తాడు. అర్జునుడి వల్ల యుద్ధంలో విజయం సాధిస్తాడు. అయితే ఉత్తర కుమారుడు మొదట పలికిన ప్రగల్భాలను రణరంగంలో మాత్రం అస్సలు అమలు చేయడు. అందుకే ఉత్తర కుమారుడిలా ఎప్పుడు మాట్లాడకూడదు. దమ్ముంటే చేసి చూపించాలి. లేదంటే ఉత్తరకుమారుడి మాదిరిగా అయిపోతాం.

English summary

the story of uttara kumara in mahabharata

Uttar is a name many few are aware and or remember even somewhere heard of. He was son of virat and brother of Uttara ( wife of abhimanyu). His story is funny and inspiring.
Story first published:Tuesday, July 31, 2018, 11:42 [IST]
Desktop Bottom Promotion