మహిళలు అనుసరించాల్సిన నైట్ టైమ్ బ్యూటి టిప్స్

ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు తమ అందం, ఆరోగ్యం మీద అంతగా శ్రద్ద చూపలేకపోతున్నారు. ఒక తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఆఫీస్ వర్క్, ఇంటిపనితో అలసిపోయిన వారికి, మరుసటి రోజు ఉత్సహాంగా ఉండటానికి కొంత విశ్రాంతి అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని నైట్ టైమ్ బ్యూటీ టిప్స్ ను అనుసరించడం ద్వారా మీరు మరుసటి రోజు పనికి సిద్దమవ్వడానికి విశ్రాంతిని మాత్రమే కాదు, ఎనర్జీని కూడా పొందగలరు.

అదనంగా కొన్ని బ్యూటీ టిప్స్, మంచి సమతుల్యమైన పోషకాహారం. మీ రెగ్యులర్ డైట్ లో మీకు పోషణ అంధించేవిగా మరియు చాలా తక్కువ ఆయిల్ కలిగినటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మొటిమలు, మచ్చలను సమస్యలను మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. అంతే కాదు మీ చర్మసౌందర్యానికి మరియు శరీరం హైడ్రేషన్ లో ఉంచుకోండానికి తాజా పండ్ల రసాలు మరియు నీళ్ళు అధికంగా తీసుకోవాలి. ప్రతి రోజూ 8 నుండి 12 గ్లాసుల నీళ్ళు (నీళ్ళ లేదా జ్యూలు లేదా లోక్యాలరీ డ్రింక్స్ )రూపంలో త్రాడం వల్ల మీ జీర్ణవ్యవస్థ క్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దాంతో మీ ముఖంలో మరియు చర్మంలో ప్రకాశవంతమైన మెరుపు తీసుకొస్తుందని నిరూపితమైంది . ప్రతి రోజూ మీ శరీరానికి సరిపడా కనీ 12గ్లాసుల నీళ్ళు త్రాగడం వల్ల శరీరానికి అవసరం లేని టాక్సిన్స్ మరియు అదనపు క్రొవ్వుల శరరీం నుండి బయటకు నెట్టివేయబడుతుంది.

మీలో మరింత మానసిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవడం వల్ల మీరు ఆరోగ్యకరంగా మరియు ఆరోగ్యకరమైన జీవన శైలినిలి పొందగలుగుతారు. ప్రతి ఒక్కరికీ నిద్ర అనేది చాలా అవసరం. ఈ నిద్రవల్లనే మీ చర్మం మరియు శరీరం ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది.

మరి రోజంత పనిఒత్తిడితో అలసిన వారికి మరుసటి రోజు తాజాగా, ఫ్రెష్ గా కనబడాలంటే కొన్ని నైట్ టైమ్ బ్యూటీ టిప్స్ ఈ క్రింది స్లైడ్ లో ఇస్తున్నాం. వాటిని పరిశీలించండి.

1. క్లెన్సింగ్:

1. క్లెన్సింగ్:

నిద్రించడానికి ముందు మీరు ముఖంను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. అందుకు ఒక మంచి క్లెన్సర్ ఎంపిక చేసుకొని నిద్రించడానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తర్వాత క్లెన్సింగ్ సొల్యూషన్ ను శుభ్రంగా ఉన్న వస్త్రానికి అప్లై చేసి గోరువెచ్చని నీటిలో డిప్ చేసి మఖం మీద వేసుకోవడం వల్ల ఒక మంచి టోనర్ గాపనిచేస్తుంది . టోనర్ చర్మంలోని అదనపు దుమ్ము, ధూళిని, మలినాలను తొలగిస్తుంది. కాబట్టి, మెరిసేటి ప్రకాశవంతమైన చర్మానికి క్లెన్సింగ్ చాలా చేసుకోవడం చలా ముఖ్యం.

