For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రగ్రహణం నాడు గురుపూజను ఎలా జరుపుకోవాలి?

|

ఈ జూలై 27, 2018 నాడు పౌర్ణమి రోజు కానీ చంద్ర గ్రహణం కారణంగా ఇతర పూర్ణిమల వలే చంద్రుడు చూడడానికి అంత ప్రకాశవంతంగా ఉండదు. గురు పూజోత్సవం నాడే గ్రహణం వస్తున్నందున, ఈ రోజున ఏ పవిత్ర పూజలు చేయరాదు. గందరగోళంగా ఉంది కదా? ఈ సమస్యకు, మేము మీకు ఒక పరిష్కారం ఇస్తున్నాము, చదివండి!

గురు పూర్ణిమ,ప్రతి సంవత్సరం, ఆషాఢ మాసంలో, శుక్ల పక్షము లోని పదిహేనవ రోజున వస్తుంది. ఈ సంవత్సరం జూలై 27 న వస్తుంది. పూర్ణిమ తిథి జూలై 26 న రాత్రి 11:16 నుండి ప్రారంభమయ్యి, జూలై 28 న ఉదయం 01:50 వరకు కొనసాగుతుంది. హిందువులు, బౌద్ధులు మరియు జైనులు, ప్రధానంగా గురు పూజ అని పిలువబడే పూజను గురు పూర్ణిమ రోజున నిర్వహిస్తారు. భారతదేశంలోని వివిధ సంప్రదాయాల ప్రకారం, ఈ రోజును శివుడు, బుద్ధుడు మరియు గురు వేదవ్యాసునికి అంకితం చేయబడింది. అయినప్పటికీ, ప్రజలు కూడా వారి గురువులకు ప్రార్ధనలు చేస్తారు. గురువులు మన జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తారు కనుక,వారి గౌరవార్ధం, ప్రతి సంవత్సరం, ఆషాఢ పౌర్ణమి రోజున ఆధ్యాత్మిక ధోరణిలో గురువును పూజిస్తారు.

When To Do The Guru Purnima Puja On The Lunar Eclipse Day?

గురు పూర్ణిమ మరియు చంద్రగ్రహణం

ఈ సంవత్సరం, చంద్ర గ్రహణం రోజున పడుతుంది కనుక, పూజ ఏ సమయంలో జరుపుకోవాలి అనే విషయంలో గందరగోళం నెలకొంది. గ్రహణం యొక్క సూతకాల సమయంలో (పవిత్రమైన సమయం) ఎటువంటి శుభప్రదమైన పూజలు నిర్వహించబడవు.

ఇక్కడ, గమనించవలసిన విషయం ఏమిటంటే, గ్రహణం మరియు పూర్ణిమ ఒకే రోజున పడినప్పటికి,గ్రహణ సమయం, జూలై 27 న రాత్రి 11:55 నుండి జూలై 28 న తెల్లవారు జామున 3:55 వరకు ఉంటుంది. సూతకాలం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు మొదలవుతుంది, అంటే జులై 27 న మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమవుతుంది. కనుక, పూజలు మధ్యాహ్నం 2:00 గంటల ముందు వరకు జరపవచ్చు. మీరు ఈ సమయంలో ఆలయాలను కూడా దర్శించవచ్చు. 2:00 గంటల తరువాత నుండి సూత కాలం ప్రారంభమవుతున్న కారణంగా, అప్పటి నుండి ఆలయాలను మూసివేస్తారు.

గురు పూర్ణిమ చరిత్ర

గురు అనే ఒక సంస్కృత పదం, 'గు' అంటే 'చీకటి' మరియు అది 'రి' అంటే హరించేవాడు అనే రెండు ప్రాధమిక పదాలను కలిగి ఉంది. గురువు అనగా అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు. మన జీవితంపై గురువు ప్రభావం చాలా ఉంటుంది కనుక, ప్రధానంగా గురువును ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా భావించి, గురు పూర్ణిమ దినాన్ని ఆయనకు అంకితమిచ్చారు. వాస్తవానికి ఇది గురు వేదవ్యాసుని జన్మ దినం. ఆయనను మొట్టమొదటి గురువుగా చెప్తారు. అతను మహాభారత రచయిత మరియు వేదాలు మరియు పురాణాలు కూడా రచించారు.

పరమశివుడు ఆదిగురువు

ఇది సుమారు 15,000 సంవత్సరాల నాటి కథ. శివుడు ఒకసారి హిమాలయాలపై ధ్యానంలో కూర్చుని ఉన్నారు. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అతను హిమాలయాలలో ధ్యానం చేసుకునే ఒక యోగిగా మాత్రమే తెలుసు. ఆయనలో జీవం ఉందని చెప్పుకునేందుకు కేవలం అప్పుడప్పుడు అతని కళ్ళ నుండి జాలువారే కన్నీరు మాత్రమే ఆనవాలు. అనేకమంది ప్రజలు అతడిని సందర్శించెవారు, కానీ అతని ధ్యానాన్ని ఎవరూ భంగం చేయలేకపోయారు.

ఏదేమైనప్పటికీ, అతని ధ్యానాన్ని భంగం చేయాలనే పట్టుదలతో ఉన్న ఏడుగురు పురుషులు, ఈ స్థలాన్ని వీడకుండా కొన్ని సంవత్సరాల పాటు ప్రయత్నం సాగించారు. శివుడు వారిని చూసినపుడు, తన కన్నీళ్లను తెప్పించిన రహస్యమును వారికి ఉపదేశించాడు. తనలోని చైతన్యం ఉన్నత స్థాయికి చేరుకున్నందున తన కళ్ళల్లో అశ్రువులు వాటంతట అవే వచ్చాయని, ధ్యానంలో తాదాత్మ్యం చెందినప్పుడు మాత్రమే అది సాధ్యమని పరమశివుడు వారికి తెలిపాడు.

ఈ ఏడుగురు పురుషులు, తదనంతర కాలంలో,సప్తఋషులుగా కీర్తిగాంచారు. చైతన్యంతో ఉచ్ఛస్థితిని సాధించడానికి మార్గాన్ని వారికి బోధించినందున, ఆయనను ఆది గురువు అని అంటారు. నేటి యోగాలో ధ్యానం ఒక ప్రాధమిక భాగం. మొదటి గురువు అనే అర్థం ఉన్న ఆది గురు అనేది ఒక సంస్కృత పదము. యోగాకు సంబంధించిన రహస్యాలను మొట్టమొదటిసారిగా శివుడు సప్తఋషులకు అందించారు. నేటికి కూడా ఆ రోజు గురును పూర్ణిమగా జరుపుకుంటారు .

English summary

When To Do The Guru Purnima Puja On The Lunar Eclipse Day?

A full moon, Guru Purnima, and the lunar eclipse will occur on the same day on Jul 27, 2018. Since, the lunar eclipse is being considered inauspicious for any puja, because of the Sutak Kal, the Puja can be performed after beginning of the Purnima tithi and before the onset of the Sutak Kal. When To Do The Guru Purnima Puja On The
Story first published: Monday, July 30, 2018, 23:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more