కోరికలు తీర్చే హిందూ వ్రతాలు, ఉపవాస నియమాలు గురించి తెలుసుకోండి

By: Deepti
Subscribe to Boldsky

మన హిందూ సంప్రదాయం లో మనం ఆచరించే పూజలు, నోములు, వ్రతాలకు ఎంతో ప్రాముక్యత ఉంది. అటువంటి వాటి గురించే ఇక్కడ చెప్పే చిన్న ప్రయత్నం చేస్తాను.

హిందూ పూజా విధానంలో వ్రతాలకు విశిష్ట స్థానం ఉంది. పురాణేతిహాసాల కాలం మొదలుగా... సామాన్య ప్రజల నుండి చక్రవర్తుల వరకూ వివిధ వ్రతాలను ఆచరించినట్లు మనకెన్నో తార్కాణాలున్నాయి.

నోములు వ్రతాలు అనగానే స్త్రీలు చేసేవి అనే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. ఈ మాట కొంత వరకు నిజం. ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే. వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో, నోమో సిద్ధంగా ఉంటుంది.

ఆయురారోగ్య సంపదలను సిద్ధింపజేసే అటువంటి వ్రతాలను చేసుకోవడానికి కారణాలు, వ్రత నియమాలు, ప్రాముఖ్యత, వ్రతాలలోని రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కలహ ప్రియుడు నారద ముని గురించి ఆసక్తికరమైన విషయాలు!

హిందూమతంలో వ్రతాల రకాలు

హిందూమతంలో వ్రతాల రకాలు

ప్రతి మతంలో ప్రమాణాలు లేదా మాట ఇవ్వడం అనేది చాలా విశిష్టమైనది ; అది పవిత్రత, భక్తి/ అంకితభావానికి సంబంధించినది. కానీ మీకు ఈ ప్రమాణం అనేది హిందూమతంలో ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో తెలుసా?

 హిందూమతంలో వ్రతం అర్థం మరియు దాని ప్రాముఖ్యత

హిందూమతంలో వ్రతం అర్థం మరియు దాని ప్రాముఖ్యత

సంస్కృతంలో వ్రతం అంటే ప్రమాణం అని అర్థం. ఒక మతపరమైన ఆచారంగా హిందూ పురాణాల్లో చెప్పబడింది. అతిపురాతన హిందూ పవిత్ర గ్రంథాల్లో ఒకటి ఋగ్వేదంలో 200 సార్లు వ్రతం గురించి రాసి ఉంది.

రుగ్వేదంలో సంగ్రహాలు

ఋగ్వేదం ప్రకారం, శ్లోకం 9.112.1, ప్రతి వ్యక్తి పని అతని వ్రతంతో అర్థం కాబడుతుంది. సులభంగా చెప్పాలంటే, అది అతను చేయగలిగిన అతిపెద్ద త్యాగం. ఉపనిషత్తులు వ్రతాలను మూడు రకాలుగా వివరిస్తాయి ; కాయిక ( శరీర శుద్ధికోసం), వాచిక ( మాట శుద్ధి కోసం) మరియు మానస ( మనస్సు శుద్ధి కోసం).

వ్రతం ఆచరించే విధానం

వ్రతం ఆచరించే విధానం

వ్రత సమయంలో, ఎవరైతే పాటిస్తున్నారో వారు ఉపవాసం ఉండి, మంత్రాలు, స్తోత్రాలతో స్తుతిస్తూ అన్ని మతాచారాలను, దానమివ్వటం, ఆలయదర్శనం వంటి వాటితో కలిపి చేయాలి. వ్రతలాభాలు.

బోరోదేవి దేవాలయంలో ఆసక్తికర విషయాలు: మానవుని రక్తాన్ని సమర్పణ!

వ్రతలాభాలు లేదా ప్రయోజనాలు

వ్రతలాభాలు లేదా ప్రయోజనాలు

హిందూపండగలలో కొన్ని మామూలు పండగల్లో కూడా అందరూ దీక్షగా వ్రతం చేయాల్సి వుంటుంది. వేదాలు, ఉపనిషత్తుల ప్రకారం అత్యంత భక్తిశ్రద్ధలతో చేసే వ్రతాలు పూజలకు తప్పక దేవతల ఆశీస్సులు ఉంటాయి. ఇలా కఠినదీక్షతో చేసే వ్రతాలు భక్తుల అన్ని కోరికలు తీర్చే శక్తిని కలిగిఉంటాయి.

