Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Good Friday: ఏసు ప్రభును శిలువ ఎందుకు చేశారో తెలుసా?.. అసలు కారణం ఇదే
క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే అత్యంత ప్రీతిపాత్రమైన, అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు ఆధ్యాత్మికంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రోజున ఏసు ప్రభుకు శిలువ వేశారని, అందుకే గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని మనకు తెలుసు. ఏసు చేసిన త్యాగానికి, మానవాళికి చూపెట్టిన మానవత్వపు గుణపాఠానికి ఇది నిదర్శనమని, అందుకే ఈరోజును అత్యంత ప్రత్యేకంగా.. అత్యంత పవిత్రంగా నిర్వహించుకుంటారు. అయితే చాలా మందికి గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలుసు.. కానీ అసలు యేసుకు శిలువ ఎందుకు వేశారు అనేది తెలియదు. ఏసు ప్రభుకు శిలువ వేయడానికి అనేక సామాజిక, రాజకీయ, మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? అసలు యేసుకు శిలువ వేసేంత తప్పు ఆయన ఏం చేశారు అనేది ఈ స్టోరీని పూర్తిగా చదివి తెలుసుకోండి.
ఏసును శిలువ వేసిన ప్రధాన కారణాలు:
1. ఆధ్యాత్మిక కారణం.. పాప విమోచన
క్రైస్తవ విశ్వాసం ప్రకారం, మనిషి పాపాలకు విమోచన కలిగించేందుకు దేవుడు తన కుమారుడిని పంపాడని, ఆయనే ఏసు అని నమ్ముతారు. ఏసు శిలువపై తన రక్తాన్ని చిందించి.. మనుషులందరీ పాపాలను ప్రాయశ్చిత్తం చేశాడని, దానికి గుర్తుగానే ఈరోజును జరుపుకుంటారని చెబుతారు. ఆయన మరణం ద్వారా మానవాళికి దైవ అనుగ్రహం మరియు నిత్య జీవం లభించాయని క్రైస్తవులు విశ్వసిస్తారు.

2. యూదా మతాధికారుల అసహనం
ఏసు అప్పటి యూదా మతపెద్దలపై విమర్శలు చేశారు. ఆయన మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారని తిట్టారు, దేవుని ప్రేమను మానవ నిబంధనల కంటే ముఖ్యంగా చెప్పారు. ప్రజల మద్దతు పొందుతూ, ఆయన దేవుని కుమారుడిని అని ప్రకటించడంతో, మతపెద్దలు ఆయనను ధర్మానికి భంగపాటు కలిగించే వ్యక్తిగా భావించారు. అందుకే ఆయనకు శిలువ విధించారు.
3. రొమన్ల రాజకీయ అణచివేత
అప్పట్లో యూదయ ప్రదేశ్ రోమన్ల పాలనలో ఉండేది. ఏసు చాలా మందిని తన బోధనతో ఆకర్షించడాన్ని రోమన్లు విప్లవ ప్రమాదంగా చూశారు. "తాను రాజునని" చెప్పడాన్ని రొమన్లు శాసన విరుద్ధంగా భావించి, ఆయన్ను ద్రోహిగా పరిగణించారు. దీంతో ఆయనను శిలువపై పెట్టి.. మరణించే వరకు కొరడా దెబ్బలు కొట్టారని చెబుతుంటారు.
4. యూదాస్ చేసిన మోసం
ఏసు శిష్యుల్లో ఒకడైన యూదాస్ మతాధికారులకు ఏసు నివసించే స్థలాన్ని చూపించి, 30 వెండి నాణేలకి ఆయనను మోసం చేశాడు. దీనివల్ల ఏసును పట్టుకుని రోమన్లకు అప్పగించారు. దీంతో రోమన్లు ఆయనను చిత్రహింసలు పెట్టారు
5. ప్రజాభిప్రాయం
రోమన్ గవర్నర్ పిలాతుకు ఏసులో తప్పు కనబడకపోయినా, ప్రజల ఒత్తిడికి లోనై ఆయనకు శిక్ష విధించాడు. ప్రజలు "యేసును శిలువ వేయండి!" అంటూ అరవడంతో, చివరికి శిలువ శిక్ష విధించబడ్డది.
సందేశం ఏంటంటే..
ఏసు శిలువ వేయడం ఒక దుఃఖకరమైన సంఘటన మాత్రమే కాదు. అది దైవ ప్రేమ, క్షమ, త్యాగం యొక్క అత్యున్నత రూపం. ఆయన తాను చేసిన తప్పుల కోసం కాదు - మన తప్పుల కోసం శిక్ష అనుభవించాడు. ఏసు శిలువ అవడం వలన కొన్ని సందేశాల్లో సమాజంలో బలంగా వినిపిస్తాయి. అవేంటంటే.. ప్రేమ ద్వేషాన్ని మించినది. త్యాగం వలన విమోచనం వస్తుంది. క్షమించడంలో శక్తి ఉంది.



Click it and Unblock the Notifications