Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
శివుడికి తుమ్మి పువ్వులు ఎందుకు ఇష్టమో మీకు తెలుసా..? దాని వెనక వున్న రహస్యం..!
హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నా.. అందరికంటే ముందుగా మనం అడగ్గానే మన కోరికలు తీర్చే దేవుడు శివుడు. ఆయనకు భోళాశంకరుడుగా పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే. భోళా శంకరుడంటే పిలవగానే పలికే దేవుడు అని అర్థం. ఎవ్వరైనా శివలింగంపైన కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్లతో పరమేశ్వరా ఆదుకోవయ్యా అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు. ఈ సృష్టికి ఆది దంపతులు పార్వీ పరమేశ్వరుడు. అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ వుంటాం.

పరమేశ్వరుడికి రెండు రకాలైన పుష్పాలను ఎట్టిపరిస్థితుల్లో పొరపాటున కూడా సమర్పించవద్దు. ఒక వేల సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఆ పుష్పాల వివరాలను తెలుసుకుందాం. శివపురాణంలో ఇలా వుంది.. వెయ్యి తెల్లజిల్లేడు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి శివలింగంపైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతోంది. వెయ్యి గన్నేరు పుష్పాన్ని శివసహస్రనామం చదివి శివలింగంపైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది. ఒక బిల్వపత్రాన్ని శివలింగంపైన పెడితే మూడు జన్మల పాపాలను శివుడు హరించివేస్తాడు.
వెయ్యి బిల్వదలాలను శివలింగంపైన వేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అంతే ఫలితం ఒక్క తామరపువ్వును శివలింగపైన పెడితే అంత ఫలితం వస్తుంది. వెయ్యి తామరపుష్పాలను శివలింగంపైన పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మెత్తుపువ్వును శివలింగంపైన పెడితే వస్తుందని శాస్త్రం మనకు చెబుతోంది. వెయ్యి ఉమ్మెత్తుపువ్వులను తీసుకొచ్చి శివలింగంపైన పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంతే ఫలితం ఒక్క జమ్మిపువ్వును పెడితే వస్తుందని శాస్త్రం చెబుతోంది. వెయ్యి జమ్మిపువ్వులను శివలింగంపైన పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంతే ఫలితం ఒక్క తుమ్మి పువ్వు పెడితే వస్తుందని శివపురాణం మనకు చెబుతుంది. పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ప్రతీకరము. మారేడు పువ్వుకంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతోంది.

శివుడికి తుమ్మి పువ్వు ఎందుకిష్టమనేదానిపై శివపురాణంలో ఒక కథ వుంది.పూర్వం ఒక ఆటవికుడు అడవిలో వెళ్తుంటాడు. అతనికి శివుడంటే భక్తి. మార్గ మధ్యలో చలిఎక్కువగా వుండడం వల్ల ఆగిపోతాడు. అక్కడ శివలింగం వుంటుంది. శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర వున్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు. మధ్యలో మేలుకవ వచ్చి చలివల్ల శివుడు కూడా వణుకుతాడనుకొని ఆ సంచిని శివలింగంపైన కప్పుతాడు. దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏమి కావాలో అడుగుతాడు.తన పాదాలు ఎప్పుడూ శివుడిపైన వుండాలని కోరుతాడు, అంటే శివుడి పాదాలు తనపైన వుండాలని సరిగ్గా అడకకుండా తప్పుగా అడుగుతాడు. అయినా కూడా శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు. వచ్చే జన్మలో ఆఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి, పాదాల రూపంలో వుండి ఎప్పుడూ తనపై వుండేలా కోరికను ప్రసాదిస్తాడు.అందుకే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో వుంటుంది. ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వంటే ఎక్కువ ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది.
శివుడికి ఎన్ని పువ్వులతో పూజచేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మరిచిపోవద్దు. కార్తికమాసంలో శివుడిని తుమ్మి పువ్వులతో పూజచేయడం చాలా శుభప్రదం. శివపూజలో పొపాటున కూడా బంతి పూలను వాడకూడదు. మొగలిపువ్వులను కూడా శివుడికి అర్పించవద్దు. ఎవరైతే మొగలిపువ్వులతో అర్పిస్తారో వారు జీవితంలో అష్టకష్టాలను అనుభవిస్తారు. బంతిపువ్వులను, మొగలిపువ్వలను శివపూజలో నిశేధించారు. కాబట్టి ఈ రెండు పువ్వులను అస్సలు ఉపయోగించవద్దు.



Click it and Unblock the Notifications