Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
మీరు నాజూకు(స్లిమ్)గా తయారవ్వాలంటే...!?

ఒక పూట భోజనం చేసి మరోపూట భోజనం చేయకుండావుంటే ఆ తర్వాత చేసే భోజనంలో విపరీతంగా ఆహారాన్ని తీసుకుంటారని పరిశోధకులు అంటున్నారు. ఉదయంపూట అల్పాహారం తీసుకోవడం ఎంతో మంచిదని, రోజంతా మీరు చేసే పనిపై దీని ప్రభావం వుంటుందని పేర్కొన్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ పదార్థాలు వుండేలా చూసుకోవాలి.
రాత్రిపూట తీసుకునే ఆహారం కొవ్వులాగా పేరుకుపోతుందని, శరీరంలావు కావడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు వైద్యులు. ఇలావుంటే రాత్రి తీసుకునే ఆహారంలో సూప్, నెయ్యి, నూనె లేని చపాతీలు, నూనె తక్కువగానున్న తాళింపులుండేలా చూసుకోండి. బరువు తగ్గడానికి గంటల కొద్దీ వ్యాయామం చేయడం వల్ల సన్నబడడం సంగతి అటుంచి ఆరోగ్యపరమైన కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని కన్నా వైద్యులు సూచిస్తున్న ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి.
1. తినడం మానేసి డైటింగ్ చేసే కన్నా చక్కని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వెన్నతీసిన పాలు, వెజిటబుల్ లేదా చికెన్ నూడుల్స్ తో సూపు, క్యారెట్, బీట్‌రూట్, కీరా లాంటి పచ్చి కూరగాయలు, కూరగాయలతో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్‌లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు ఒంటరిగానే తినడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా కన్నా ఫ్రెండ్స్ తోనో, టీవీ చూస్తూనో భోజనం చేస్తే ఎక్కువ తినేస్తారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2. భోజనం చేసే సమయంలో కొవ్వు అధికంగా ఉండే వంటకాలను ఆఖరున తినాలి. ముందు పచ్చి కూరగాయల ముక్కలు, ఆ తర్వాత చపాతీలు లేదా కొద్దిగా అన్నం తీసుకుని చివరిలో మాంసాహార పదార్థాలను తినాలి.
3. ప్రతిరోజూ ఉదయాన్నె వెన్న తీసిన పాలు ఓ గ్లాసుడు తాగితే, శరీరంలోకి కొత్త శక్తి వచ్చి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బయటకు వెళ్లినపుడు ఒక లీటరు మంచినీటి బాటిల్ ఎప్పుడూ ఉంచుకోవాలి.
4. కాఫీ తాగాలని అనిపిస్తే పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగండి. బ్లాక్ కాఫీలో 10 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వు పదార్థాలేవీ ఉండవు. అదే పాలతో కలిపిన కాఫీ తాగితే 210 క్యాలరీలు, 11 గ్రాముల కొవ్వు శరీరంలో చేరతుంది. పండ్ల రసాలను నేరుగా తాగకూడదు. ఒక లీటరు ఆరెంజ్ జ్యూస్‌లో 360 క్యాలరీలు ఉంటాయి. అందువల్ల సగం గ్లాసులో ఫ్రూట్‌జ్యూస్ తీసుకుని అందులో సగం నీళ్లు కలిపి తాగాలి.
5. రోజూ ఇరవై నిమిషాల నడక చాలా వరకు క్యాలరీలను ఖర్చు చేస్తుంది. నడక పూర్తయిన తర్వాత కడుపునిండా నీళ్లను తాగితే నీరసంగా ఉండదు. ఉదయం ఓ రెండు నిమిషాలు బస్కీలు తీయడం వల్ల సంవత్సరానికి ఒక కిలో 300 గ్రాముల బరువు తగ్గుతారు.



Click it and Unblock the Notifications
