Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మొక్కు తీర్చకపోతే ఏమవుతుంది? ఆలస్యంగా మొక్కు చెల్లిస్తే దేవుడు ఆగ్రహిస్తాడా?
జీవితం అన్నాక కష్టసుఖాలు కామన్. లక్షల కోట్లు ఉండే అంబానీకి అయినా అన్నీ సుఖాలే ఉండవు..ఆయన స్థాలో కష్టాలు ఆయనకీ ఉంటాయి. కాబట్టి కష్టాలు వచ్చినప్పడు కుంగిపోయి, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. రెండింటినీ సమానంగా తీసుకోగలగాలి. బాధ ఎక్కువైనప్పుడు,పరిస్థితి చేయి దాటి పోతున్నప్పుడు మానసిక ధైర్యం కోసం దేవుడి మీద భారం వేస్తుంటారు భక్తులు. కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జగకపోతున్నా,పెళ్లి కాకపోయినా,ఎక్కువ కాలం పిల్లలు పుట్టక పోయినా, ఇంట్లో మనోళ్లకి ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదా ఆపద వచ్చినప్పుడు చాలామంది భగవంతుడికి మొక్కుకుంటారు. ఈ గండం గట్టెక్కిచ్చు స్వామీ నీకు అది చేయిస్తాం,ఇది చేయిస్తాం,నిలువు దోపిడీ ఇస్తాం అని మొక్కుకుంటారు.
దేవుడు పగ సాధిస్తాడా
కొందరు గుడికి వెళ్లి మొక్కుకుంటారు..ఇళ్లలోనే ఉండి దేవుడికి తమ కష్టం గురించి చెప్పుకునే వాళ్లు మరికొందరు. తీరా ఆ కష్టం నుంచి బయటపడగానే కొందరు మొక్కు సంగతి మర్చిపోతారు. సమయం లేకపోవటం, డబ్బులు సమకూరక పోవడం వల్ల కూడా మొక్కు తీర్చడం ఆలస్యం కావచ్చు. కొందరైతే మొక్కుకోసం దాచిన డబ్బును వేరే అవసరాలకు కూడా వాడే స్తుంటారు. మరికొందరైతే తీర్చుకుందాంలే అని తార్చారం చేస్తుంటారు. అయితే మొక్కు తీర్చుకోకపోవడం దోషమా? మొక్కులు తీర్చుకోకపోతే దేవుడికి కోపం వస్తుందా? మరోసారి కష్టం వచ్చింది తీర్చమంటే పట్టించుకోడా?

పాజిటివ్ ఎనర్జీ
కష్టాల్ని భరించలేని స్థితిలో దేవుడిపై భారం వేయడం వల్ల మనసుకు ఓ రకమైన భరోసా లభిస్తుంది. దేవుడిని మానవ తీత బంధంలా భక్తులు భావిస్తారు కాబట్టి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోడానికి మనసు సిద్ధం అవుతుంది. ఒత్తిడి నుంచి కొంతవరకు బయట పడగలుగుతారు. ప్రశాంతత లభిస్తుంది. దీంతో సమస్యల గురించి లోతుగా ఆలోచించి ఎవరికి వాళ్లే పరిష్కరించుకోగలుగుతారు. తోటి మనుషులు ఏ సాయం చేయకున్నా దేవుడు మంచి చేస్తాడు,సాయం అందిస్తాడు అనే సమ్మకం మనిషిని కచ్చితంగా ముందుకే నడిపిస్తుంది.
మళ్లీ కష్టాలకి కారణం దేవుడేనా
మొక్కు ఇచ్చినమాట నిలబెట్టుకోవడం లాంటిది. మొక్కు చెల్లించడం అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. అది తీర్చకపోతే నిరంతరం మనసును వేధిస్తూనే ఉంటుంది. దీంతో మరోసారి కష్టం వచ్చినప్పుడు దేవుడిని మొక్కుకోడానికి వెనకాడతారు. దేవుడు ఏమీ చేయకపోయినా భక్తులు మాత్రం ఫలానా సమయంలో అనుకున్న మొక్కు తీర్చకపోవడం వల్లే మళ్లీ కష్టం వచ్చిందని అనుకుంటారు. కానీ వాస్తవానికి దేవుడు మొక్కు చెల్లించలేదని కష్టాలు పెడతాడు అనేది భక్తుల ఆలోచన మాత్రమే. దేవుడు శిక్షించడం,పగ తీర్చుకోవడం వంటివి భక్తుల నమ్మకం నుంచి పుట్టినవే. మొక్కు అనేది విశ్వాసంతో కూడుకున్నది మాత్రమేనని పండితులు చెబుతున్నారు. కాబట్టి భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు పోగొట్టుకోకూడదని చెప్తారు.



Click it and Unblock the Notifications