Latest Updates
-
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ఈ 6 వస్తువులను బెడ్ క్రింద 21 రోజులు పెట్టుకుంటే ఎలాంటి సమస్యైనా పరిష్కారమవుతుంది
పురాతన సంప్రదాయాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, వివాహం సంబంధాల్లో ఎదురయ్యే ఒడిదొడుకులను వాస్తు ప్రకారం సరి చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుంద
జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. శాస్త్రాలు, పురాణాల ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు రెండు మూల కారణాలుంటాయి . వాటిని ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి తప్పకుండా పరిష్కార మార్గం ఉంటుంది. ఒకటి జీవి కర్మ ఫలితం, రెండోది యాదృచ్ఛికంగా జరిగే తప్పుల ఫలితం. చెడు లేదా మంచి కర్మల ఫలితంగా ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వీటిలో వాస్తు ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు ఏ పని తలపెట్టినా అనుకూల ఫలితాలు వెల్లడి కావు.
పురాతన సంప్రదాయాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, వివాహం సంబంధాల్లో ఎదురయ్యే ఒడిదొడుకులను వాస్తు ప్రకారం సరి చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...

కోపం తగ్గించుకోవడానికి
రాత్రి పడుకునేటప్పుడు రాగి పాత్రలో నీరుపోసి మంచం కింద లేదా పక్కన ఉంచాలి. అలాగే రెడ్ సాండిల్ వుడ్ (ఎర్ర చందనం చెక్క)ను దిండు కింద పెట్టుకోవాలి. దీని వల్ల కోపం, ఉద్రేకాలు అదుపులో ఉంటాయట.

వ్యక్తుల్లో దృఢ సంకల్పం పెరగడానికి
వెండి పాత్రలో లేదా గిన్నెలో నీరుపోసి పడుకునే మంచం కింద పెట్టుకోవాలి. అలాగే వెండితో తయారు చేసిన వస్తువులను ధరించడం వల్ల చర్మారానికి తాకితే అద్భుతమైన ఫలితం ఉంటుందట. దీని వల్ల వ్యక్తుల్లో దృఢ సంకల్పం పెరుగుతుందట.

దోష నివారణకు :
బంగారం లేదా వెండి ఆభరణాలను దిండు కింద పెట్టుకుంటే జన్మకుండలిలోని దోష నివారణ అవుతుందట.

అదృష్టం పొందడానికి :
వెండితో చేసిన చేపలను దిండు కింద లేదా పక్కన పెట్టుకోవాలట. అలాగే వెండి పాత్రలో నీళ్లు నింపి అందులోసిల్వర్ పిష్ వేసి ఉంచినా..దీని వల్ల అంతులేని అదృష్టం కలుగుతుందట.

ద్రుష్టి దోషాలు తొలడానికి :
ఇనుముతో తయారు చేసిన పాత్రలో నీరు పోసి 21 రోజుల పాటు మంచం కింద ఉంచాలట. అంతే కాకుండా జాతి రత్నమైన నీలమణిని కూడా దిండు కింద పెట్టుకుంటే చెడు దోష నివారణ జరుగుతుందట.

ఇత్తడి చెంబులో నీళ్లు పోసి
ఇత్తడి చెంబులో నీళ్లు పోసి మంచం కింద ఉంచితే మంచి ఫలితం ఉంటుందట.



Click it and Unblock the Notifications