Latest Updates
-
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా!
సూర్యుని నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి ‘ప్రేమ’ కష్టాలు తప్పవు.!
ఈ రోజు శుక్రుడు సూర్యుని నక్షత్రరాశి అయిన ఉత్తర ఫల్గుణిలోకి ప్రవేశిస్తుండటంతో ఈ సంచారం కొన్ని రాశుల వారికి సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదురవుతాయని జ్యోతిష్యం చెబుతోంది. ముఖ్యంగా వారి ప్రేమ జీవితంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. మరి ఏ రాశుల వారు సవాళ్లు ఎదుర్కొంటారో చూద్దాం…

శుక్రుడు ప్రేమ, ఆకర్షణ వైవాహిక జీవితంలో ఆనందానికి ప్రతీక. అయితే సూర్యుడిని అందుకు వ్యతిరేక గ్రహంగా జ్యోతిష్యం చెబుతోంది. ఈ క్రమంలో ఈ రోజు శుక్ర గ్రహం.. సూర్యుడి నక్షత్ర రాశి అయిన ఉత్తరఫల్గుణిలోకి ప్రవేశం చేస్తుండటంతో మూడు రాశుల వారి ప్రేమ, వైవాహిక జీవితంలో ఉద్రిక్తత, విభేదాలు, భావోద్వేగ దూరం ఏర్పడవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారికి సహనం, అవగాహన తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
కన్యారాశి
శుక్ర గ్రహ సంచారం కన్యా రాశి వారికి కొంతవరకూ మానసిక, భావోద్వేగ గందరగోళం కలుగజేసే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో వాదనలు, అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. అహంకారం, గొడవల కారణంగా భాగస్వామితో దూరం ఏర్పడవచ్చు. అందుకే మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇద్దరి మధ్యా సంభాషణలో అపార్థాలు కాకుండా అవగాహన తప్పనిసరి. మీ అభిప్రాయాన్ని వారిపై రుద్దకుండా మీ మధ్య సంభాషణకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సంబంధం మెరుగుపడుతుంది. పాత గొడవలను పదేపదే ప్రస్తావించకుండా వర్తమానం, భవిష్యత్తుపై దృష్టి సారించండి.

మకర రాశి
మకర రాశి వారు పని, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకోవడం సవాళ్లు ఎదుర్కొంటారు. వృత్తిపరంగా బాధ్యతలు పెరగడం వల్ల మీరు కొంచెం కఠినంగా మారే అవకాశం ఉంది. ఇది మీ భాగస్వామితో బంధంపై ప్రభావం చూపిస్తుంది. తగినంత సమయం ఇవ్వకపోవడం, చిన్న చిన్న అపార్థాలు, మీ మధ్య దూరాన్ని పెంచవచ్చు. అందుకే భాగస్వామితో టైం స్పెండ్ చేయడం, మనస్ఫూర్తిగా మాట్లాడటం ముఖ్యమని గమనించాలి. అవగాహన, సమయం మీ బంధం బలపడేలా చేస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ కాలం మీ ప్రేమ, వైవాహిక జీవితంలో ఒడుదొడుకులను తీసుకురావచ్చు. భాగస్వామితో అనవసరమైన అనుమానాలు ఏర్పడవచ్చు. దీంతో బంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. మూడో వ్యక్తి ప్రమేయం కారణంగా మీ మధ్య అపార్థాలు కలగవచ్చు. అలాంటి వారి మాటలను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెళ్లయిన జంటలు అప్రమత్తంగా ఉండాలి. భాగస్వామితో మీ ప్రవర్తన, సానుకూల ఆలోచనలతోనే మీ బంధం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అవగాహన, నమ్మకం, సహనం తప్పనిసరిగా పాటించినట్లయితే చిన్న చిన్న విషయాలకు కూడా సర్దుకుపోతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
