Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
అంత్యక్రియల్లో శవాన్ని తాకితే ఏమవుతుందో తెలుసా..? తద్దినాల్లో భోజనం తింటే..!
చనిపోయినవారి వస్తువులు వాడుకోవచ్చు..చనిపోయిన వారి కోసం అన్నదానం చేస్తారు, అక్కడ తినవచ్చా? అలాంటి భోజనం తింటే ఏమైనా జరుగుతుందా.. వీటికి ఎటువంటి పరిహారాన్ని చేసుకోవాలి. చనిపోయిన వారి ఫోటో ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి. హిందువుల్లో చాలా మందిలో దేవుడి మీద భక్తి పెరిగింది. భగవద్గీత చదువుతున్నారు, స్తోత్రాలు చదువుతున్నారు, కానీ ఈ భక్తితో పాటు అఘ్నానం కూడా పెరుగుతూ వుంది. కొంతమంది మూడనమ్మకాల పేరుతో ప్రజల్ని తికమక పెడుతూ వున్నారు. ఎవరైనా చనిపోతే వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లకూడదు, చనిపోయినటువంటి శవాన్ని తాకి నమస్కారం చేయవద్దు, స్మశానంలోకి వెళ్లకూడదు, వెళ్తే నరఘోష చుట్టుకుంటుంది, దుష్ట శక్తుల రూపంలో శరీరంలోకి ఆవహిస్తారు, ఇలాంటి మాటల్లో ఎలాంటి సత్యం లేదని పండితులు చెబుతున్నారు.

మనుషులకు బాల్యం, యవ్వనం, వృధ్ధాప్యం ఎలాగో మరణం కూడా అలాంటిదేనని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. ధీరులు, ఘ్నానులు మరణం గురించి భయపడరు. వృద్ధాప్యంలో శరీరం సహకరించదు. మరణమనేది ప్రతీ వ్యక్తికీ భగవంతుడు ఇచ్చిన వరం. ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడికి వెళ్లి ధైర్యం చెప్పాలి. పుట్టిన ప్రతీ ఒక్కరూ మరణించాల్సిందే, ఎవ్వరూ శాశ్వతంగా భూమి మీద వుండరు. మరణించిన వారి కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే చేయాలి. వాళ్లతోపాటే దహన సంస్కారాలు అయ్యేవరకూ అక్కడే వుండాలి. కుదిరితే ఆ శవాన్ని కూడా మోయాలి.
భార్య గర్భవతిగా వుంటే భర్త శవాన్ని మోయకూడదని శాస్త్రంలో చెప్పబడి వుంది. మిగిలిన అన్ని వేలల్లో శవాన్ని నిరభ్యరంతంగా యోయవచ్చు. అనాథ శవాలకు దహన సంస్కారం చేసినట్లయితే అది అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం ఇస్తుంది. ఎవరైనా చనిపోతే భయం లేకుండా శవాన్ని మోయవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తరువాత స్నానం తప్పకుండా చేయాలి. ఇంటి బయటే నీళ్లల్లో చిటికెడు పసుపు, కాస్త గోమూత్రాన్ని వేసుకొని, స్నానం చేస్తే ఏ దోశం వుండదు.
చనిపోయిన తరువాత తద్దినాలలో భోజనం చేయవచ్చు. అలా భోజనం చేయకూడదని శాస్త్రంలో లేదని పండితులు చెబుతున్నారు. అక్కడ పెట్టిన భోజనాలు పితృ దేవతా సమానం. ఎవరైనా చనిపోతే వారి పేరుమీద ఏదైనా వస్తువును దానం చేయడం చాలా మంచిది. రాగి తట్ట, రాగి చెంబు, ఇత్తడి చెండు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఇవి చేయలేకపోతే వస్త్రదానం చేయాలి. చనిపోయినవారి ఘ్నాపకార్థం చెట్టును దానం చేయడం కూడా చలా మంచిదని పండితులు చెబుతున్నారు.

చనిపోయినవారి ఫోటోలను పూజా మందిరంలో ఎట్టిపరిస్తితుల్లో పెట్టవద్దు. అది దేవుడికి సంబంధించిన గది కాబట్టి అక్కడ మరణించిన వారి ఫోటోలను పెట్టకూడదు. దేవతలు వున్న దగ్గరికి పితృదేవతలు రారు, పితృదేవతలు వున్న చోటుకు దేవతలు రారని హిందూ శాస్త్రం చెబుతోంది.
హాల్లో బెడ్‌రూంలో దక్షిణంవైపు గోడకు పితృదేవతల ఫోటోలను పెట్టుకోవాలి. రోజూ ఈ ఫోటోలకు పూజచేయలేకపోతే కనీసం నెలకు ఒకసారైనా అమావాస్య రోజున ఫోటో తుడిని బొట్టు పెట్టి పూజ చేస్తే పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. నెలకు ఒకసారి పితృదేవతల ఫోటోలకు నైవేద్యం, లేదా ప్రసాదం పెట్టి మొక్కితే పూర్తి వంశాన్ని ఎప్పటికీ రక్షిస్తూనే వుంటారు. పిత్రార్జితంగా వచ్చిన భూములు, ఆస్తులు నిలబడతాయ్. దేవతల అనుగ్రహం ఎంత ముఖ్యమో, పితృదేవతల అనుగ్రహం కూడా అంతే ముఖ్యము. పితృ రుణం తీర్చుకున్నప్పుడే కుటుంబం అష్టైశ్వర్యాలతో వుంటుంది.



Click it and Unblock the Notifications











