శని మీ జన్మరాశిలో ప్రవేశించినపుడు ఈ 5విషయాలు జరగటం ప్రారంభమవుతాయి!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

శని మీ జన్మరాశిలో ప్రవేశం. ఒక వ్యక్తి జీవితంలో అనేక జ్యోతిష్యపరమైన సంఘటనలు జరుగుతాయి, అవి అయితే అదృష్టకరంగా లేదా దురదృష్టకరంగా కూడా ఉండవచ్చు. అలా శని రావటం వల్ల మాత్రమే జరుగుతుంది.

శని ప్రవేశం. శని లాభకరమైన జాతకచక్రం ఇల్లులో వచ్చినపుడు, జీవితం సంతోషాలతో, సంపద, కీర్తులతో నిండిపోతుంది. అదే విపరీత పరిస్థితులలో అయితే నష్టాలు, దుఃఖం మరియు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.

ఈ అమావాస్య రోజు శనిదేవుడిని కంపల్సరీ పూజించాలి.!! ఎందుకు ??

ఈ భౌతిక ప్రపంచానికి గురువు. ప్రతి జీవితంలో ఆయన సృష్టించే భయాన్ని పక్కనబెడితే, శనిని నిజానికి వేదగురువుగా, ఈ ప్రపంచానికే గురువుగా భావిస్తారు. మానవులు చేసే మంచిచెడులను బట్టి ఆయన వరాలిస్తారు మరియు శిక్షిస్తారు.

న్యాయ గ్రహం. మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు శని న్యాయాన్ని నిర్ణయించే గ్రహంగా కూడా మారతారు. అందుకని మీరు చేసే పనులపట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. శని మీ రాశిలోకి ప్రవేశించినపుడు ఈ కింది విషయాలు జరగటం ప్రారంభమవుతాయి.

1. ఉద్యోగపరంగా...

1. ఉద్యోగపరంగా...

ఉద్యోగపరంగా లేదా పనిచేసే చోట ఏమైనా ఆటంకాలు, వత్తిడులు.

2.ఊహించని ప్రదేశాలకి కోరుకోని బదిలీలు

2.ఊహించని ప్రదేశాలకి కోరుకోని బదిలీలు

ఊహించని ప్రదేశాలకి కోరుకోని బదిలీలు, ఉద్యోగం మానేయాల్సొచ్చే అనూహ్య సంఘటనలు

3.ప్రమోషన్ రాకలో ఇబ్బందులు,

3.ప్రమోషన్ రాకలో ఇబ్బందులు,

ప్రమోషన్ రాకలో ఇబ్బందులు, కిందిస్థాయికి పడిపోవటం, వ్యాపారం నెమ్మదించటం ఇవన్నీ మీ రాశిలో శని ప్రభావాలే.

4. మీ పేరుపై భరించలేని అప్పులు

4. మీ పేరుపై భరించలేని అప్పులు

నష్టాలు చవిచూడటం, అప్పుల బాధ తట్టుకోలేక దివాళా తీసే స్థితి, మీ పేరుపై భరించలేని అప్పులు మొదలైనవి.

5. ఆటంకాలు

5. ఆటంకాలు

అప్పులు తీర్చడంలో అనుకోని ఇబ్బందులు, ఆటంకాలు వస్తాయి.

6. 2017లో శని మీ రాశిని క్షమించి వదిలేస్తాడా?

6. 2017లో శని మీ రాశిని క్షమించి వదిలేస్తాడా?

ఈ సంవత్సరంలో, శని వృశ్చికం, ధనస్సు రాశుల్లోకి మారతాడు. ఈ మార్పు మీ రాశిపై 2017లో ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకోటానికి చదవండి.

7. మేషంపై శని ప్రభావం

7. మేషంపై శని ప్రభావం

శనిగ్రహం జాతకచక్రంలో ఎనిమిదవ ఇంట్లోకి వస్తాడు. దీన్ని ధైయ సమయం అంటారు.ఈ సంవత్సరం మొత్తం మేషరాశివారికి అనూహ్యంగా, నిలకడ లేకుండా ఉంటుంది.ఆరోగ్యపరంగా బాగుండి, ఉద్యోగవ్యాపార విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా కుటుంబంలో ఒకరికి సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపారంలో రిస్కులకి లాభదాయకం కాదు కాబట్టి మీ కష్టపడిన సొమ్మును వృథా చేయకండి.

