For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింక్ బ్లాకేజ్ (అవరోధాలను) తొలగించడం ఎలా ?

|

ఇళ్ళల్లో వాష్ బేసిన్స్ (సింక్లు) బ్లాక్ అవడం కేవలం విసుగును కలిగించడమే కాదు, ఒక గందరగోళ వాతావరణాన్ని కలిగిస్తుంటాయి కూడా. మీ సింక్ పరంగా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే, ఏదో ఒక సమయంలో అది బ్లాకేజ్ గురికావడం ఖచ్చితం. ఇటువంటి అవరోధాలను తొలగించుటకు సూచించగలిగిన చిట్కాల గురించిన సమగ్ర వివరణలను ఈ వ్యాసంలో పొందుపరచబడింది.

సింకు అవరోధాలను పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయినా, తాత్కాలికంగా సమస్యను పరిష్కరించగలిగే చిట్కాలు ఉంటాయి. దీనికోసం ముందస్తుగా సూపర్ మార్కెట్లకు వెళ్లి రసాయనాలను కొనవలసిన అవసరం లేదు. మీ ఇంట్లోనే దొరికే సహజ సిద్దమైన పదార్ధాలతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

సింక్ నుండి నీళ్ళు వెళ్ళే మార్గంలో బ్లాకేజ్ సమస్యను ఎదుర్కొంటున్న వారైతే, మీకొక శుభవార్త. శాశ్వతంగా బ్లాకేజ్ రాకుండా చేయడం అంటూ ఉండదు, కానీ తాత్కాలికంగా సమస్య నుండి గట్టెక్కించే మార్గాలు మన చుట్టూనే ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ప్రత్యేకమైన సాధనాలు మరియు ఉత్పత్తులు వినియోగించడం ద్వారా ఈ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు.

మీ సింక్ లేదా వాష్ బేసిన్ యొక్క బ్లాకేజ్ తొలగించడానికి గల మార్గాలకైవ్యాసంలో ముందుకు సాగండి.

బ్లాకేజ్ తొలగించడానికి ముందుగా

బ్లాకేజ్ తొలగించడానికి ముందుగా

మీ సింకు బ్లాకేజ్ తొలగించడానికి ముందుగా, కొన్ని కీలకమైన విషయాలు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంటుంది. వీటిలో ప్రధానంగా ఉపయోగించే పదార్ధాలు, పరికరాలు మీ చుట్టూనే ఉండడం కాస్త ఊరటనిచ్చే విషయం.

ఈ సింక్ బ్లాకేజ్ తొలగించడానికి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు. ఇందుకు కేవలం కొన్ని మార్గదర్శకాలు, మరియు సామాగ్రి సరిపోతుంది.

రక్షణ కోసం

రక్షణ కోసం

• రక్షణ కోసం కంటి అద్దాలు మరియు చేతికి గ్లోవ్స్

• పాత్రలు శుభ్రం చేసే వస్త్రం

• కొంత బేకింగ్ సోడా మరియు తెల్ల వెనిగర్

• సోడా క్రిస్టల్స్ ఉపయోగించడం.

• వాషింగ్ కోసం గిన్నె లేదా బకెట్

• ఒక ప్లంగర్ (మీ అవసరం దృష్ట్యా ఎన్నుకోవలసి ఉంటుంది)

మీరు మీ సింక్ బ్లాకేజ్ తొలగించడానికి ప్రధానంగా 2 పద్దతులను అనుసరించవచ్చును :

మీరు మీ సింక్ బ్లాకేజ్ తొలగించడానికి ప్రధానంగా 2 పద్దతులను అనుసరించవచ్చును :

సింక్ బ్లాకేజ్ తొలగించడానికి రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి - సహజ సిద్దమైన క్లీనింగ్ ఉత్పత్తులను వినియోగించడం లేదా రసాయనిక పదార్ధాలను మరియు ప్లంగర్ వినియోగించడం. మీరు ఎంచుకునే టెక్నిక్ మీ సింక్ బ్లాకేజ్ సమస్యకు తగినట్లుగా ఉండాలి. అనగా బ్లాకేజ్ సంబంధిత కారణం గురించిన అవగాహన కలిగి ఉండాలి.

మీ సింక్ కాలువ లేదా పైప్ బ్లాకేజ్ సమస్యకు, ఆహారపదార్ధాలు, నూనె వంటివి కారణం అయి ఉంటే, కొన్ని సహజ సిద్దమైన పద్దతుల ద్వారా పూడికను తీయవచ్చు. వాటిని ఉపయోగించడం అత్యంత సులభంగా ఉండడమే కాకుండా ఎటువంటి ప్రతిచర్యలు లేనివిగా ఉంటాయి. - కేవలం కొన్ని సూచనలను అనుసరించి, సరైన భద్రతా జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతులలో అడ్డంకిని తొలగించడం ప్రభావవంతంగా ఉంటుంది, ప్రత్యేకంగా మీ సింక్ ఆహారం లేదా నూనెల కారణంగా బ్లాక్ చేయబడితే ఈ సహజ సిద్దమైన వస్తువులు మీకు తప్పక సహాయపడగలవు.

పైపులలో బ్లాకేజ్ కారణంగా

పైపులలో బ్లాకేజ్ కారణంగా

ఏది ఏమయినప్పటికీ, పైపులలో బ్లాకేజ్ కారణంగా ఏదైనా వస్తువుగా ఉన్నట్లయితే, సహజ సిద్దమైన పదార్ధాలు అంతగా ప్రభావం చూపలేకపోవచ్చు. బదులుగా వీటిని కరిగించే రసాయనిక పదార్ధాల అవసరం ఉండవచ్చు.

Most Read : ఈ ట్రిక్స్ పాటిస్తే డబ్బు మిగులుతుంది, లేదంటే ఎంత సంపాదించినా అప్పులపాలవుతారు

ఈ పరిస్థితుల్లో, గొట్టాల నుండి వస్తువును వెలుపలికి తీసేందుకు, ఒక ప్లoగర్ను ఉపయోగించడం ఉత్తమంగా సూచించబడుతుంది. బ్లాకేజ్ కారణం మీకు తెలియని పక్షంలో, సహజ సిద్ద పదార్దాల వలన ప్రయోజనం చేకూరనప్పుడు, ప్లంగర్ ఉత్తమ ఎన్నికగా ఉంటుంది.

స్వయంగా మీరే రిపేర్ చేయాలని భావిస్తున్న ఎడల, ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచండి.,

స్వయంగా మీరే రిపేర్ చేయాలని భావిస్తున్న ఎడల, ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచండి.,

బ్లాకేజ్ కఠినంగా ఉన్న పక్షంలో, ఏమాత్రం ఆలోచించకుండా ప్లంబర్ సహాయం తీసుకోవడం మంచిది. లేనిచో తెలియక చేసిన తప్పిదం, మరింత నష్టాన్ని చేకూర్చవచ్చు. ఒక్కోసారి పైపులలో వ్యర్ధాలు మండపాటిగా పేరుకొన్న కారణంగా ప్లంగర్ తో బలవంతముగా వ్యర్ధాలు తీసే ప్రయత్నాలు చేస్తుంటారు, క్రమంగా పైపులు విరిగిపోవడం లేదా వ్యర్ధాలు మరింత లోతుగా కూరుకుపోవడం వంటివి తలెత్తి, సింక్ పూర్తిగా మూసుకుపోవడం వంటి అనేక ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమవడం జరుగుతుంటుంది.

క్లీనింగ్ ఉత్పత్తులను ఉపయోగించి మీ సింక్ బ్లాకేజ్ తొలగించండి :

క్లీనింగ్ ఉత్పత్తులను ఉపయోగించి మీ సింక్ బ్లాకేజ్ తొలగించండి :

అదృష్టవశాత్తూ, కిచెన్ సింక్స్ బ్లాకేజ్ అనేది అధిక శాతం, సహజ పదార్ధాల కారణంగా జరుగుతుంది. అనగా ఆహార పదార్ధాలు, మరియు నూనెలు పైపులలో చిక్కుకుంటాయి. ఇటువంటివి మీరు సులభంగా గ్రహించి, తక్షణ నివారణా చర్యలు కూడా తీసుకోగలరు.

మీ సింక్లో ఉన్న నీళ్ళు నెమ్మదిగా డ్రెయిన్ అవడం (ఖాళీ అవడం) గమనించినట్లయితే, బ్లాకేజ్ స్టార్ట్ అయింది అని అర్ధం. క్రమంగా వెంటనే చర్యలు తీసుకోండి. లేకుంటే వ్యర్ధ పదార్ధాలు పెరిగిపోయి, పూర్తిగా అవరోధం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మిమ్ములను మరింత అసౌకర్యానికి గురిచేయవచ్చు

రసాయనిక పదార్ధాల రియాక్షన్లు సింకుల మీదనే కాకుండా

రసాయనిక పదార్ధాల రియాక్షన్లు సింకుల మీదనే కాకుండా

శుభ్రపరిచే రసాయనిక ఉత్పత్తులను ఉపయోగించి సింక్ కాలువల అవరోధాలను తొలగించే ప్రయత్నం చేస్తుంటే, మీరు సరైన ఉత్పత్తులను, నాణ్యత కలిగిన మరియు పేరెన్నికగల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తున్నారని నిర్ధారించుకోండి. దీనికి కొంత పరిశోధన కూడా అవసరం. మరిన్ని ఉత్తమ పదార్ధాలను కనుగొనేందుకు సూపర్ మార్కెట్లను ఎంచుకోవడం మంచిది.

సరికాని రసాయనిక పదార్ధాల రియాక్షన్లు సింకుల మీదనే కాకుండా, అజాగ్రత్తగా ఉన్న ఎడల శారీరికంగా కూడా ప్రభావాలను చూపగలవు. ఈ ఉత్పత్తుల గురించిన సరైన అవగాహన లేని ఎడల, కనీసం వాటి మీద ఉన్న లేబుల్స్ చదవడం, అనుభవజ్ఞుల సలహాలను సూచనలను మరియు భద్రతా జాగ్రత్తలను పాటించడం ఉత్తమం.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

ప్రత్యామ్నాయంగా, బేకింగ్ సోడా మరియు తెల్ల వెనిగర్ వంటి సున్నితమైన పదార్ధాల కలయికను ప్రయత్నించవచ్చు. పి.హెచ్ స్కేలు వ్యతిరేకంగా, బేకింగ్ సోడా, తెల్ల వెనిగర్తో కలిసినప్పుడు, రియాక్షన్ సృష్టిస్తుంది. ఇది క్రమంగా బ్లాకేజ్ తొలగించడంలో ఉత్తమంగా పనిచేయగలదు.

ఉపయోగించు విధానం :

ఉపయోగించు విధానం :

కేవలం సింక్ యొక్క పైప్ హోల్ దగ్గర, మరియు చుట్టూతా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చల్లండి, మరియు దానిపై తెల్ల వెనిగర్ వేసి, అది నురగతో కూడిన మిశ్రమంగా మారడం గమనించండి. ఒక 5 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. తర్వాత అందులో వేడి నీళ్ళు పోసి, శుభ్రం చేయండి. ఇప్పుడు నీరు త్వరగా డ్రెయిన్ అయింది అంటే, బ్లాకేజ్ తొలగిపోయింది అని అర్ధం.

Most Read : సిగరెట్ తాగినా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వీటిని తినాలి

ఎటువంటి ఘాడత కూడిన వాసనలు ఉండవు

ఎటువంటి ఘాడత కూడిన వాసనలు ఉండవు

ఈ పద్ధతిలో ఎటువంటి ఘాడత కూడిన వాసనలు ఉండవు అని గుర్తుంచుకోండి. కానీ బ్లీచ్ మరియు వెనిగర్ ఉపయోగించడం మూలంగా క్లోరిన్ గాస్ విడుదల అవుతుంది. ఇది కొంత విషపూరితమైనది. కావున వెనిగర్ ఉపయోగించాలని భావిస్తున్న ఎడల, బ్లీచ్ ఉండే పదార్ధాలకు కలపడం లేదని నిర్ధారించుకోండి.

