For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అసలు రాధ, కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా ?

  |

  రాధా కృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇది స్వచ్ఛమైన, నిస్వార్ధమైన మరియు మరణంలేని ప్రేమకు ఒక ఉదాహరణ. కృష్ణుడు, విష్ణువు ఎనిమిదో అవతారంగా ఉండగా, రాధా లక్ష్మి దేవత అవతారంగా చెప్పబడుతున్నది.

  కృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా కానీ అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధనే. రక్షించడoలో భాగంగానే అతను చాలామందిని వివాహం చేసుకున్నాడు. రాధా మరియు కృష్ణ అనే పదాలలో ఏ ఒక్కటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి. వారి దైవప్రేమ అసమానమైనది మరియు వారి ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది అనడంలో ఆశ్చర్యంలేదు.

  ఏది ఏమైనా , రాధాకృష్ణులు ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం భక్తులను భాదించే విషయమే. రాధా కృష్ణుల వివాహం జరగకపోవడానికి గల కారణాల గురించి చాలా కథలు ప్రబలంగా ఉన్నాయి, రాధా కృష్ణుల వివాహం జరగక పోవడానికిగల కొన్ని కారణాలను ఇక్కడ పొందు పరచబడినవి.

  Why Radha Was Not Married To Krishna

  కృష్ణుని దుర్భాషలాడిన రాధ :

  బ్రహ్మవైవర్త పురాణo ప్రకారం, కృష్ణుడు మరియు రాధా వారి పూర్వ జీవితంలో గోలక్ లో నివసించేవారు. కృష్ణుడి తన భార్య వీర్జతో కలిసి తోటలో కూర్చున్నాడు. ఆ సమయాన రాధ అక్కడ లేదు. ఆమె వచ్చి, వారిద్దరిని చూసి చాలా బాధపడింది. ఆమె కోపంతో కృష్ణుడిని దుర్భాషలాడడం మొదలుపెట్టింది. ఈ పరిణామం వీర్జకు నచ్చలేదు.

  అందుచేత ఆమె ఒక నదిగా మారి, ఎప్పటికి కృష్ణుడి దరి చేరకూడదని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ పరిణామంతో కృష్ణుడు చాలా నిరాశ చెందాడు. రాధ కూడా కృష్ణుని తో మాట్లాడుటకు సంసిద్దత వ్యక్తపరచలేదు. తద్వారా రాధా కృష్ణుల మధ్య అఘాధం పెరిగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు చలించలేదు. చివరకు స్నేహితులు సన్నిహితులు కూడా రాధ మనసు మార్చే ప్రయత్నాన్ని చేశారు. అందులో భాగంగానే శ్రీదాముడు (సుదాముడు అని మరొక నామం కూడా ఉంది) రాధ ని బుజ్జగించే ప్రయత్నం చేసాడని నమ్మకం.

  రాధకు శ్రీదాముని శాపం :

  శ్రీకృష్ణుని ప్రియమైన స్నేహితులలో ఒకరైన శ్రీదాముడు ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలు ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఆమె తన భాదను వ్యక్తపరచే పద్దతికి దుర్భాషలాడడం సరైన మార్గం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు. మరియు కృష్ణుడు రాధ పై పెంచుకున్న ప్రేమను, అతని భాదను వివరించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ రాధ కృష్ణుడు చేసిన నిర్వాకంతో తీవ్రంగా భాదపడిన ఎడల, కృష్ణుని క్షమించే ఆలోచనను కూడా చేయని పక్షంలో శ్రీదాముని కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టింది. తద్వారా శ్రీదాముడు , రాధను మరుసటి జన్మలో కూడా , తన ప్రియమైన వారిని వివాహం చేసుకోలేదు అని శపించాడు.

  తద్వారా రాధ మరుసటి జన్మలో రిషభునికి, కృతికి సంతానంగా జన్మించింది.

  రాధా మరియు కృష్ణుల ప్రేమ గోకులంలో చిగురించింది మరియు అందరి హృదయాలను చేరుకుంది. కాని చివరికి, కృష్ణుడు క్రూరుడైన తన సొంత మామయ్య కంసుని చంపే ఉద్దేశ్యంతో ఆ స్థలాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. కర్ణుడి చావుకు అనేక కారణాలు అంటారు. అలాగే రాదా కృష్ణుల ప్రేమకు మద్య అవాంతరాలు ఎన్నో. అంతటి దేవుడైనా చివరికి రాధ మనసుని గెలవలేకపోవడం శోచనీయం. కానీ దేవుని ప్రతి చర్యకు కూడా ఒక అర్ధం పరమార్ధం ఉండే ఉంటుంది కదా.

