For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగువల అందాన్ని పెంచే చేతి వేళ్ళు..గోళ్ళు..

|

Nail Care Tips
కొంతమంది స్త్రీలు ముఖ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత, మిగతాశరీర భాగాలకు ఇవ్వరు. ముఖ్యంగా చేతిగోళ్ళు, కాళ్ళ గోళ్ళను అలక్ష్యం చేస్తుంటారు. గోళ్ళు కూడా మన శరీరంలో భాగమే అనే విషయం మరిచిపోకూడదు. ముఖ్యంగా గోళ్లను చూసి మనిషి ఆరోగ్య స్థితిగతులను చెప్పేస్తారు. కాబట్టి దీన్ని బట్టే గోళ్ళు మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. మగువలు మరింత అందంగా కనబడాలంటే గోళ్ళు కూడా దోహం చేస్తాయి. గోళ్ళు అందం పెంచుకోవాడానికి రకరకాల ఫాషన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గోళ్ళు అందంగా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

1. ఎక్కువగా గోళ్ళను నీటిలోగాని, డిటర్జెంటు పౌడర్ నీటిలోగాని నాననీయకూడదు.
2. అధికఉష్ణోగ్రత కూడా గోళ్ల అందాన్ని, నాజూకుతనాన్ని దెబ్బ తీస్తుంది. పొయ్యికి బాగా దగ్గరగా అంటే గ్యాస్‌ఫ్లేమ్‌ సెగ మరీ ఎక్కువ తగిలే స్థితిలో ఎక్కువసేపు ఉండటం వల్ల గోళ్ళు పెళుసుగా మారిపోతాయి.
3. గోళ్ళతో డబ్బాల మూతలు తీయడంగాని, పాత్రలను గీరటం లాంటివి చేయరాదు. నోటిలో గోళ్ళు పెట్టుకొని కొరకరాదు.
4. గోళ్ళను శుభ్రం చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు కోల్డ్‌క్రీమ్‌ రాసుకుంటే ఉదయానికి మృదువుగా తయారవుతాయి.
5. గోళ్ళు పగిలినా, పుచ్చినా, వెంటనే కట్ చేసుకోవాలి. ప్రతిరోజూ నిమ్మరసంతో గోరువెచ్చని నీటితో కడిగితే గోళ్ళపైని పచ్చదనం పోయి అందంగా వుంటాయి.
6. గోళ్ళు నలుపు - తెలుపు రంగులకు తిరిగి రక్తహీనతకు, చెడు రక్తానికి చిహ్నం అని మరువకండి.
7. గోళ్ళ రంగు అందంగా వేసుకుంటే చూడముచ్చటగా వుంటుంది. బాడీ కలర్‌కు మ్యాచ్‌ అయ్యేలా నెయిల్‌పాలిష్‌ ఉండాలి. ఛామనఛాయ వున్నవారైతే డార్క్‌ కలర్స్‌, కొంచెం నలుపురంగు వున్న వారైతే లైట్‌ కలర్స్‌ పాలిష్‌ వాడితే బాగుంటుంది.
8. గోళ్ళు బాగా పెంచుకుంటే అదొక రకం అందంగా భావించే వారికి అది మంచిది కాదు అని చెప్పవచ్చు. ఆ గోళ్ళలో ఏదైనా అపరిశుభ్రత వుంటే అదెక్కడైనా తనకిగాని, పిల్లలకుగాని గుచ్చుకుంటే గాయమై ఇన్‌ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం వుంది.
9. గోళ్ళకు అంటిన మురికి మరకలు పోకుంటే నిమ్మరసం రుద్దాలి. ఆ తరువాత కాసేపటికి కోల్డ్‌క్రీమ్‌ అరాస్తే గోళ్ళన్నీ శుభ్రం.
10. వేళ్ళు బొద్దుగా వుండేవాళ్ళు తమ గోళ్ళ చివరలు కూడా గుండ్రంగా వుండేలా కట్‌ చేసుకోవాలి. శరీరం సన్నగా, పొడవుగా వుండే మహిళలకు గోళ్ళు పొడుగ్గా, కోలగా వుంటే వేళ్లకు ఎంతో అందం వస్తుంది.

English summary

Nail Care Tips for Beautiful Nails... | ఆరోగ్యకరమైన గోళ్ళుతో అందం..ఆకర్షణ

These essential nail care tips can help ensure that you have a great set of finger nails. Many people don't pay as much attention to their nails as they do to their hair and skin, but an attractive set of fingernails can greatly enhance your appearance as much as a perfectly coiffed hairstyle or healthy glowing skin.
Story first published:Friday, April 6, 2012, 17:17 [IST]
Desktop Bottom Promotion