Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Mahaa Kumbh Mela 2025: నాగసాధువుల సంచలన రహస్యాలు..హిమాలయాల చలిని కూడా తట్టుకునే శక్తి ఎలా వస్తుందంటే..
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అనేక రంగాలకు చెందిన పెద్ద పెద్ద ప్రముఖులు విదేశాల నుంచి కూడా ప్రయాగరాజ్ వస్తున్నారు. 144 ఏళ్లకొకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో ప్రయాగ్ రాజ్ లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించడమే కాకుండా జీవితంలో సానుకూలత, ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం.
కుంభమేళాలో నాగ సాధువులు కూడా హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండే నాగసాధువులు కుంభమేళా సమయంలోనే జనావాసాలలోకి వచ్చి మళ్ళీ తిరిగి హిమాలయాలకు వెళ్లిపోతారు. ఈ నాగ సాధువులు వస్త్రాలు ధరించరు, కేవలం విభూతి ధరిస్తారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ నాగ సాధువులు మాత్రం ఎలాంటి వస్త్రాలు ధరించకుండా గడ్డకట్టే చలిని తట్టుకుని సంగమ స్నానాలు చేయడం చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో నాగ సాధువుల గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఎవరీ నాగసాధువులు?మైనస్ డిగ్రీల చలినీ భరించగలిగే సామర్థ్యం నాగ సాధవులకు ఎలా వచ్చింది? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

అలా మొదలైంది
ఆది శంకరాచార్యుడు నాలుగు మఠాలను స్థాపించిన తర్వాత వాటి భద్రత గురించి ఆందోళన చెంది నాగ సాధువుల బృందాలను ఏర్పాటు చేశారని చెబుతారు. అప్పటి నుంచి నాగసాధువల ప్రస్తానం మొదలైందని అంటారు.
నాగసాధువులకు ఇందుకే చలి పుట్టదు
నాగ సాధువుగా మారడం అనేది ఒక సవాల్ తో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువుల మాదిరిగా కాకుండా నాగ సాధువులు హఠ యోగాను అభ్యసిస్తారు. నాగ సాధువులు చాలా అంకితభావంతో ఉంటారు. సున్నా డిగ్రీల చలిలోనూ వస్త్రాలు ధరించని నాగ సాధువులు ఎటువంటి అసౌకర్యానికి గురికారు. వైద్య అధ్యయనాల ప్రకారం మనుషులు సరైన దుస్తులు లేకుండా మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ లో 2.5 గంటలు, రెండు పొరల దుస్తులతో 1.5 గంటలు జీవించగలరు. నాగ సాధువులు మాత్రం దీనికి అతీతం. తమ రహస్య ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యానికి కారణమని నాగ సాధువులు చెబుతున్నారు. అన్ని రుతువులను తట్టుకోవడానికి నాగ సాధువులు ముఖ్యంగా చేసే 3 రకాల సాధనలు ఉన్నాయి. అవే నాడి శోధన, అగ్ని సాధన, మంత్ర పఠనం.
మంత్ర పఠనం
నాగ సాధువులు నిరంతరం మంత్రాలను పఠించడం వల్ల వారి శరీరంలో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తారు. ఇది వారి శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగేలా చేస్తుంది.
విభూతి
నాగ సాధువుల శరీరాన్ని కప్పి ఉంచే విభూతిలో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేసి చలి నుంచి కాపాడతాయి. విభూతి వారికి ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుందని చెబుతారు.
అగ్ని సాధన
నాగ సాధువులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఓ రకమైన ధ్యానం చేస్తారు. ఈ అంతర్గత వేడి వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది.
ప్రాణాయామం
ప్రాణాయామం ద్వారా నాగాధువులు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రతను అన్ని కాలాల్లో క్రమబద్ధంగా, వెచ్చగా ఉండేలా చూస్తుంది.



Click it and Unblock the Notifications