Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Navaratri: దేవిని పూజించే శరన్నవరాత్రుల్లో.. ఏ రోజున ఏం చేయాలంటే..?!
రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. దసరా పండుగ సందర్భంగా తొమ్మిదిరోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరింస్తారు. ఇక, ఈ పండుగ వేళ చాలామంది విజయవాడ, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఈ శారదీయ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున ఉత్తర భారతంలో కలశాన్ని ప్రతిష్టించి, శైలపుత్రి దేవిని పూజిస్తారు.
అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే విజయవాడ కనకదుర్గమ్మను బాల త్రిపుర సుందరీ రూపంలో అలంకరించి పూజిస్తారు.. నవరాత్రుల్లో భాగంగా తొలి రోజున ఉత్తర భారతంలో కలశాన్ని ప్రతిష్టించి, శైలపుత్రి దేవిని పూజిస్తే, తెలుగు రాష్ట్రాల్లో దుర్గమ్మను బాల త్రిపుర సుందరీ రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ రోజు ఏఏ అలంకారాలు చేస్తారు? ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు? ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారు వంటి విషయాలను ఓసారి చూద్దాం.

బాలాత్రిపుర సుందరీ దేవిగా..
తొలి రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇక, ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం పెడతారు. కుమారి పూజ ఎంతో విశేషంగా చేపడతారు.
శ్రీ గాయత్రీ దేవిగా..
శరన్నవరాత్రుల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించి, ప్రసాదంగా కొబ్బరి అన్నం చేయడం ఆనవాయితీ.

అన్నపూర్ణ మాతగా..
శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున లేత పసుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఇక, ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా..
శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగోరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక, ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబం ప్రసాదాన్ని పెడతారు.
శ్రీ చండీ దేవి అలంకరణ..
ఐదో రోజు అమ్మవారు శ్రీ చండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు శ్రీ చండీ దేవీ అవతారమెత్తారు. ఈ రోజు అమ్మవారి ఎర్రని పూలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. ఇక, ఈ రోజున అమ్మావారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. నైవేద్యంగా చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటివి సమర్పించాలి.

శ్రీ మహాలక్ష్మి దేవిగా..
ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తకులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక, నైవేద్యంగా ఈ రోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు.
సరస్వతీ దేవిగా..
శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. ఇక, అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పెడతారు.
దుర్గామాతగా..
నవరాత్రుల్లోని ఎనిమిదో రోజు దుర్గాష్టమి. అమ్మవారు ఈ రోజున దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దర్శనమిస్తారు. భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పించి, నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా అందించాలి.
మహిషాసుర మర్ధినిగా..
తొమ్మిదో రోజు మహర్నవమి. ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు అమ్మవారికి ఈ రోజు ఆకు పచ్చని వస్త్రం సమర్పించి, నైవేద్యంగా చక్కెర పొంగలి నివేదించాలి.



Click it and Unblock the Notifications