Latest Updates
-
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు! -
క్యాల్షియం, ప్రొటీన్ల ఖజానా..ఎముకలకి ఉక్కులాంటి బలాన్నిచ్చే రాగి కిచిడీ -
ఎయిర్ పోర్ట్ డివోర్స్ అంటే ఏంటి?.. జంటలను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్! -
వర్షాకాలంలో ఈ చిన్న పని చేస్తే..ఏ రోగాలు మీ దరిచేరవు! -
పంజాబీ ఫేమస్ చిక్కడ్ చోలే.. పూరీ, కుల్చాకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్!
మార్చి21న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. తిరుమంజనం అంటే ఏమి? ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు?
మార్చి 21న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. తిరుమంజనం అంటే ఏమి? ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు?

ఆళ్వారాలు అనగానే వెంటనే మనకు 12గురు ఆళ్వారుల పేర్లు గుర్తుకు వస్తాయి. ఆ 12 గురిలో కొయిల్ ఆళ్వార్ లేడు. దేవాలయాన్నే ఆళ్వార్గా చెప్పడం వైష్ణవ పరిభాష. అంచేత కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన దేవత ఉన్న ప్రదేశాన్ని అభిషేకించిడమని విశిష్టర్ధం. ఆలయ పరిసరాన్ని ప్రత్యేకించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడాని కోసం జరిపే సేవ కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం'.

ఈ సంవత్సరం ఎప్పుడు జరుపనున్నారు
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్విహిస్తారు. ఈ సంవత్సరం మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానం జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 21న ఆలయ అధికారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

తిరుమంజనం ముఖ్యద్దేశ్యం
తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనందనిలయం. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే 'మలైగుడారం' అంటారు.
స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు. ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. కులశేఖరపడి మొదలు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

తిరుమంజనం కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు
శుద్ధి పూర్తయిన తర్వాత నాముకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకర్పూరం, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపి పవిత్ర జలంతో ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరుస్తున్నారు.
ఆరోజు ఉదయం 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు, తితిదే సిబ్బంది నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.



Click it and Unblock the Notifications