8. వృషభంపై శని ప్రభావం

8. వృషభంపై శని ప్రభావం

జనవరి 26 నుండి, శనిగ్రహం దైయలో ఉండి మైగ్రేన్, కడుపునొప్పి, మధుమేహం మరియు గుండె జబ్బులను సూచిస్తోంది. ఈ సంవత్సరం మీకు అడ్డంకులు, ఆటంకాలు అనివార్యంగా ఉన్నాయి.మీరు ఎక్కడ ఎలా ఉంటే, మార్పు లేకుండా అలానే ఉండటం మంచిది.మీ వ్యాపారాన్ని విస్తరించటానికి ఈ ఏడాది మంచిది కాదు. పనిలో మీకు నచ్చని అనేక విషయాలపై రాజీ పడాల్సి వస్తుంది.

9. మిథునరాశిపై శని ప్రభావం

9. మిథునరాశిపై శని ప్రభావం

శని మీ జాతకచక్రంలో 6 లేదా 7వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ మార్పే ఈ సంవత్సరంలో మీకు పెద్ద లాభంగా మారబోతోంది.మీకు పూర్తి ధనలాభం కలిగి ఎక్కువ వ్యయాలు చేస్తారు. కుటుంబం,సహచరులు మీకు తోడుగా మొత్తం నిలుస్తారు. మీకు పెళ్ళి అయివుంటే,కొన్ని ఘర్షణలు తప్పవు కానీ విడాకుల వరకూ వెళ్ళవు.

10. కర్కాటక రాశిపై శని ప్రభావం

10. కర్కాటక రాశిపై శని ప్రభావం

శని మార్పు మామూలు లాభాలను ఇస్తుంది, మరీ ఎక్కువ, మరీ తక్కువ కాదు. శని భగవానుడు ఆర్థిక స్థితిని బలపరుస్తుంటే, మరోవైపు కుటుంబంలో చిన్నవారు సమస్యలు సృష్టిస్తారు. వ్యాపారం మెరుగుపడుతుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంపద మీ దారిలోకి వస్తుంది.ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండటంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు.సంతానోత్పత్తి సమస్యలేవైనా ఉంటే ఈ సంవత్సరం పరిష్కరించబడతాయి.

11. సింహరాశిపై శని ప్రభావం

11. సింహరాశిపై శని ప్రభావం

ఈ సంవత్సరం మొత్తం ధైయ ప్రభావాలతో అటు ఇటూ ఉంటాడు. అందుకని మీ గాఢమైన కోరికలు తీరతాయి.ఆరోగ్యపరంగా అన్నీ బాగుంటాయి.మీ కుటుంబశాంతికి విఘ్నం కలిగిస్తున్నవన్నీ ఈ సంవత్సరం ఆగిపోతాయి. మీకు సొంతఇల్లు,భూమి లేదా పెద్ద పెట్టుబడి చేస్తారు.తెలిసిన వారు లేదా తెలియనివారు ఎవరైనా డబ్బు లావాదేవీలు చేయటం అనవసరం.

12. కన్యారాశిపై శనిప్రభావం

12. కన్యారాశిపై శనిప్రభావం

ఈ సంవత్సరం అనేక కష్టాలు వస్తాయి. సాధారణ చిన్నపనులు కూడా 200% మీ శ్రమను లాగేస్తాయి.వ్యాపారాలు,ఉద్యోగాలు, వ్యక్తిగత జీవితాలలో కూడా అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు. 2017లో శని ధైయ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఒక తప్పటడుగు వేసినా మీ పై అధికారి మీపై విరుచుకుపడతారు.

13. తులారాశిపై శని ప్రభావం

13. తులారాశిపై శని ప్రభావం

ఎట్టకేలకు తులారాశివారికి ఊపిరి పీల్చుకోగలిగే సంవత్సరం.ఏల్నాటి శనితో బాధపడుతున్న ఈ రాశివారికి, ఇది ఆఖరిదశ, శని ఇక మీ రాశిని వదిలేస్తుంది. జనవరి నుంచి జూన్ వరకు శని వెళ్ళిపోతాడు.అందుకని ఈ సంవత్సరం మిశ్రమఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా బానేఉన్నా, ఆదాయం స్థిరంగా ఉండదు. ఎంతో కష్టపడినా, వచ్చే ఫలితాలు నమ్మదగినవిగా ఉండవు. ఉద్యోగపరంగా ఇదొక భారీ సంవత్సరం.

