Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కలియుగంలో సంబలా నగరంలో కల్కీ జననం.. ఇక సమయం ఆసన్నమైందా..?
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఎక్కడ చూసినా చర్చ జరిగేది కల్కీ అవతారం గురించే. కల్కీ అవతారం ఎప్పుడు వస్తుంది. ఎలా వస్తుంది అనే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయ్. సాధారణంగా కల్కీ అవతారం గురించి ఈ కలియుగంలో ప్రతీ చోట ఎప్పుడో ఒకప్పుడు కల్కీ అవతారంపై చర్చ జరుగుతూనే వుంది. ప్రభాస్ సినిమా కల్కీ2898AD సందర్భంగా ఈ చర్చ మరింత తీవ్రమైంది. సినిమాలో ప్రభాస్ కల్కీ అవతారంగా కనిపిస్తాడు. సుమారు 800ల సంవత్సరాల తరువాత కల్కీ జరిగే కథపై ఈ సినిమాను తీశారు.
ఇక కల్కీ అవతారం విషయానికి వస్తే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు లేదా ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు విష్ణు దేవుడే కల్కీ అవతారంగా వస్తాడు. ఇప్పటి వరకు అలా వచ్చిన అవతారాలు ఒకసారి గమనిస్తే మొదటగా మత్స్య అవతారం, కూర్మావతారం, నరసింహావతారం, వామనావతారం, పరుశురామవతారం, శ్రీరామావతారం, కృష్ణావతారం, బుద్ధుడు, ఇలా తొమ్మది అవతారాలను మనము దర్శించుకున్నాం. ప్రస్తుతం ఈ కలియుగంలో కల్కీ అవతరించనున్నాడు. ధర్మం అదుపు తప్పినప్పుడు అవతరిస్తాడు. కల్కీ అవతారం గురించి భాగవత పురాణంలో వుంది. కల్కీ అవతారంపై ప్రత్యేకంగా పుస్తకాన్ని కూడా రచించారు.
కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది, త్రేతా యుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో 2 పాదాలపైన కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయ్. ధర్మం అదుపు తప్పడం వల్ల సమస్యలు పెరిగిపోతూ వుంటాయ్. కలియుగంలో ధర్మాన్ని ఎక్కువగా అదుపు తప్పుతూ వుంటారు. దాదాపు ప్రతీ రోజూ అదుపు తప్పుతూ ఉండడం వల్ల భవిష్యత్తులో కల్కీ అవతరించనున్నాడని పండితులు అంటున్నారు.
కల్కీ అవతారం హిమాలయాల్లోని సంబల నగరంలో జన్మిస్తాడని కల్కీ అవతారం చెబుతోందని. విష్ణు, సుమతి దంపతులకు కల్కీ జన్మిస్తాడని కల్కీ పురాణం చెబుతోంది. కలియుగం అంతంలో కల్కీ అవతరిస్తాడని పురాణాలు కూడా చెబుతున్నాయ్. అయితే పాపాపు మితిమీరిపోయినప్పుడు కూడా కల్కీ అవతరిస్తాడని అంటున్నారు. పురాణ శాస్త్రం ప్రకారం కలియుగం మొత్తం 4 లక్షలకు పై సంవత్సరాలే వుంటుంది. ఇప్పటి వరకు ఇంకా కేవలం 5 వేల సంవత్సరాలను మాత్రమే పూర్తి చేసుకున్నము. ఆ లెక్కన చూసినా కల్కీ ఎప్పుడు పుడతాడో ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదని చెప్పుకోవచ్చు.
భారతదేశంలోని హిమాలయాల్లో సంబల నగరంలో కల్కీ పుడతాడని కల్కీ పురాణంలో వుంది. అయితే ఈ నగరం ఉన్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ నగరం ఎక్కుడ వుందని చాలా మంది పరిశోధనలు చేశారు. రష్యాకు చెందిన ప్రముఖ పరిశోధకులు కూడా దీన్ని వెతికినా ఎలాంటి లాభం లేకపోయింది.

కీకట పురంలో అధర్మం రాజ్యమేలుతుందని అక్కడి నుంచే కల్కీ అవతారం ధర్మ స్థాపన చేయడానికి బయలుదేరుతాడని శాస్త్రం చెబుతోంది. ప్రపంచంలో అప్పుడంతా శరీరమే ముఖ్యమన్నట్టుగా ప్రవర్తించి అధర్మాలు చేస్తూ విచ్చలవిడిగా వుంటారని, పాపాలు ఎక్కువగా చేస్తారని కలియుగ పురాణం చెబుతోంది. వీరందరినీ కల్కీ సంహరిస్తాడని కల్కీ పురాణం చెబుతోంది.



Click it and Unblock the Notifications