వ్రత పద్ధతులు మరియు నియమాలు:

వ్రత పద్ధతులు మరియు నియమాలు:

దురదృష్టవశాత్తూ, ఈరోజుల్లో వ్రతాలను ఎవరి సౌలభ్యం ప్రకారం వారు మార్చుకుంటూ జ్ఞానం లేకుండా చేస్తున్నారు. సమయం తీసుకుని, వేదపురాణాలు సహనంతో చదివితే, హిందూ మతంలోని 9 ముఖ్యవ్రతాల గూర్చి తెలుసుకుంటారు.

సంతాపన

సంతాపన

దీనిలో ఒకరోజు మొత్తం పాలిచ్చే జంతువు మూత్రం, ఆవుపేడ, ఆవు మూత్రం, పెరుగుపై బ్రతకాలి. ఆ తర్వాతరోజు ఉపవాసం.

మహాసంతాపన

మహాసంతాపన

ఇది ముందుదానికన్నా కష్టం. సంతాపన వ్రతసమయంలో ఐదు పదార్థాలు పోషకమైనవిగా గుర్తిస్తారు. మహాసంతాపన వ్రతం ఆరురోజులు చేస్తారు. ఒక్కోరోజు ఒక్కో పదార్థం చొప్పున ఐదింటిని పంచుకుంటారు. ఏడవరోజు ఉపవాసం.

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని 5 వస్తువులు..!

ప్రజాపత్య లేదా కృఛ్చ

ప్రజాపత్య లేదా కృఛ్చ

ఈ వ్రతం చేసే సమయంలో, పొద్దునపూట ఎప్పుడైనా తినవచ్చు. మొదటి మూడురోజుల్లో, ఒక వ్యక్తి ఇరవైఆరు సార్లు ముద్దలు మాత్రమే తినాలి. మరియు ప్రతిముద్ద పరిమాణం కోడిగుడ్డు అంత ఉండాలి. తర్వాత మూడు రాత్రులు ఇరవై రెండు ముద్దలు తినవచ్చు. ఇక ఆఖరి మూడురోజులు ఇరవై నాలుగు ముద్దలకు అనుమతి.

అతికృచ్చ

అతికృచ్చ

ఇది ముందుదానికన్నా మరింత కఠినం. మొదటి మూడు రోజులు మధ్యాహ్నం ఒక ముద్ద మాత్రమే తినాలి. తర్వాతి మూడురాత్రులు ఒకముద్ద తినాలి. ఆ తర్వాత మూడు రోజులు ఇరవైరెండు ముద్దలు రాత్రిళ్ళు మాత్రమే తినాలి. ఇక ఆఖరి మూడురోజులు మూడు లేదా నాలుగు ముద్దలు తినవచ్చు.

పరాక

పరాక

ఇందులో, భక్తుడు ఇదే తరహా ఉపవాసాన్ని 12 రోజులు పాటిస్తూ, రోజుకి ఒకముద్దనే తినాలి

తప్తకృఛ్ఛ

తప్తకృఛ్ఛ

ఇది నాలుగురోజుల వ్రతం. మొదటి రోజు కేవలం సాయంకాల భోజనం. రెండవరోజు పూర్తి ఉపవాసం. మూడవరోజు ఎంతకావాలంటే అంత తిని, నాలుగవరోజు మళ్ళీ ఉపవాసం

కృచ్చాతికృఛ్చ

ఈ వ్రతానికి చాలా సంసిద్ధత అవసరం. ఇందులో 21 రోజుల పాటు కేవలం పాలను తాగి జీవించాలి.

పదాతికృచ్చ

ఈ వ్రతం కూడా నాలుగు రోజులు. మొదటిరోజు ఒకసారి భోజనం, రెండవరోజు ఉపవాసం; మూడవరోజు ప్రారంభంలో ఎంతకావాలంటే అంత తిని, నాలుగవరోజు ఉపవాసం.

చాంద్రాయణ

చాంద్రాయణ

ఈ వ్రతం నెలరోజుల పాటు చేస్తారు. పౌర్ణమిన మొదలుపెట్టి, ముఖ్యరోజున పదిహేను ముద్దలు తింటారు. అక్కడినుండి రోజుకో ముద్ద తగ్గిస్తూ, అమావాస్య రోజున మొత్తం ఉపవాసం ఉంటారు. ఇక ఆ తర్వాత రోజుల్లో రోజుకో ముద్ద పెంచుతూ, పౌర్ణమి నాడు పదిహేను ముద్దలతో వ్రతాన్ని ముగిస్తారు.

English summary

These Vrats in Hinduism hold the power to fulfil every wish

A vow is believed to be the deepest form of reverence in every religion; it is chaste and filled with devotion/dedication, for the thing it’s meant for. But, did you know that the concept of ‘Vow’ has its root running deep into Hinduism. Vrat is a Sanskrit etymology, which means a ‘Vow’; a religious votive rite, which several hindu scriptures have described as the practice of austerity.
Subscribe Newsletter