14. వృశ్చికంపై శనిప్రభావం

14. వృశ్చికంపై శనిప్రభావం

ఈ సంవత్సరం మొత్తం శని మీ రాశిలో ఉంటాడు,కానీ ఇక్కడే ఒక మలుపు ఉంది. జనవరి చివర్లో శని తన ప్రస్తుత ఇంటిని వదిలేసి మీ జాతకచక్రంలో మరో ఇంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ మీపై వరాల జల్లులు కురిపిస్తాడు.రాత్రికి రాత్రే మీ జీవితం బాగైపోదు కానీ మంచి విషయాలే జరుగుతాయి. మీ ఆరోగ్యం పనిపై ఏకాగ్రత కుదరనివ్వదు, అది మంచి విషయం కాదు. పనిలో నిర్లక్ష్యం యజమానిచే తిట్లుపడేట్లా చేస్తుంది.

15. ధనస్సుపై శని ప్రభావం

15. ధనస్సుపై శని ప్రభావం

ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. శని మీ జన్మరాశిలో ఏడాది పొడుగునా ఉన్నా మంచివిషయం ఏంటంటే, ఇది ఏల్నాటి శనికి ఆఖరి సంవత్సరం. ఈ సంవత్సరం అనారోగ్యంతో ఉంటారు.ఉద్యోగపరంగా ఏదన్నా సాధించటానికి కష్టసమయం. సహనంతో ఉండండి. ఫలితాలు నచ్చినట్లు ఉండవు.మీ కుటుంబం మీతోనే సదా ఉన్నా, మీ వ్యయాలపై మీకు నియంత్రణ అవసరం.కష్టసమయాలలో కుటుంబం మీతోనే ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం ఇలానే కష్టంగా ఉంటుంది.

16. మకరరాశిపై శనిప్రభావం

16. మకరరాశిపై శనిప్రభావం

2017 శని ధైయా ప్రభావం తక్కువగా ఉంటుంది. జనవరి 26 నుంచి జూన్ 21 వరకు మరియు 26 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు శని పన్నెండవ ఇంట్లోకి మారతాడు. అనవసర ప్రయాణాలు,వ్యాపారాలలో ఎత్తుపల్లాలు మీ శాంతిని హరిస్తాయి.వ్యాపారం కొంచెం స్థిరంగా ఉండదు. మీ వ్యాపారంలో మార్కెటింగ్ వ్యూహాలు అంత ఫలితాలనివ్వవు, ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండదు.

17. కుంభంపై శని ప్రభావం

17. కుంభంపై శని ప్రభావం

మీకు 2017 అద్భుతమైన శక్తివంతంగా ఉంటుంది. ఈ ఏడాది శని ‘గోషాచ్వర్'రూపంలో 10 లేదా 11వ ఇంట్లో ప్రవేశిస్తాడు. అన్ని ఆరోగ్యసమస్యలు తీరిపోతాయి. అదనంగా అందరూ అనుకున్నదానికంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పాత సమస్యలను విశ్లేషించుకుని, పరిష్కరించుకుంటారు. ఏప్రిల్ 6 మరియు ఆగస్టు 25 మధ్య శని తిరోగమనంలో ఉంటాడు, చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు.

18 .మీనంపై శనిప్రభావం

18 .మీనంపై శనిప్రభావం

ఈ సంవత్సరం శని 9లేదా 10 వ ఇంట్లో కెరీర్ కు మంచిగా స్థిరపడతాడు. ఆదాయం పెరగవచ్చు. ఇదివరకు కన్నా ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారపరంగా కూడా విజయాలు చూస్తారు. యజమాని మీ పనితో సంతృప్తి చెంది, మీకు ప్రమోషన్ కూడా ఇవ్వవచ్చు. విద్యార్థులకి మంచికాలం.

English summary

When Lord Shani enters your zodiac, these things would start happening!

When Lord Shani enters your zodiac, these 5 things would start happening!. Know more about read on..
Story first published: Wednesday, October 25, 2017, 14:00 [IST]
Subscribe Newsletter