For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భగవంతుని కృపాకటాక్షాలను పొందడానికి హిందువులు ఆచరించదగిన పది పూజలు!

|

మనలో చాలామందికి ప్రకృతి మాత యొక్క చల్లని ఒడిలో సేద తీరుతూ ప్రశాంత జీవనం కొనసాగించాలనే గాఢమైన కోరిక ఉంటుంది. కానీ కొంతమందికి దీనితో పాటుగా వృత్తిలో విజయాలను అందుకుంటూ, విలాసవంతమైన జీవనశైలితో గడుపుతూ, కీర్తి ప్రతిష్టలు మరియు సకల సంపదలతో తులతూగాలని ఆకాంక్ష ఉంటుంది.

ఒక హిందువు పుట్టుక నుండి, జీవితంలో కర్మ మరియు ధర్మం,ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటారు, వీటి సమతుల్యతను సాధించిన వారికే, అంతిమంగా మోక్షం సిద్ధిస్తుంది. ఒక దైవిక శక్తి మన కర్మఫలాన్ని నియంత్రిస్తుంది.

These 10 pujas have powerful blessings

హిందూమతంలో, మనం నమ్మే దేవునికి లేదా దైవిక శక్తి పట్ల మనకున్న శ్రద్ధాభక్తులను, పూజ ద్వారా తెలియజేస్తాము. ప్రార్థనలు చేయడం, భజనలు పాడటం, మంత్రాలు జపించడం, పవిత్రమైన ఆచారాలను పాటించడం పూజ యొక్క విధి విధానాలలో ఒక భాగమే! ఈ విధంగా ఒక హిందువు, తన ఇష్టదైవంతో ఒక దైవిక సంబంధానికి మార్గం ఏర్పరుచుకుంటాడు.

హిందూ భక్తుల జీవితంలో, పూజలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంత వేగవంతమైన హడావిడి జీవితాలలో, ఖచ్చితంగా పూర్తి చేయవలసిన లక్ష్యాలు ఉన్నప్పటికీకూడా, రోజులో కొంత సమయాన్ని పూజలు చేసి, భగవంతుని ఆశీర్వాదం పొందేందుకు, తద్వారా సంపన్నమైన జీవితం గడిపేందుకు కేటాయిస్తాము.

పవిత్ర హిందూ మతగ్రంథాలు, ఈ క్రింది పూజలు చేస్తే, దేవుళ్ళు మరియు దేవతల యొక్క ఆశీస్సులు మన వెంట ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తున్నాయి. స్వచ్ఛమైన మనస్సుతో, భక్తిశ్రద్ధలతో ఈ పూజలు చేసేవారి కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వసిస్తారు.

1. వినాయకుని పూజ

1. వినాయకుని పూజ

వినాయకుడు, హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరు. ఏ పూజ మనం చేస్తున్నప్పటికీ, ప్రథమ పూజను మాత్రం ఈయనకే చేయాలి. అయితే, వినాయకునికి మాత్రమే ప్రత్యేకంగా పూజ చేస్తే, భక్తుని జీవితంలో అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పూజా ద్వారా మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు మరియు విజయాన్ని సాధించవచ్చు.

2. లక్ష్మి పూజ

2. లక్ష్మి పూజ

లక్ష్మి దేవి, శక్తి యొక్క ముఖ్య రూపాలలో ఒకటి మరియు ఆమె భక్తులు ఆమెను చాలా భక్తిప్రపత్తులతో కొలుస్తారు. దుర్గ మరియు సరస్వతితో పాటుగా, ఈమె హిందూ త్రిమూర్తి దేవతలలో ఒకరు. ఒక వ్యక్తి జీవితంలో లక్ష్మి పూజ చేయటం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.

3. శనిదేవుని పూజ

3. శనిదేవుని పూజ

శనిశింగనాపూర్ పవిత్ర మందిరంలో స్వయంభువుగా వెలసిన శనిదేవునికి తైల సమర్పణ చేయటం, శని దోష నివారణ కొరకు మనం చేయగలిగే అత్యంత శక్తివంతమైన పరిష్కారం. దేశ నలుమూలల నుండి భక్తులు, శింగనాపూర్లోని శనిదేవుని ఆలయంలో తైలాభిషేకం చేయడం కొరకు సందర్శిస్తారు. ఇలా చేస్తే, శనిదోష నివారణతో పాటుగా, చెడు కర్మ ప్రభావాలు తొలగి, వైవాహిక మరియు వ్యక్తిగత సమస్యలను పూర్తిగా పరిష్కరించబడతాయి.

4. పార్థివ శివలింగ పూజ

4. పార్థివ శివలింగ పూజ

పార్థివ శివలింగ పూజ, శివునికి అంకితం చేయబడిన ఒక ప్రత్యేకమైన పూజ. పార్థివ శివలింగం అనగా మట్టి లేదా ఇసుకతో తయారు చేయబడిన శివలింగం. మీ తరపున, పవిత్ర గంగ నది ఒడ్డున స్థాపన చేయబడిన 108 పార్థి శివలింగాలకు, అభిషేకం నిర్వహిస్తారు. ఓంకారేశ్వర్ మరియు కాశీ జ్యోతిర్లింగ దేవాలయాలలో కూడా, ఈ పూజ చేయవచ్చు. ఈ పూజ చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్రహదోషాలు, వ్యాధులు, దురదృష్టం, ప్రమాదాలు మరియు ఒత్తిడి నివారణకు, ఈ పూజ మంచి పరిష్కారం.

