Latest Updates
-
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026
నేడు బుద్ద పౌర్ణిమ మరియు వైశాఖ పూర్ణిమ ఈరోజు ఇలా పూజ చేస్తే 10 తరాల ఐశ్వర్యం పొందుతారు..!
Buddha Purnima and Vaishakha Purnima వైశాఖ మాసంలోని శుక్ల పక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని అంటారు. రోజూ చేసే పూజలు ఒకెత్తైయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు. మరి ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? పూర్ణిమ రోజున ఎలా పూజ చేస్తే మంచిది. ఏఏ పరిహారాలు పాటించాలనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
హిందూ పంచాంగం ప్రకారం మే 23వ లేదీ వైశాఖ పూర్ణిమ వచ్చింది ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది.

వైశాఖ పూర్ణిమ నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభ యోగాలు వచ్చాయి. దీని వల్ల ఈ పౌర్ణిమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పూర్ణిమ నాడు శివయోగం, సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. అలాగే గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. గజలక్ష్మీ రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది. వైశాక పూర్ణిమ రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది.
ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అద్రుష్టం లభిస్తాయి. భవిష్య పురాణం ప్రకారం ఈ వైశాఖ పూర్ణి రోజున శ్రీ మహా విష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు. కాబట్టి అన్ని పౌర్ణిమల కంటే ఈ వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైనది.
నేడు మే 23 తేదీన గురువారం రోజున స్త్రీ తలస్నానం చేసి పాపిటన కుంకుమ బొట్లు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజు పూజ చేసే వారు పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది.
పౌర్ణిమ రోజున పూజచేసేటప్పుడు అక్షింతలు చేతిలోకి తీసుకుని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షింతలు మీ తలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు.
మీరనుకున్న పనులల్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే ఈ రోజున పూజచేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది.

చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో కచ్ఛితంగా పూజు చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు.
పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది . ఎవరైతే నలితా సహస్రనామం పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయిన సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల మీసమస్యలన్నీ తీరిపోతాయి. పౌర్ణమి రోజున లలితా సహస్ర్తనామం ఒక్కసారి చదివితే చాలు దీని వల్ల మీ దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది.
సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను పూజగదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచిండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది.
చాలా మంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు వైశాఖ పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో ఆవునేయ్యితో దీపాన్ని వెలిగిస్తే పుణ్య ఫలితం దక్కుతుంది.

వైశాఖ పూర్ణిమ రోజున పచ్చిపాలలో పంచదార బియ్యం కలిపి రాత్రి 7 గంటలకు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం స్త్రం: సం చంద్రాంశే నమ: అనే మంత్రాన్ని జపించాలి.
హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున గంగానదిలో తాబేలు అవతారంలో శ్రీ విష్ణువు నివశిస్తాడానిఈ పూర్ణిమ రోజున గంగా నీటిని తాగడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. వైశాఖ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ నదీ స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాంటే వైశాఖ పూర్ణిమ రోజును ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్ని వినాశనం అయ్యి మీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు. గంగాజలం లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా, కావేరి, గోదావరి వంటి పుణ్య నదుల పేర్లు తలచుకుంటూ స్నానం చేస్తే మంచిది.
స్నానం చేసిన తర్వాత ఇంట్లో మొత్తం పసుపు నీళ్ళు చల్లుకుంటే ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. వైవశక్తులు ప్రవేశిస్తాయి. పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పూర్ణిమ రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడుసార్లు ప్రదక్షి చేయాలి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
అలాగే రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోవాలంటే పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి కనకధార స్త్రోత్రం పఠించాలి.
పూర్ణిమ రోజున ఒక రూపాయి బిళ్లకు పసుపు పూసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేసే పనిలో ఏ ఆటంకాలున్నా అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపం వెలిగిస్తే అడ్డంకులు తొలగిపోతాయి.
పిత్రుదోశాలున్న వారు పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున విష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు. పౌర్ణమి రోజున దేవతలను సంతోష పెట్టడానికి ఒక అద్భుతమైన రోజు ఈ రోజు మనకున్నంతలో పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం సిద్ధిస్తుంది. ఈ రోజున చేసే ఏ చిన్న దానం అయినా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది.



Click it and Unblock the Notifications