Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
వాలి సుగ్రీవులు తనకు పుట్టలేదని గౌతమ మహర్షి ఎలా కనుకున్నాడో తెలుసా? తర్వాత ఏం చేశాడు
ఒకసారి గౌతముడు ఇద్దరు కొడుకులను భుజాలపై ఎక్కించుకుని అంజనా దేవి నడిపించుకుంటూ ఒక సరస్సు గట్టున వెళ్తుంటాడు. అయితే అంజనా దేవి మనస్సులో బాధపడుతూ ఉంటుంది.
పురాణాల్లోని అహల్య పేరు అందరికీ తెలిసిందే. ఈమె గౌతముడి భార్య. అయితే ఎంతో సౌందర్యవతి, గుణవతి అయిన ఆమెపై ఇంద్రుడు కన్నెస్తాడు. అయితే అహల్య ఇంద్రుడకి లొంగకపోవడంతో గౌతముడి వేషంలో వెళ్లి అహల్యను అనుభవిస్తాడు. ఇక గౌతమ మహర్షికి మంత్రాల సృష్టికర్తగా మంచి పేరుంది. ఆయన శపిస్తే కచ్చితంగా అలాగే జరిగేది.

గౌతమ మహర్షి, అహల్యలకు ముగ్గురు సంతానం
ఇక గౌతమ మహర్షి, అహల్యలకు ముగ్గురు సంతానం కలుగుతారు. వారే వాలి సుగ్రీవుడు, అంజనా దేవి (ఆంజనేయుడి తల్లి). అయితే వీరంతా తన సంతానమే అని అనుకుంటాడు గౌతమ మహర్షి. కానీ అహల్యతో ఇంద్రుడు కోరిక తీర్చుకోవడం వల్ల వాలి సుగ్రీవుడు పుట్టారనే విషయం గౌతముడికి తెలియదు. కానీ వారి కూతురు అంజనా దేవికి మాత్రం ఈ విషయం తెలుస్తుంది.

ఎవరికో పుట్టిన వాళ్లను ఎత్తుకున్నాడు
ఒకసారి గౌతముడు ఇద్దరు కొడుకులను భుజాలపై ఎక్కించుకుని అంజనా దేవి నడిపించుకుంటూ ఒక సరస్సు గట్టున వెళ్తుంటాడు. అయితే అంజనా దేవి మనస్సులో బాధపడుతూ ఉంటుంది. ఎవరికో పుట్టిన వాళ్లను మా నాన్న ఇలా భుజాన ఎత్తుకుని వెళ్తాడున్నాడని బాధపడుతుంది.
అలా అంజనా దేవి మనస్సులో అనుకునే విషయం కూడా
గౌతముడికి తెలిసిపోతుంది.
వెంటనే తన కూతురు అనుకునే విషయంలో ఎంత వరకు నిజం ఉందోనని పరీక్షించుకోవాలనుకుంటాడు. తన ఇద్దరు కుమారులను సరస్సులో పడేసి వీళ్లు నాకు పుడితే అలాగే ఉంటారు. పరాయి వాళ్లకు పుట్టి ఉంటే వానరాళ్ల మాదిరిగా మారుతారని గౌతముడు అంటాడు.

గౌతముడికి కోపం వస్తుంది
అయితే వాలి, సుగ్రీవులిద్దరూ కూడా వానర రూపంలో తిరిగి గడ్డకు వస్తారు. దాంతో గౌతముడికి కోపం వస్తుంది. అయినా ఇంద్రుడు వచ్చి తన కోరికను తీర్చుకుని పోతుంటే నువ్వు బండలాగా ఎందుకున్నావంటూ అహల్యను శపిస్తాడు. నువ్వు బండలాగా మారు అని అంటాడు. దాంతో అహల్య బండమాదిరిగా మారిపోతుంది. అయితే అహల్య అంజనాదేవిపై కోప్పడుతుంది. పరాయి వ్యక్తి వచ్చిన విషయం తెలిసి కూడా తనతో ఎందుకు చెప్పలేదని అంజనాదేవిని శపిస్తుంది.
నువ్వు అంధురాలివిగా మారుతావు.. అలాగే నీకు పుట్టబోయే బిడ్డ కూడా వానర రూపాన్నే దాల్చుతాడు అని శపిస్తుంది.
తర్వాత అంజనా దేవి కిష్కిందకు చేరుకుంటుంది. కేసరిని పెళ్లి చేసుకుంటుంది. వీరికి హనుమంతుడు పుడతాడు. అహల్య శాపం వల్ల ఆంజనేయుడు వానర రూపంలో పుడతాడు.

వాలి, సుగ్రీవుల పుట్టుకకు సంబంధించి మరో కథ
వాలి, సుగ్రీవులను గౌతముడు చేరదీయడు. దీంతో వారిద్దరూ వానరులకు ఆదిమ పురుషుడైన ఋక్ష విరజుడు దగ్గరకు వెళ్తారు. ఆయన వారిద్దరినీ పెంచుతాడు. కిష్కింధ రాజ్యానికి వాలిని రాజును చేస్తాడు. ఇక వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడే తగాదాల వల్ల వాలి శ్రీరాముడి చేతితో చనిపోతాడు. అయితే వాలి, సుగ్రీవుల పుట్టుకకు సంబంధించి మరో కథరామాయణంలో ఉంది.
బ్రహ్మ తపస్సు చేసేటప్పుడు ఆయన నేత్రాల నుంచి వచ్చిన అశ్రువుల ద్వారా పుట్టిన వాడే ఋక్ష విరజుడు (వృక్షవ్రజుడు). అయితే ఆయన అడవిలో ఉన్నపుడు ఒకసారి చెరువులో స్నానం చేస్తాడు. తర్వాత ఋక్ష విరజుడు అందమైన అమ్మాయిలా మారిపోతాడు.
ఎందుకంటే ఆ చెరువులో గతంలో పార్వతి దేవి స్నానమాచరించి ఉంటుంది. దీంతో అమ్మాయిలా మారిపోతాడు.

వానర జాతి బాగా విస్తరించింది
అప్పుడే సూర్యుడు, ఇంద్రుడు ఇద్దరూ ఆ అమ్మాయిని చూసి మోహిస్తారు. ఆమెపై సూర్యుడి కాంతి పడడంతోసుగ్రీవుడు, ఇంద్రుడు మోహించడం వల్ల వాలి పుడతారు. అయితే ఆ మరుసటి మళ్లీ వృక్ష వ్రజుడు తన రూపాన్ని పొందుతాడు. అలా వృక్ష వ్రజుడు అమ్మాయిగా మారినప్పుడు పుట్టిన వారే వాలీసుగ్రీవులు. వారి వల్ల వానర జాతి బాగా విస్తరించింది.



Click it and Unblock the Notifications