Latest Updates
-
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష!
అటు హెల్త్...ఇటు బ్యూటీని మెరుగుపరిచే వింటర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్
సంవత్సరంలో ఇతర సీజన్స్ కంటే వింటర్ సీజన్లో మార్కెంట్ నిండా వివిధ రకాల పండ్లు కూరగాయాలతో నిండి ఉంటుంది.
ఈ టేస్టీ వింటర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ కలిగి ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను అందివ్వడం మాత్రమే కాదు, బ్యూటీ విషయంలో చాలా అద్భుతాలను చేస్తాయి. మరి ఇలాంటి వింటర్ సీజన్ గ్రేట్ ఫుడ్స్ తో బ్యూటీని ఎలా కాపాడుకోవాలో చూద్దాం... READ MORE:పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్

క్యారెట్:
క్యారెట్ లో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోనికి చేరగానే విటమిన్ ఎగా మారుతుంది. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇంకా క్యారెట్ లో ఉండే యాంటీ క్యాన్సర్ లక్షణాలు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, మరియు కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఇంకా ఇది ఏజింగ్ కు కారణం అయ్యే కణాలను ఆలస్యం చేస్తుంది . ఇతర ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించుకోవడానికి కూగా క్యారెట్ ను ఉపయోగించుకోవచ్చు.
బ్యూటీ టిప్: క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఎ సన్ డ్యామేజ్ ను చర్మానికి రక్షణ కల్పిస్తుంది . ఇంకా డ్రై స్కిన్ మరియు పిగ్మెంటేషన్ నివారిస్తుంది. క్యారెట్ జ్యూస్ లో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చేతులు, ముఖం, మరియు మెడ మీద రెగ్యులర్ గా అప్లై చేయాలి.

పీస్:
పచ్చిబఠాలనీలలో ఉండే ఫాలీ ఫినాల్స్ స్టొమక్ క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడుతుంది . ఒక కప్పు పచ్చిబఠానీలలో 100క్యాలరీలు ఉంటాయి . ఇంకా పచ్చిబఠానీల్లో ప్రోటీన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రొకైటిస్, ఓస్టిరియోఫోసిస్ మరియు మలబద్దకం నివారిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది
బ్యూటీ టిప్: చర్మంను స్మూత్ గా మార్చడంతో పాటు ముడుతలు లేకుండా చేస్తుంది. పచ్చిబఠాలతో తయారుచేసిన పౌడర్ ను బొప్పాయి గుజ్జులో వేసి మిక్స్ చేసి, రోజ్ వాటర్ తో మిక్స్ చేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకొని, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆకుకూరలు:
ఆకుకూరలు మన శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తాయి. విటాలిటిని మరియు బ్లడ్ క్వాలిటీని పెంచుతుంది. క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ మరియు ఆకుకూరల్లో విటమిన్ కె, ఎ, బి2, సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. మరియు ఐరన్, మెగ్నీషియం, మరియు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, రెగ్యులర్ గా ఆకుకూరలు తినడం వల్ల కండరాలను బలోపేతం చేయడంతో పాటు, శరీరం రిలాక్స్ అవుతుంది. హైపర్ టెన్సన్ మరియు స్కిన్ క్యాన్సర్ తగ్గిస్తుంది. బ్యూటి టిప్: ఆకుకూరలల్లో విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.బాగా ఉడికిన ఆకుకూరను ఒక కప్పు తీసుకొని., అందులోఒక చెంచా తేనె, ఆముదం మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేయాలి.

క్యాబేజ్
ఇది న్యూట్రీషియన్ ఫుడ్, ఇది బరువు తగ్గిస్తుంది మరొయు కొలెస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది. క్యాబేజ్ లో అద్భుతమైన నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు మినిరల్స్ (పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మరియు మాంగనీస్ లు ఉన్నాయి. ఇవి మలబద్దకాన్ని నివారిస్తాయి మరియు స్టొమక్ అల్సర్ ను నయం చేస్తుంది . ఇది తలనొప్పి, హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది. స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు ఓబేసిటిని తగ్గిస్తుంది. బ్యూటీ టిప్: క్యాబేజ్ జ్యూస్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది మరియు జుట్టు మొదళ్లకు పోషణను అందిస్తుంది. క్యాబేజ్ లో ఉండే విటిమన్ ఇ మరియు సిలికాన్ జుట్టు ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. క్యాబేజ్ జ్యూస్ ను అరటిపండు గుజ్జు, తేనెతో మిక్స్ చేసి హెయిర్ మాస్క్ లా వేసుకోవాలి. 20నిముషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గ్రేప్ ఫ్రూట్ :
గ్రేప్ ఫ్రూట్ లో విటిమన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. జీవక్రియలను క్రమబద్దం చేస్తుంది. మరియు కిడ్నీసిస్టస్స్ ను విజయవంతంగా తొలగిస్తాయని నిరూపించబడినది. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకా సోడియం తక్కువ , వాటర్ కంటెంట్ తక్కు. ఇది పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతినిస్తుంది.. బ్యూటి టిప్: ఆయిల్ స్కిన్ కలిగిన వారు గ్రేఫ్ ప్రూట్ జ్యూస్ ను స్కిన్ క్లెన్సర్ మరియు టోనర్ గా ఉపయోగిస్తారు. సింపుల్ గా గ్రేఫ్ ఫ్రూట్ స్ర్కబ్ తయారుచేసుకొనిఅందులో కొద్దిగా నూనె స్కిన్ మరియు పాదాలకు అప్లై చేయడం వల్ల, ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పాదాలను శుభ్రం చేస్తుంది మరియు సాఫ్ట్ గా మార్చేస్తాయి .

