For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ అందాన్ని పాడుచేస్తున్న ఫేషియల్ హెయిర్ కు చెక్ పెట్టే ఫేస్ మాస్క్

|

సాధారణంగా అందం విషయంలో అమ్మాయిలు ఏమాత్రం రాజీ పడరు. నిరంతరం అందంగా కనబడటానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి వారిలో అవాంఛిత రోమాలు కనబడితే ఇంకెముందీ...డిప్రెషన్ లోకి వెళ్లిపోవడమే... నలుగురిలోకి పోలేక, ఇబ్బంది పడుతుంటారు. అమ్మాయిలు ఎల్లప్పుడూ వారి ముఖాన్ని సాఫ్ట్ గా , స్మూత్ గా మరియు ఎలాంటి మచ్చలు, మొటిమలు, పేషియల్ హెయిర్ లేకుండా ఉండే ముఖాన్ని కోరుకుంటారు . అయితే మెడ, గడ్డం, బుగ్గల మీద, ఫోర్ హెడ్ మరియు పైపెదవులు మరియు, శరీరంలో ఇతర ప్రదేశాలు హెయిర్ ఉండాటాన్ని అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా చిరాకు తెప్పించడం మాత్రమే కాదు వీటి వల్ల చాలా ఇబ్బంది కరంగా ఫీలవుతారు.

శరీరంలోని కానీ, ముఖంలో కానీ ఎక్సెస్ హెయిర్ గ్రోత్ హార్మోనుల మార్పుల వల్ల , ఇర్రెగ్యులర్ మెనుష్ట్ర్యువల్ సైకిల్, మెడికేషన్స్ , గర్భధారణలో శరీరంలో మార్పులు వల్ల ఎక్సెస్ హెయిర్ కు కారణం అవుతుంటుంది. కారణం ఏదైనా, ఇబ్బంది కలిగించే ఫేషియల్ హెయిర్ ను నివారించుకోవడమే మంచి మార్గం.

అందుకు కొన్ని సూపర్ ఫేషియల్ పద్దతులున్నాయి . ఫేషియల్ హెయిర్ తొలగించుకోవడంలో షేవింగ్, వాక్సింగ్, ఇంకా లేజర్ ట్రీట్మెంట్స్ మొదలగునవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి . కానీ ఈ పద్దతులకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు, నొప్పి కలిగిస్తాయి . అంతే కాదు, వీటి వల్ల ముఖంలో స్కార్స్ మరియు బర్న్ మార్క్స్ గుర్తులుగా నిలుస్తాయి.

READ MORE: ముఖం మీద వెంట్రుకలను శాశ్వతంగా తొలగించే మార్గం..

మరి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఫేస్ మాస్క్ లు ఉపయోగపడుతాయి. ఈ ఫేస్ మాస్క్ లను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే ఫేషియల్ హెయిర్ పెరగకుండా నివారించుకోవచ్చు. మరి ఆ ఎఫెక్టివ్ ఫేస్ మాస్కులు ఏంటో ఒకసారి తెలుసుకుని..అందాన్ని కాపాడుకుందాం....

ఇండియన్ నాటెల్ మరియు పసుపు:

ఇండియన్ నాటెల్ మరియు పసుపు:

ఇండియన్ నాటెల్ లో హీలింగ్ ప్రొపర్టీస్ మెండుగా ఉన్నాయి . మరియు ఫేషియల్ హెయిర్ నివారించడానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇది నిధానంగా చర్మంలోకి షోషింపబడి హెయిర్ ఫాలీసెల్స్ ను పల్చగా మార్చుతుంది . ఇది చర్మం మీద హెయిర్ గ్రోత్ అవ్వకుండా తగ్గిస్తుంది . ఈ రెండింటి పదార్థాలను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బార్లే అండ్ లైమ్ జ్యూస్ :

బార్లే అండ్ లైమ్ జ్యూస్ :

బార్లీ స్క్రబ్ ను ఉపయోగించడం ఒక ఉత్తమ మార్గం. ఇది ఫేషియల్ హెయిర్ ను గ్రేట్ గా తొలగిస్తుంది . ఈ మాస్క్ ను తయారుచేయడానికి ఒక చెంచా బార్లీ పౌడర్ ఒక చెంచ లెమన్ జ్యూస్ ఒక చెంచా పాలు మిస్క్ చేయాలి. ఈ పేస్ట్ ను హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్ స్క్రబ్:

ఓట్ మీల్ స్క్రబ్:

ఓట్ మీల్ గ్రెయినీ స్ట్రక్చర్ ను కలిగి ఉంటుంది ఇది ఒక మంచి ఎక్సఫ్లోయేట్ ఏజెంట్ గా పనిచేస్తుంది . ఓట్ మీల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఓట్ మీల్ ను పేస్ట్ లా చేసి అందులో తేనె, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి మాస్క్ లా వేసుకొని 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ మరియు నిమ్మతొక్క :

ఆరెంజ్ మరియు నిమ్మతొక్క :

నిమ్మ, నారింజ హెయిర్ ను నేచురల్ గా బ్లీచ్ చేస్తుంది . తర్వాత కొద్ది రోజులకు హెయిర్ కనబడకుండా చేస్తుంది . ఆరెంజ్ మరియు నిమ్మతొక్క పౌడర్ ను మిక్స్ చేసి అందులో కొద్దిగా ఓట్ మీల్ పౌడర్, ఆలివ్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి . 20నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది హెయిర్ గ్రోత్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

 వీట్ బ్రాన్ స్ర్కబ్:

వీట్ బ్రాన్ స్ర్కబ్:

బీట్ బ్రాన్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి . ఇది హెల్తీ మాత్రమే కాదు బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఇది ఒక గ్రేట్ పదార్థం. ఇది ముఖంలో అవాంఛిత రోమాలను నివారించడానికి సహాయపడుతుంది . మరియు ముఖంలో ముడుతలను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది . ఒక చెంచా వీట్ బ్రాన్, ఒక చెంచా రోజ్ వాటర్, ఒక చెంచా రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి . అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెడ్ లెంటిల్స్ మరియు పాలు:

రెడ్ లెంటిల్స్ మరియు పాలు:

రెడ్ లెంటిల్స్ ను మెత్తగా పౌడర్ చేసి, పాలు మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పది నిముషాల తర్వాత ముఖంను స్ర్కబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఫేషియల్ హెయిర్ గ్రోత్ ను నివారిస్తుంది మరియు ముఖానికి గ్లోను అందిస్తుంది.

ఆప్రికాట్ మరియు హనీ:

ఆప్రికాట్ మరియు హనీ:

ఫేషియల్ హెయిర్ నివారించడంలో ఆప్రికాట్ ఒక గొప్ప చాయిస్ . ఆప్రికాట్ ను మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ మాస్క్ వల్ల చర్మం సాఫ్ట్ గా సపెల్ గా మారుతుంది.

English summary

Face Masks To Reduce Facial Hair

Unwanted facial hair can be a distress for women. A woman would want her face to look beautiful, soft, smooth and without any facial hair at all times. Growth of facial hair is a natural process. But the problem arises when there is excess hair growth on the neck, chin, cheeks, forehead and other parts of the body. This causes an embarrassment to the person.
Story first published: Thursday, November 19, 2015, 18:08 [IST]
Desktop Bottom Promotion