2. మాయిశ్చరైజింగ్:

2. మాయిశ్చరైజింగ్:

నైట్ క్రీమ్స్ ను అప్లై చేయడం కూడా శరీరానికి చాలా అవసరం. నైట్ క్రీమ్స్ డేక్రీమ్స్ కంటే డిఫరెంట్ గా ఉంటాయి. చర్మానికి మాయిశ్చరైజింగ్ చేయడం కూడా చలా అసరం. కాబట్టి స్కిన్ కు మాయిశ్చరైజింగ్ కు క్రీములు చాలా అవసరం. మేకప్ తొలగించుకోవడానికి కూడా నైట్ క్రీములను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసత్ాయి . నిద్రించే ముందు శరీరానికి నైట్ క్రీమ్ అప్లై చేయడం చాలా అవసరం. దాంతో తర్వాత రోజు ఉదయం మీరు ఫ్రెష్ గా కనబడుతారిు.

3. విశ్రాంతి మరియు రెస్ట్ ఫుల్ స్లీప్:

3. విశ్రాంతి మరియు రెస్ట్ ఫుల్ స్లీప్:

ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. మొత్తం, చర్మం సౌందర్యం మరియు శరీర ఆరోగ్యం, శారీరకంగా మరియు మానసికంగా నిద్రమీదనే ఆధారపడి ఉంది. నిద్రబాగా పట్టాలంటే అనేక పౌడర్లు మరియు సెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, వాటిని కొని, చర్మానికి అప్లై చేయడం వల్ల మీకు ప్రశాతంమైన నిద్రపడుతుంది.

4. గోరువెచ్చనినీటితో స్నానం:

4. గోరువెచ్చనినీటితో స్నానం:

రోజంతా పనిఒత్తిడితో అలసిపోయినప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేసుకుంటే ప్రశాంతంగా, తాజాగా విశ్రాంతి పొందవచ్చు. నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా నిద్రపడుతుంది. శరీరం చేసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దాంతో మరింత ఆరోగ్యంగా, రిలాక్సింగ్ గా ఉండవచ్చు. ఇంకా మంచి నిద్రను పొందవచ్చే.

5. మేకప్ తొలగించండి:

5. మేకప్ తొలగించండి:

చర్మం నుండి అన్ని మేకప్ లను తొలగించండి, నిద్ర సమయంలో మేకప్ ఉండటం చర్మానికి అంత మంచిది కాదు. మేకప్ తొలగించుకోవడానికి అనేక క్రీములు మరియు సొల్యూషన్స్ అందుబాటలులో ఉన్నాయి. వాటిలో మంచివి ఎంపిక చేసుకొని మేకప్ ను తొలగించి, చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.దాంతో ప్రశాంతంగా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా నిద్రపడుతుంది. చర్మానికి సురక్షితం.

6. మసాజ్ :

6. మసాజ్ :

బాడీ మసాజ్ వల్ల ఎటువంటి ఒత్తిడైనా తొలగిపోతుంది. మహిళలకు అటు ఇంట్లో మరియు ఇటు ఆఫీసులో అధిక ఒత్తిడికి గురైనప్పుడు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడిని తగ్గుతుంది మంచి నిద్ర పడుతుంది. వేడినూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి కలిగి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ హాట్ ఆయిల్ మసాజ్ తర్వాత చర్మంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండి, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. హాట్ ఆయిల్ మసాజ్ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం ఫ్రెష్ గా మరియు హెల్తీగా ఉంటుంది.

7. ముగింపు:

7. ముగింపు:

ఈ నైట్ టైమ్ బ్యూటీ టిప్స్ అనుసరించినట్లైతే చర్మం మరియు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈ చిట్కాలు చాలా అవసరం. మరియు ఆరోగ్యకరం. వారిని వారు రక్షించుకోవడానికి ఈ చిట్కాలు బాగా సహాయపడుతాయి.

Story first published: Tuesday, November 12, 2013, 17:37 [IST]
Desktop Bottom Promotion