  రాధ యొక్క వివాహం :

  రాధ ఒక వైశ్య రాయన్ను వివాహం చేసుకుoదని నమ్ముతారు. రాధ తాను వివాహం చేసుకున్న ఇంటిలో తన వియుక్త ఆకృతిని (విగ్రహం) స్థాపించి, తిరిగి వైకుoఠానికి చేరిందని భక్తుల నమ్మకం. అంతేకాక, ఆమె లక్ష్మి దేవి అవతారం. అవతారం చాలించిన పిదప తిరిగి తన లోకాన్ని చేరుకుందని నమ్ముతారు. కానీ మరో కథ ప్రకారం లక్ష్మి దేవి అంశ రుక్మిణీ దేవిగా చెప్తారు. దేవుడు తలచుకుంటే అవతారాలకు కొదువా?

  రాధ అభిమన్యుని ( అర్జునుని కొడుకు కాదు ) వివాహం చేసుకున్నట్లు మరో కథ చెబుతోంది. పెళ్లి చేసుకోవటానికి కృష్ణుని ప్రతిపాదనను తిరస్కరించినట్లు మరో నమ్మకం ఉంది. ఆమె ఒక గోకాపరి కుమార్తె, అయితే కృష్ణుడు రాజభవనంలో నివసించేవాడు. అందువల్ల, వారి వివాహం సాధ్యం కాదని ఆమె బలంగా నమ్మినది. తద్వారా కృష్ణుడిపై ప్రేమను దాచి, కఠినంగా ప్రవర్తించి దూరం చేసుకుందని చెబుతారు.

  వీరి ప్రేమ అమరం అమోఘం :

  అలాగే, రాధాకృష్ణులు ఒక ఆత్మతో కూడిన రెండు శరీరాలుగా ఉండేవారు. అంతే కాక, రాధ కృష్ణుడికి తన ఆత్మబంధువుగా ఉండేది. కృష్ణుడు, విష్ణువు యొక్క అవతారం మరియు అందరి దేవతల వెనుక ఉన్న బలమైన శక్తి స్వరూపుడు. అటువంటి సందర్భంలో, తన ఆత్మను తనే ఎలా వివాహం చేసుకోగలడు? భగవంతుడి లీల ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు.

  రాధా కృష్ణులు ప్రేమకు స్వచ్ఛమైన రూపం మరియు వారి ప్రేమ హృదయంలో వికసించే పూలతోట వంటిది. ఇంద్రియాలకు చెందిన సాధారణమైన సంబంధం కాదు , అనిర్వచనీయమైనది. ఇప్పటికీ, ఎప్పటికీ చెక్కు చెదరని ప్రేమ అంటే రాధా కృష్ణులే మొదట స్ఫురణకు వచ్చేది. జీవితంలో అన్నిటినీ పొందగలిగిన కృష్ణుడు, ఏదైనా కోల్పోయాడు అంటే అది రాధ ప్రేమనే. అంతగా కృష్ణుని మనసునే కలచి వేసిన అంశంగా రాధ మిగిలి పోయింది.

  భౌతిక భావాలకు, ప్రేమకు ఎటువంటి సంబంధంలేదని రుజువు చేసిన ప్రేమ రాధా కృష్ణులది. వారి ప్రేమ మీరా భాయి దగ్గర నుండి కబీర్ దాస్ వరకు ప్రతి ఒక్కరికీ ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొల్పింది. ఈ నాటికీ ప్రేమికులను లేదా పెళ్ళైన ముచ్చటైన జంటను పోల్చాలి అంటే రాధా కృష్ణుల వలెనే ఉండమని దీవిస్తున్నారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఈ విశ్వమే అంతమైనా వీరి ప్రేమ మాత్రం మధుర కావ్యంలా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

  English summary

  Why Radha Was Not Married To Krishna

  Disappointed to see Lord Krishna meeting with Veerja, Radha started abusing Krishna. Enraged with this Shridama cursed Radha. As a result of the curse, Radha Krishna had to see separation. Lord Krishna is the body and Radha is the soul. Marrying one's soul is not possible. Moreover, they were divine incarnations. Divine love is far higher than materialism of marriage.
  Story first published: Saturday, May 5, 2018, 14:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more