ఆరెంజెస్
ఆరెంజ్ లో సిట్రస్ లెమనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్, లంగ్, బ్రెస్ట్ , స్టొమక్ మరియు కోలెన్ క్యాన్సర్స్ ను నివారిస్తాయి. రెగ్యులర్ గా ఆరెంజ్ జ్యూస్ త్రాగడం వల్ల కిడ్నీ స్ట్రోన్స్ నివారించుకోవచ్చు. ఆరెంజ్ లో సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించి, మలబద్దకాన్ని నివారిస్తుంది. వీటిలో పొటిషియం అధికంగా ఉండి హార్ట్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది . విటమిన్ సి క్యాన్సర్ నివారిస్తుంది బ్యూటీ టిప్: ఆరెంజ్ తొక్క లేదా ఆరెంజ్ జ్యూస్ గ్రేట్ బ్యూటీ ట్రీట్మెంట్ పదార్థం, ఆరెంజ్ పీల్ పౌడర్ ను లో పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి, మెడకు అప్లై చేిస అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే స్కిన్ లో మంచి గ్లో వస్తుంది .

గ్రేప్స్
క్వీన్ ఆఫ్ ది ఫ్రూట్ గ్రేప్స్. ఎందుకంటే బెస్ట్ స్కిన్ కేర్ ఇనిగ్రెంట్ ఇది. ఇందుంలో ఫైటో కెమికల్స్ మరియు ఫైటోన్యూట్రీయంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా గ్రేప్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది స్కిన్ హెల్త్ కు చాలా ప్రయోజనకారి. రెగ్యులర్ గా గ్రేప్స్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు, వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది రక్తపోటు తగ్గిస్తుంది బ్యూటీ టిప్స్: ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది , ముడుతలను నివారిస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది . గ్రేప్ ఫ్రూట్ ను ముఖంమీద రబ్ చేయడం వల్ల ముఖంలోని ముడతలు నివారించబడుతాయి.

బేరిపండ్లు :
బేరిపండ్లు బరువు తగ్గడానికి సహాయపడుతుంది, క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది, హైపర్ టెన్షన్ మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది. హార్ట్ డిసీజ్ మరియు ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది . ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి, కె మరియు కాపర్లు అధికంగా ఉంటాయి. ివి ప్రీరాడికల్స్ నుండి మన శరీరంలోని బాడీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పిస్తాయి . ఈ పండ్లలో ఉండే ఫైబర్ స్ట్రోక్ రాకుండా నిరోధిస్తుంది . ఇందులో ఉండే అధిక గ్లూకోజ్ ఇన్ స్టాంట్ ఎనర్జీ అందిస్తుంది. బ్యూటి టిప్: వింటర్ సీజన్లో డ్రై అండ్ డ్యామేజ్ నెయిల్స్ ను నివారిస్తుంది. బేరి పండ్ల రసాన్ని మలైతో మిక్స్ చేసి చేతులకు గోళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. వాటర్ అండ్ హనీలో మిక్స్ చేసి జుట్టుకు కండీషనర్ గా...మాయిశ్చరైజర్ గా కూడా అప్లై చేసుకోవచ్చు.

ఆపిల్స్ స్కిన్ మాయిశ్చరైజర్ గా :
వింటర్ సీజన్ లో చల్లగా వీచే గాలులు వల్ల చర్మం త్వరగా డ్రైగా మారుతుంది. కాబట్టి, వింటర్ లో అందుబాటులో ఉండే ఆపిల్స్ ను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ఇందుంలో ుండే విటిమిన్ సి ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో చర్మానికి అవసరం అయ్యేంత మాయిశ్చరైజింగ్ అందివ్వబడి, చర్మం డ్రై అవ్వకుండా కాపాడుతుంది.

బొప్పాయి:
వింటర్ స్కిన్ స్కేర్ టిప్స్ లో తప్పనిసరి బొప్పాయి. బొప్పాయి సీజనల్ ఫ్రూట్. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణను అందిస్తుంది. పొల్యూషన్, డర్టీ మరియు మేకప్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది. ఇందులో ఉండే పెప్పిన్ అనే ఎంజైమ్ స్కిన్ ప్యాచెస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.



Click it and Unblock the Notifications











