Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇంట్లో ఆడవారు ఈ పనులు చేస్తే.. ధనలక్ష్మీ ఇంట్లోనే వుంటుంది..!
మహిళలు ఇంటి గృహిణులు మాత్రమే కాదు ఆ ఇంటి భవిష్యత్తును మార్చగలిగే శక్తి వున్న వారు. ఇళ్లు సుఖసంతోషాలతో వుండాలన్నా వారి వల్లే సాధ్యమవుతుంది. హిందూ శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక వేల ఆ పనులు చేస్తే ఇంట్లో ధనం నిలవదని చెబుతున్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటిపైన వుండవని, దారిద్య్రం ఆ ఇంటిని ఆవహిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఎలాంటి పనులను ఇంటి ఇళ్లాలు చేయాలి ? ఇంట్లో ఐశ్వర్యం, శుభం కోసం ఏ పనులు చేయాలో తెలుసుకుందాం.
ఇంట్లో వున్న స్త్రీలు ప్రతీ రోజు దీపారాధన చేసుకోవాలి. కనీసం వారానికి ఒక్కసారైనా దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో వున్న గడపలకు పసుపు, కుంకుమలను పెట్టాలి. పూజ గదిని శుభ్రంగా వుంచుకోవాలి. ఒకే దేవుడికి చెందిన రెండు ఫోటోలు గానీ రెండు విగ్రహాలు గానీ లేకుండా చూసుకోవాలి. దేవుడి ప్రతిమల ముందు ఉదయం, సాయంత్రం రాగి పాత్రలో నీటిని వుంచాలి.
గురువారం రోజు ఇంటి ఇళ్లాలు తలస్నానం అస్సలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఆ రోజు గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం కూడా చేయవద్దని చెబుతున్నారు. అలా చేస్తే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు.

ఇంట్లో కొందరు నిమ్మకాయ దీపాలను పెడతారు. ఇలా నిమ్మకాయ దీపాలను కేవలం దేవాలయాల్లోనే కొన్ని సందర్భాల్లోనే పెట్టాలి. ఇంట్లో నిమ్మకాయ దీపాలను పెట్టవద్దు. వంటింట్లో ఎలాంటి నియమాలను పాటించాలో కూడా శాస్త్రం చెబుతోంది. వంటగదిలో వున్న మాసిన బట్టలను రాత్రి సమయంలో ఉతకవద్దు, అలా చేస్తే దరిద్రం వస్తుంది. ఇళ్లు ఊడ్చిన తరువాత చీపురును కూడా నిలబెట్టవద్దని శాస్త్రం చెబుతోంది. ఈ చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవీ ఆశీస్సులు వుంటాయని శాస్త్రం చెబుతోంది.
నిద్రలోంచి లేవగానే దుప్పట్లను మడతపెట్టకుండా అలాగే పెడతారు. అలా పెట్టడం వల్ల దరిద్రం ఆవహింస్తుందని చెబుతున్నారు. ఇంట్లో స్త్రీలు జుల్లును ఎప్పుడూ విరబోసుకొని వుండవద్దు. అలా చేస్తే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. రాత్రి పడుకునే ముందు వంటగదిలో వున్న పాత్రలన్నింటినీ తోమి పెట్టుకోవాలి. అలాగే పొద్దుట వరకు వుంచితే దరిద్రమని శాస్త్రం అంటోంది.
ఇంటి ఇళ్లాలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగవద్దు. రుతుస్రావం సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదని శాస్త్రం చెబుతోంది. రాత్రి సమయంలో అలగి భోజనం చేయకుండా కూడా వుండవద్దని పండితులు చెబుతున్నారు. వివాహమైన స్త్రీలు బంధువులు, స్నేహితుల ఇంట్లో ఎక్కువ సమయం గడపవద్దని, ఎక్కువ రోజులు వుంటే దాంపత్య జీవితంలో అనేక గొడవలు వచ్చి విడిపోయే అవకాశం వుంది.
స్త్రీలు ఉదయం లేవగానే అద్దం చూడవద్దని శాస్త్రం చెబుతోంది. బయట దేవాలయం నుంచి తెచ్చుకున్న విగ్రహాలను ఇంట్లో పూజగదుల్లో వుంచవద్దని చెబుతున్నారు. దీపారాధనకు ఏ నూనెనైనా వాడవచ్చు గానీ కల్తీనూనెను వాడవద్దు.
కొందరి ఇంట్లో బీరువాకు అద్దాన్ని అమర్చుతారు. ఇలా చూయకూడదని శాస్త్రం చెబుతోంది. బీరువాకు అద్దం లేకుండా చూసుకోవాలి. ఆ అద్దంలో మొఖాన్ని చూసుకోవద్దని శాస్త్రం చెబుతోంది. అలా చేస్తే అనేక దరిద్రం పట్టుకుంటుందని హిందూ శాస్త్రం చెబుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications