Latest Updates
-
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్స్టిక్తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!
రేపే ఆషాఢ పౌర్ణమి.. ఈ చెట్టును పూజించినట్లయితే కష్టాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం.!
తెలుగు సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాలు.. ఇలా ఒకటేమిటి ఈ మాసమంతా ప్రజలు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోతారు. ఇక రేపు ఆషాఢ పౌర్ణమి కావడంతో ఆ రోజున దానధర్మాలు, పుణ్యకార్యాలు, పూజలకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవిల ఆశీస్సులు పొందడానికి ఇది శుభ సమయం. ఈ క్రమంలో ఆషాఢ పౌర్ణమి రోజు రావి చెట్టును పూజించినట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

రావి చెట్టులో దేవతలు నివసిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే దోష పరిహారాలకు, సుఖశాంతుల కోసం రావిచెట్టును పూజించినట్లయితే ప్రయోజనం ఉంటుందని నమ్ముతారు. ఈ క్రమంలో జులై 29న ఆషాఢ పౌర్ణమి సందర్భంగా రావి చెట్టును పూజించి దీపం వెలిగించడం ద్వారా కుటుంబంలో ప్రతికూలత తొలగి సానుకూలంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
హిందూ మత సంప్రదాయం ప్రకారం రావి చెట్టు చాలా పవిత్రమైనది. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారని.. ఆషాఢ పౌర్ణమి రోజున రావిచెట్టు కింద దీపం వెలిగించి, నీరు సమర్పించినట్లయితే ఇంటికి శాంతి, సంతోషం కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు తొలగి జీవితంలో శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు.
ఆషాఢ పౌర్ణమి రోజు రావిచెట్టును పూజించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, జీవితంలో కష్టాల తొలగిపోతాయి. ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది. రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మనసులోని నిస్వార్థమైన కోరికలు నెరవేరుతాయి.

పూజా విధానం
ఆషాఢ పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే తలంటు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో పూజ అనంతరం రావి చెట్టు వద్దకు వెళ్లి విష్ణుమూర్తిని ధ్యానిస్తూ జలాభిషేకం చేయాలి. నెయ్యు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మనసులోని కోరికను తెలియజేయాలి. మీ శక్తి, బడ్జెట్ మేరకు పేదలకు దానం చేయడం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.
రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా చీకట్లు పారద్రోలి, జీవితంలో సానుకూల శక్తి వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉదయం లేదా సాయంత్రం ఇలా దీపాలు వెలిగించడం మంచిది. పేదలకు ఆహారం, దుస్తులు, నిత్యావసర వస్తువులను మీ శక్తి మేరకు దానం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా పుణ్యం కలిగి, జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