5. కాలసర్ప దోష నివారణ పూజ

5. కాలసర్ప దోష నివారణ పూజ

సప్త గ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ), రాహువు మరియు కేతువు అనే గ్రహాల మధ్యగా వచ్చినప్పుడు, కాలసర్ప దోషం కలుగుతుంది. ఈ సమయంలో జన్మించిన వారి జీవితాల్లో దురదృష్టం, మరణం వంటి బాధాకరమైన అనుభవాలు ఎదురవుతాయి. కాలసర్ప దోష నివారణ పూజ చేయడం ద్వారా,ఇటువంటి ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా తొలగడమే కాక, భక్తుల జీవితాలు మెరుగుపడతాయి.

6. మంగళ దోష నివారణ పూజ

6. మంగళ దోష నివారణ పూజ

మంగళ గ్రహం ఒక మండుతున్న గ్రహం. భూమిపై ఉండే జన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధాన నవాగ్రహాలలో ఇది ఒకటి. మంగళ దోష నివారణ పూజ చేసినవారికి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులు తొలగుతాయి.మంగళ దోష నివారణ, సానుకూల ఆలోచనలు మరియు చర్యలను ప్రోత్సహిస్తుంది.

7. మహామృత్యుంజయ మంత్ర జపం

7. మహామృత్యుంజయ మంత్ర జపం

మహామృత్యుంజయ మంత్రం అత్యంత శక్తివంతమైన శివ మంత్రాలలో ఒకటి. ఈ మంత్రాన్ని జపించడం, శివుని ఆశీస్సులను పొందడానికి ఎంతో ప్రభావవంతమైన మార్గం. ఇది ప్రతికూల ఆధ్యాత్మిక ప్రభావాలను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇది కుటుంబం భద్రతకై రక్షణను కవచం ఏర్పాటు చేస్తుంది మరియు ఒక వ్యక్తి ప్రతిష్టాత్మకంగా మారడానికి సహాయపడుతుంది.

8. సత్యనారాయణ వ్రతం మరియు హోమం:

8. సత్యనారాయణ వ్రతం మరియు హోమం:

విష్ణు యొక్క అత్యంత ప్రసిద్ధ రూపాలలో, సత్యనారాయణ స్వామి ఒకరు. ప్రతిచోటా ఈయనను హిందువులు పూజిస్తారు. విష్ణువు యొక్క ఈ రూపాన్ని, సత్యానికి ప్రతీకగా భావిస్తారు. విష్ణు భక్తులలో, ఈ రూపం చాలా ప్రసిద్ది చెందింది. పూర్ణిమ రోజులలో సత్యనారాయణ పూజను జరుపుకోవడాన్ని పవిత్రమైన కార్యంగా భావిస్తారు. జీవితంలో విజయవంతం కావడానికి మరియు శరీరాన్ని మరియు మనస్సును మెరుగుపరచుకోవడానికి,ఈ పూజ తోడ్పడుతుంది.

9. హనుమంతుని పూజ

9. హనుమంతుని పూజ

హనుమంతుని శివుడి అవతారంగా భావిస్తారు. అతను గొప్ప రామభక్తుడు కూడా! సూర్యోదయానికి ముందు హనుమాన్ చాలిసా జపంతో హనుమంతుని పూజ మొదలవుతుంది. హనుమంతుని పూజ మరియు ఆరతి, మీకు మరియు మీ కుటుంబానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఈ పూజ చేసిన భక్తుల మనస్సులలో ఉండే భయాలు తొలగిపోతాయి. జీవితంలో ఎటువంటి కష్టాలను అయినా ఎదుర్కోవటానికి ధైర్యం వస్తుంది.

10. కాత్యాయని పూజ

10. కాత్యాయని పూజ

కాత్యాయని దేవి , హిందూమతంలో ముఖ్య దేవతలలో ఒకరైన మహాశక్తి యొక్క అవతారం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వివిధ రకాల పవిత్ర దేవాలయాలను సందర్శిస్తారు. ఇది అత్యంత ముఖ్యమైన దేవి పూజలలో ఒకటి. దీనిని ఆచరించిన వారికి, అద్భుతమైన ఫలితాలు కలిగుతాయి. కాత్యాయని పూజ చేస్తే మాంగళ్య దోషాలు తొలగి, వైవాహిక జీవితం ఆనందకరంగా, కుటుంబ జీవితం శ్రేయస్కరంగా ఉంటుంది.

English summary

These 10 'pujas' have powerful blessings

The deepest desire of many of us is to live a peaceful life in the calming lap of Mother Nature, but there are some who desire to have some add-ons, like a successful career, luxurious lifestyle, growing fame, and wealth, etc.Being a Hindu, I grew up learning the importance of both Karma and Dharma in life and how establishing its balance can lead us to ultimate salvation. What I also learned was that there was a divine power, which controlled the fruit of our actions.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more