Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Tirumala Photos: వైభంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..ఈ రోజు ఈ పనులు చేస్తే పాపాలు మూటగట్టుకున్నట్లే
దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాలతో పాటుగా తిరుమలలో కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే అధికారులు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు, బుధవారం తిరుపతిలో వైకుంఠ దర్శనం కోసం టిక్కెట్లు జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకి తీసుకొచ్చిన టీటీడీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వారిని దర్శనానికి అనుమతించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారు. ఈ ఫొటోలలో తిరుమల ఆలయం చాలా చాలా అద్భుతంగా కనిపిస్తోంది. మీరు కూడా ఈ ఫొటోలను ఇక్కడ చూడండి.
ఈ రోజు అస్సలు చేయకూడని పనులివే
వైకుంఠ ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని పాటిస్తేనే వ్రత ఫలం దక్కుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయకూడదో ఇక్కడ చూడండి.

మాంసాహారం
ఈ రోజున మాంసాహారం తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఇది కేవలం ఏకాదశి రోజునే కాకుండా ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఎప్పుడూ వర్తిస్తుంది.
ఉపవాస సమయంలో ఇలా
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఆచారం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడం మాత్రమే కాదు, మనస్సును కూడా నియంత్రించడం. ఈ రోజున బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదు. ఎందుకంటే పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని నమ్మకం. అందుకే బియ్యానికి దూరంగా ఉండాలి. పాలు, పండ్లు, నీరు వంటివి తీసుకోవచ్చు.
వెల్లుల్లి,ఉల్లి వద్దు
ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను వైకుంఠ ఏకాదశి రోజు తీసుకోవడం వల్ల మనస్సు చంచలంగా మారుతుంది. ఏకాదశి వ్రతం ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినది కాబట్టి ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి.
పగటి నిద్ర
పగటిపూట నిద్రపోకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి. విష్ణు నామస్మరణ, భజనలు, కీర్తనలు చేస్తూ గడపాలి.
దూషణ, అబద్దాలు
ఈ రోజున ఎవరినీ దూషించకూడదు, కోపం తెచ్చుకోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications