Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Lohri 2025: భోగి మంటల్లో మిస్ అవ్వకుండా కచ్చితంగా వేయాల్సిన వస్తువులు ఇవే!
సంక్రాంతి పండగలో మొట్ట మొదటిగా వచ్చేది భోగి పండగ. భోగి రోజు తెల్లవారు జామునే నిద్రలేచి మొద్దులు, కర్రలు తెచ్చి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ భోగి మంటల్లో మన కష్టాలన్నీ తొలిగిపోతాయని నమ్ముతుంటారు. భోగి మంటల్లో పాత వస్తువులను వేసుకొని కాల్చేస్తుంటారు. ఇది ఆధ్యాత్మికత మాత్రమే కాదు పర్యావరణమైన ప్రాధాన్యతను కూడా కలిసి ఉంది. ఇది మన సంప్రదాయాలకు అనుకూనంగా ఉంటాయి. మన పూర్వికులు అనాదిగా దీనిని ఆచరిస్తున్నారు. అంతటి పవిత్రమైన భోగి మంటల్లో కొన్ని వస్తువులు తప్పనిసరిగా వేయాలి. ఆ వస్తువులను వేయడం వలన జీవితంలో మంచి జరుగుతుందనే నమ్మకం. ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భోగి మంటలో తప్పకుండా వేయాల్సిన వస్తువులు:
పిడకలు:
పిడకలను పశువుల పేడతో తయారుచేస్తారు. ఈ పిడకలు భోగి మంటల్లో కచ్చితంగా వేయాలి. మరీ ముఖ్యంగా ఆవు పేడతో చేసిన పిడకలను భోగి మంటల్లో కచ్చితంగా వేయాలని చెబుతుంటారు. ఎందుకంటే ఇవి ఇంటికి ధూపం పట్టిస్తోందని, ఇంటిలోని చెడు బయటికి వెళ్ళిపోతుందని నమ్ముతుంటారు. అలాగే దోమలు వంటివి కూడా చనిపోతాయని చెబుతారు. అలాగే గాలిని కూడా శుద్ధం చేస్తుందని పేర్కొంటుంటారు.

పాత బట్టలు
భోగి మంటల్లో కచ్చితంగా వేయాల్సిన వస్తువుల్లో పాత బట్టలు కూడా ఒకటి. పాత, పనికిరాని బట్టలను భోగి మంటలో వేయడం వల్ల ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఎలాంటి కీడు జరగదని, దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతుంటారు.
పాత చెత్త
ఇంట్లో పాత చెత్తను భోగి మంటల్లో వేయడం అనేది అనాదిగా వస్తుంది. ఈ చెత్తను భోగి మంటల్లో వేయడం వలన ఇల్లు మొత్తం శుభ్రంగా కనిపిస్తుంది. ఆ చెత్తల్లో ఉంటే ప్రాణాంతకమైన దోమలు మరణిస్తాయి. దీంతో పాటు ఇంట్లోని కీడు అంతా తొలిగిపోతుందని విశ్వసిస్తుంటారు.
చెట్ల కలప
భోగి మంటలు వెలిగించాలంటే చెట్లు అవసరం. అయితే ఆ భోగి మంటల్లో కొన్ని ఔషధ చెట్ల కలప కచ్చితంగా వేయాలి. అందులో రావి, మామిడి, మేడి చెట్ల కలప వేయడం చాలా ముఖ్యం. ఈ చెట్ల నుంచి వచ్చే పొగ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కాలుష్యమైన గాలిని శుభ్రం చేసేస్తోంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
ఆవు నెయ్యి
భోగి మంటల్లో కచ్చితంగా ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యిని మంటల్లో వేయడం వల్ల ఒక ప్రత్యేకమైన పొగ అనేది వస్తుంది. ఆ పొగను పీల్చడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అలాగే ఆవు నెయ్యిని ఎక్కువగా యాగం వంటి వాటిల్లో వేస్తారు కాబట్టి దానికి సంబంధించిన పుణ్యం కూడా కలుగుతుంది.
భోగి మంట వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
భోగి మంట వేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందులో ఒక పర్యావరణ పరిరక్షణ. భోగి మంటల్లో పాత వస్తువులను వేయడం వలన వ్యార్థాలన్నీ తొలిగిపోతాయి. ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేయడం వలన శరీరానికి మంచి జరుగుతుంది. అలాగే ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. చెడు శక్తుల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే దుష్ట శక్తుల నుంచి ఉపశమనం పొందుతారు.



Click it and Unblock the Notifications
