Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
జంతు బలులు ఎందుకు ఇస్తారా తెలుసా..? ఆత్మలు నిజంగా శరీరంలోకి ఎందుకు ప్రవేశిస్తాయో తెలుసా..?
కొంతమంది పూనకాలు వచ్చి వూగుతూ వుంటారు. వాళ్లకి దేవుడు నిజంగా వస్తాడా. దేవాలయాల దగ్గర జంతుబలులు ఎందుకు ఇస్తారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాల వద్దే ఎందుకు ఇలా జరుగుతుంది. పురాణాల్లో జంతు బలులు ఇవ్వమని అమ్మవారు కోరిందా. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
ఆత్మలు దుష్టశక్తులు నిజంగా వున్నాయ్. భగవద్గీతలో కూడ శ్రీకృష్ణపరమాత్ముడు ఆత్మవుందని చెబుతాడు. చావు మనిషి శరీరానికి మాత్రమే వుంటుంది కానీ శరీరంలోని ఆత్మకు వుండదు. ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు ముంచలేదు, ఖడ్గం చీల్చలేదు. ఆత్మకు మరణం లేదు. ఈ విషయం గరుడ పురాణంలో కూడా వుంటుంది.

ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా వున్నాడో, కేతువు ప్రభావం ఎక్కువగా వుంటుందో అటువంటి వాళ్ల శరీరంలో ఆత్మలు ప్రవేశించే అవకాశం వుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. పెళ్లికొడుకు చేతికి కత్తి ఇస్తారు, దీని వెనక కూడా శాస్త్రం ఒక కారణాన్ని చెప్పింది. కోరిక తీరని ఆత్మలు ఒంటరిగా తిరుగుతున్న వధూవరుల శరీరంలోకి వెళ్తే ప్రయత్నం చేస్తాయ్.
స్త్రీలు జుట్టు విరబోసుకొని వుంటే కూడా వారి శరీరంలో ఆత్మలు ప్రవేశించే అవకాశం వుంది. స్మశానాల దగ్గర ఒంటరిగా పడుకుంటే కూడా ఆత్మలు ప్రవేశిస్తాయ్. శరీరంలో దుష్టశక్తులు గనుక ప్రవేశిస్తే మంత్రం వేసే వాళ్ల దగ్గరికి తీసుకెళ్లీ దయ్యాన్ని వదిలిస్తారు. అయితే కొంత మంది కొన్ని దేవాలయాల్లో, చర్చిలో కావాలనే దయ్యం పట్టినట్లు ఊగిపోతుంటారు. అలాంటి వాటిలో నిజం లేదు.
పూర్వకాలం నుంచి మానవ శరీరంలో దేవుళ్లు ప్రవేశిస్తూ వస్తున్నారు. గ్రామదేవతలు వారి శరీరంలోకి వచ్చి, ఆ గ్రామానికి ఏదైనా కీడు జరిగేది వుంటే వారు ముందుగానే చెబుతారు. దేవతాశక్తులు మానవ శరీరంలో 1 లేదా 2 నిమిశాల కంటే ఎక్కువగా వుండరు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో, ఎవ్వరికీ అన్యాయం చేయకుండా వుంటారో వారి శరీరంలోకి దేవుళ్లు ప్రవేశిస్తారు. కొంతమంది పూజారుల్లో కూడా దేవతా శక్తులు ప్రవేశిస్తాయ్.
మానసికంగా బలహీనంగా వున్నవారు జాతరలో ఎక్కువ శబ్దం వినడం వల్ల ఊగిపోతూ వుంటారు. కానీ వారిలోకి దేవుళ్లు ప్రవేశించారని మనం అనుకుంటాం. వారిని గ్రామాల్లో వున్న వారు మొక్కడం వల్ల వారికి మరీ ఎక్కువగా ఊగిపోవడం చేస్తుంటారు. సాత్విక దేవతలు, అంటే రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, గణుశుడు వీరెవరు కూడా శరీరంలోకి ప్రవేశించరు. దుర్గా, కాళిక లాంటి తామసిక దేవతలు మాత్రమే ఒంట్లోకి ప్రవేశిస్తారు.
కొన్ని దేవాలయాల దగ్గర మాత్రమే జంతుబలులు ఇస్తారు. కాళికా, దుర్గా, పోచమ్మ, ఎల్లమ్మ లాంటి దేవాలయాల దగ్గర మాత్రమే జంతుబలులు ఇస్తారు. భూతప్రేత పిశాచాలను అమ్మవారు అడ్డుకుంటారు, మానవులకు ఏ హానీ చేయకుండా జంతుబలుల నుంచి వచ్చే రక్తాన్ని, బలులను ఆరగించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అమ్మవారు చెబుతుంది. అందువల్ల జంతుబలులు ఇస్తారని పండితులు చెబుతున్నారు. ఈ సాంప్రదాయం పూర్వకాలం నుంచీ వస్తంది. పురాణాల్లో కూడా జంతుబలుల గురించి స్పష్టంగా వుంది. దసరా పండుగ నాడు అమ్మవారికి పెద్ద ఎత్తున జంతుబలులు చేస్తారన్న విషయం మనకు తెలిసిందే.
గమనిక : పైన ఇచ్చిన సమాచారమంతా పండితులు, ప్రముఖ జ్యోతిష్యుల నుంచి స్వీకరించింది మాత్రమే. వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.



Click it and Unblock the Notifications