Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Gayatri Mantra : గాయత్రి మంత్రం పఠించడం వెనక రహస్యం..!
గాయత్రి మంత్రంలో అనంతమైన శక్తి ఉంటుంది. వేదపండితుల దగ్గరి నుంచి సాధారణ పండితుడి వరకు అందరూ గాయత్రి మంత్రాన్ని తప్పుకుండా జపించాలని భక్తులకు సూచిస్తుంటారు. ప్రతీ రోజు ఉదయం లేవగానే గాయత్రీ మంత్రం పఠించడం వల్ల ఆ రోజు వచ్చే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాము. గాయత్రీ మంత్ర శబ్దంలో అతీతమైన శక్తి దాగుంది.
అన్ని వేదాల్లో ఉన్నదంతా గాయత్రీ మంత్రంలో ఉందని నమ్మకం. ఇదే వేదాలన్నింటి సారాంశంగా కూడా పేర్కొంటారు. ఈ మంత్రంలో ఉన్న పవిత్ర శక్తమంతమైన శబ్దం శుభాలను కలిగించడమే కాక భయంకరమైన కలలను పారదోలుతుందని అంటారు. కానీ ఈ మంత్రాన్ని చాలా నిష్టతో ధ్యానంతో పరిశుభ్రతతో మాత్రమే పఠించాలని పండితులు సూచిస్తున్నారు.
గాయత్రీ మంత్రం
ఓం భూర్-భువః స్వాః
తత్-సవితుర్-వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ ||

మానసిక ప్రశాంత
గాయత్రీ మంత్రం పఠిస్తే మానసిక ప్రశాంతతో పాటు శరీరంలోని జీవనాడులు ప్రభావితమై శరీరం ఆరోగ్యంగా కూడా మారుతుందని ఆయుర్వేధ శాస్గ్రవేత్తలు చెబుతున్నారు. మనసు దిగులుగా ఉన్నప్పుడు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా పఠించవచ్చు. కానీ సూర్యుడు రాకముందే పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. ఎన్ని సార్లైనా గాయత్రీ మంత్రాన్ని పఠించవచ్చు. మొదటగా రోజూ ఒకసారితో ప్రారంభించండి. తరువా ఆ సంఖ్యను 5, 10, 20 నుంచి అలా 108 సార్లు ప్రతీ రోజు పఠించేలా ప్రయత్నం చేయండి.
భక్తితో శ్రద్ధతో క్రమశిక్షణతో
గాయత్రీ మంత్రాన్ని భక్తితో శ్రద్ధతో క్రమశిక్షణతో పఠించాలి. మామూలుగా చదివినట్టు కాకుండా ఈ ఆర్టికల్‌లో పైన తెలుగులో గాయత్రీ మంత్రాన్ని ఇచ్చిన విధంగానే ఉచ్ఛరిస్తూ పఠించాలి. మీకు పఠించడం ఇష్టం లేని సమయంలో గాయత్రీ మంత్రాన్ని పఠించవద్దు, మీరు మానసిక సమస్యలో ఉన్నా, మనసు ఆందోళన చెందుతున్నా లేక మీరు చాలా కోపంగా ఉన్నా కూడా గాయత్రీ మంత్రాన్ని పఠించరాదు. మీరు మనశ్శాంతి కావాలనుకొని పఠిస్తే పఠించవచ్చు. కానీ భక్తి, శ్రధ్ద లేనిది మాత్రం గాయత్రీ మంత్రాన్ని పఠించవద్దు.
108 సార్లు
108 అనేది దైవ సంఖ్య. ఈ సంఖ్యతో అంతా శుభమే జరుగుతుంది. కబట్టి గాయత్రీ మంత్రాన్ని 108 పఠించడం వల్ల కొన్ని రోజుల్లోనే మీరు మంచి ఫలితాలను పొందుతారు. గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు చదవడానికి 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. మీ ఒక రోజులో అంటే 24 గంటల్లో 25 నిమిషాలనేవి చాలా తక్కువ సమయం. ఈ 25 నిమిషాలు శ్రద్ధగా భక్తిగా గడిపితే మిగిలిన గంటలు రోజు మొత్తం సంతోషంగా ప్రశాంతంగా సాగిపోతుంది. కాబట్టి గాయత్రీ మంత్రాన్ని పైన చెప్పిన విధంగా మాత్రమే పఠించాలి. గాయత్రీ మంత్ర శబ్దంలోనే అనంతమైన శక్తి ఉందని పండితులు చెప్పిన విషయాన్ని ఎప్పటికీ స్మరించుకుంటూ ఉండాలి.



Click it and Unblock the Notifications