సింక్ బ్లాకేజ్ తొలగించడానికి ప్లoగర్ వినియోగం :

సింక్ బ్లాకేజ్ తొలగించడానికి ప్లoగర్ వినియోగం :

మీ సింక్ అవరోధాలను శుభ్రపరిచే ఉత్పత్తులు సమర్థవంతంగా పనిచేయడంలేదని మీరు కనుగొన్న ఎడల, మీ తదుపరి చర్యగా ప్లoగర్ ఉంటుంది. ఇది ఉపయోగించడానికి సులభంగానే ఉంటుంది, కానీ మీరు సరైన జాగ్రత్తతో లేకపోతే, ఒక గందరగోళాన్ని సృష్టించవచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి మీరు అనుసరించదగిన కొన్ని దశలను క్రింద జాబితా చేయబడ్డాయి.

పాప్-అప్ డ్రెయిన్ తొలగించండి

పాప్-అప్ డ్రెయిన్ తొలగించండి

• సింక్ నుండి పాప్-అప్ డ్రెయిన్ తొలగించండి.

• ఒక తడి గుడ్డను తీసుకుని, సింక్ ఓవర్ఫ్లో ప్రవాహాన్ని మూసివేసేందుకు ఉపయోగించండి.

• ప్లంగర్ క్రింది పెదవికి పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి.

• సింక్ టాప్ తిప్పి, నీటి ప్రవాహాన్ని పెంచండి.

• త్వరితగతిన, అనేక మార్లు, కాలువ మీద ప్లంగర్ ఉంచి, పైకి క్రిందికి గట్టిగా నెట్టండి.

• ఇప్పుడు ఎక్కువ నీటిని వేగంగా పంపండి, ఈ చర్యను పునరావృతం చేయండి.

• ప్లంగర్ వలన మీకు అంతగా ఫలితం కనపడకపోయినా పక్షంలో, సింక్ కింద నుండి P- ట్రాప్ తొలగించి చేతితో శుభ్రం చేయండి.

అంశాలన్నీదృష్టిలో ఉంచుకుని

అంశాలన్నీదృష్టిలో ఉంచుకుని

పైన చెప్పిన అంశాలన్నీదృష్టిలో ఉంచుకుని, పరిస్థితిని బట్టి చర్యలను తీసుకోండి. అన్నివేళలా రసాయన పదార్ధాల మీద ఆధారపడడం సరికాదు, అవి పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోగా, అదనంగా శారీరిక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కావున, వీలైనంత వరకు బేకింగ్ సోడా, వెనిగర్ వంటి మిశ్రమాన్నే ముందస్తుగా వినియోగిస్తున్నారని నిర్ధారించుకోండి. మరియు ప్లంగర్ వినియోగం కూడా మీకు సహాయం చేస్తుంది. పరిస్థితి కఠినంగా ఉన్న ఎడల ప్లంబర్ సహాయం తీసుకోవడమే ఉత్తమంగా సూచించబడుతుంది. లేనిచో, పైప్ బ్రేకేజ్ వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

Most Read : మధుమేహం, షుగర్ ను చిటికెలో తగ్గించే ఇన్సులిన్ మొక్క ఆకులు, రోజుకు ఒక్క ఆకు తింటే చాలు

సింకులలో అనేక రకాలు ఉంటాయి

సింకులలో అనేక రకాలు ఉంటాయి

సింకులలో అనేక రకాలు ఉంటాయి, కొన్ని పైప్స్ గోడలోనికి వెళ్ళేలా అమర్చబడి ఉంటే, కొన్ని పైప్స్ నేరుగా కింద ఏర్పాటు చేసిన డ్రైనేజ్ మార్గానికి వెళ్ళేలా ఉంటాయి. పైప్స్ పాతబడి ఉన్నట్లుగా తోచినట్లైతే వాటిని మార్చడమే మంచిది. పెద్ద ఖరీదు కూడా చేయని కారణంగా ఇది కూడా మీకొక ఆప్షన్ వలె ఉంటుంది. కానీ, అన్ని ప్రయత్నాలు విఫలమైన పక్షంలోనే నిర్ణయం తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి. కొన్ని సందర్భాలలో ఎక్కువగా పట్టించుకోని నేపధ్యంలో అధికంగా ఫంగస్ చేరడం కూడా జరుగుతుంటుంది. కావున ఎప్పటికప్పుడు సింక్ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. తరచుగా పరిశీలిస్తున్న ఎడల, బ్లాకేజ్ ఎక్కువ కాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

మీకు నచ్చినట్లయితే

మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, గ్రుహోపయోగ, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How to Unblock a Sink?

How To Unblock A Sink
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more