Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ పరిహారం పాటిస్తే.. మీరు పట్టిందల్లా బంగారమే..! సమస్యలన్నీ తొలగిపోతాయ్..!
కుటుంబంలో మనిషికి ఆర్థిక సమస్యలు చాలా బాధపెడతాయ్. సరైన ఉద్యోగం జీవనోపాధి లభించక చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలీ చాలని జీతాలతో రకరకాల బాధలను అనుభవిస్తూ వున్నారు. వారికి ఇంట్లో వున్న అవసరాలు కూడా పూర్తిగా తీరడం లేదు. ఈ సమయంలో విపరీతమైన అప్పులను చేసి తమ మీద భారం వేసుకుంటున్నారు. అప్పులు చేస్తే వాటి నుంచి భయటపడ్డం ఎంత కష్టమైన విషయమో మనందరికీ తెలిసిందే. ఒక్కసారి అప్పు చేస్తే నీడలా వెంటాడుతుంది, ఆర్థిక సమస్యలే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కవౌతాయ్. మీకున్న ఆర్థిక సమస్యలు, నరదృష్టి, బాధలు పోవాలంటే కొన్ని పరిహారాలను చేయాలని శాస్త్రంతో పాటు పండితులు చెబుతున్నారు. ఇవి చేయడం వల్ల కచ్ఛితంగా మార్పు వచ్చి ఆర్థిక సమస్యలు తొలగుతాయని చెబుతున్నారు.

సహదేవి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. ఈ చెట్టు రోడ్ల పక్కన కూడా మనకు కనిపిస్తుంది. ఈ చెట్టు సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని శాస్త్రం మనకు చెబుతోంది. ఈ చెట్టులో రెండు రకాలుంటాయ్. ఎరుపు రంగులో పువ్వులు పూచే మొక్క, పసుపు రంగులో పువ్వులు పూచే మొక్క. ఒక మంచి రోజు చూసుకొని సహదేవి చెట్టు దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి ఆ చెట్టుకు ప్రదక్షిన చేసి ఆ చెట్టుకు ఉత్తరం వైపు వున్న వేరును తీసుకోవాలి. దానిమ్మ చెట్టు దగ్గరికి వెళ్లి కూడా ఉత్తరం వైపు వున్న వేరును తీసుకోవాలి. ఇంటికి వచ్చిన తరువాత ఈ రెండు వేరులను ముందుగా కడిగి, ఒక తాయత్తు తీసుకొని అందులో ఈ వేరులను, గంధం, పచ్చ కర్పూరం వేసి దాన్ని ఒక ఎర్రటి దారానికి కట్టాలి. ఈ తాయత్తుని కుడి చేతికి కట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల మీరు మొదలుపెట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయ్. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది అప్పుల తీరుతాయ్, మీరు కావాలనుకున్న వస్తువులను కొనుక్కోగలుగుతారు. మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినా అందులో మంచి విజయాలను పొందుతారు.
లక్ష్మీ నారాయణుడి అనుగ్రహం లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. చాతుర్మాసంలో శ్రీమన్నారాయణిడికి భక్తి శ్రద్ధలతో పూజించాలి. స్వామి వారి ఆలయానికి వెళ్లి పూజలు, అర్చన చేయించి, ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను ప్రసాదించాలి. ఆ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తుండాలి. ఆ స్వామిని ధ్యానం చేస్తూనే జాగారం చేయాలి. ఇలా చేయటం వల్ల అనేక జన్మల పాపం తొలగిపోతుందని అంటున్నారు.
ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమరాసి మామిడి తోరణాలు, పూలతో అలంకరించాలి. ఇలా చేసిన ఇంట్లో అనారోగ్య సమస్యలు రాకుండా వుంటాయ్. ఇంట్లోకి ఎటువంటి చెబు శక్తి కూడా ప్రవేశించదని చెబుతున్నారు. లక్ష్మీ దేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది. కుటుంబంలో వున్న అన్ని ఆర్థిక సమస్యలను తీరుస్తుంది.
గమనిక : పైన ఇవ్వబడిన వివరాలన్నీ శాస్త్రం లోంచి ప్రముఖ పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించినవి. కాబట్టి వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications