Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్కార్న్తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
శని దోషాలకు బ్రహ్మాస్త్రం..శనివారం రావి చెట్టుకు ఈ చిన్న పనులు చేస్తే కష్టాలన్నీ దూరం!
హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. అందులోనూ శనివారం నాడు రావి చెట్టును పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ జీవితంలో శని దోషం, ఏలినాటి శని, లేదా అర్ధాష్టమ శని వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారా?
శనివారం రోజున రావి చెట్టుకు చేసే కొన్ని సులభమైన, శక్తివంతమైన పరిహారాలు మీకు అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తాయి. వృత్తిలో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, నరదిష్టి, వివాహ సంబంధిత సమస్యల నుండి బయటపడేందుకు ఈ పరిహారాలు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయని పండితులు చెబుతున్నారు. అవేమిటో ఇక్కడ చూడండి.

వృత్తిలో పురోగతి, అఖండ ఐశ్వర్యం కోసం
శనివారం ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకుని, ఒక పత్తి దారాన్ని (ముడి దారం) తీసుకోండి. ఆ దారాన్ని రావి చెట్టు కాండానికి ఏడుసార్లు భక్తిశ్రద్ధలతో చుట్టాలి. ఆ తర్వాత అక్కడే నిలబడి, శని దేవుడిని మనసారా స్మరిస్తూ.. ఓం ఐం శ్రీం హ్రీం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
జపం పూర్తయిన తర్వాత మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని ప్రార్థించండి. మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం వల్ల మీ వృత్తి, వ్యాపారాలలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది.
నరదిష్టి,నెగిటివ్ ఎనర్జీ నివారణకు
మీరు లేదా మీ కుటుంబం తరచుగా దిష్టి దోషాలకు గురవుతున్నట్లయితే ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. శనివారం రోజు రావి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని..ఓం శ్రీం షణ్ శ్రీం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 31 సార్లు భక్తితో జపించండి.
జపం పూర్తయిన తర్వాత, ఒక నీలి రంగు పువ్వును తీసుకుని దానిని పారే మురికి కాలువలో వేయండి. ఈ చిన్న పరిహారం మీ దరిచేరిన నెగెటివ్ ఎనర్జీని, తీవ్రమైన దిష్టి దోషాలను క్షణాల్లో పారద్రోలుతుందని నమ్ముతారు.
సంతోషకరమైన కుటుంబ, వైవాహిక జీవితం కోసం
వైవాహిక జీవితంలో ఆటంకాలు ఉన్నా, కుటుంబంలో కలహాలు వస్తున్నట్లయితే..శనివారం రోజున గుప్పెడు నల్ల నువ్వులను తీసుకుని రావి చెట్టు మొదలులో (వేరు వద్ద) సమర్పించండి.
తర్వాత ఆ వేరుపై స్వచ్ఛమైన నీటిని పోస్తూ..ఓం శ్రీం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ అద్భుతమైన పరిహారం మీ కుటుంబంలో నెలకొన్న సమస్యలను తొలగించి, ఆనందాన్ని తిరిగి తీసుకువస్తుంది.

మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యల నుండి ముక్తికి
అప్పుల బాధలు, మానసిక ఒత్తిడి, కెరీర్ పరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వాళ్లయితే శనివారం నాడు ఒక చిన్న గిన్నెలో ఆవనూనె నింపుకుని, దానిని చేతిలో పట్టుకుని.. ఓం ప్రాం ప్రీం ప్రాం శణైశ్చరాయ నమః అనే శని దేవుని మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ఎంతటి తీవ్రమైన ఆర్థిక, వృత్తి సంబంధిత సమస్యలైనా ఇట్టే సమసిపోతాయి.
సకల కష్టాలను కడతేర్చే నల్ల నువ్వుల పరిహారం
మీరు ఏ పని మొదలుపెట్టినా విఫలమవుతోందా? జీవితం నిరంతర పోరాటంలా మారిందా? అయితే శనివారం నాడు ఒక సులభమైన పరిహారాన్ని ప్రయత్నించండి. ఒక గుప్పెడు నల్ల నువ్వులను తీసుకోండి. శని భగవానుడిని మనసారా ధ్యానిస్తూ, మీ కష్టాలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఆ నువ్వులను పారే నదిలో వేయండి.
ఒకవేళ నది అందుబాటులో లేకపోతే, ఎక్కడైనా ప్రవహించే నీటిలో వేయవచ్చు. ఈ పరిహారం మీ జీవితంలోని అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లను తొలగించి, మీకు కష్టాల నుండి శాశ్వత విముక్తిని ప్రసాదిస్తుంది.
Discliamer: మతవిశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.



Click it and Unblock the Notifications