For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వధువు చేతులు.. ఎర్రగా పండటానికి సింపుల్ టిప్స్

By Nutheti
|

ఇండియన్ వెడ్డింగ్స్ లో మెహందీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పెళ్లికూతుళ్ల అలంకరణలో మెహందీ చాలా కీలకం. చేతులనిండా, కాళ్లనిండా మెహందీ డిజైన్లలలో పెళ్లికూతురు అందం మరింత రెట్టింపు అవుతుంది. నగలు, పట్టుచీరలు ఎంత ముఖ్యమో వధువుకి వన్నె తెచ్చే గోరింటాకు కూడా అంతే ముఖ్యమని భారతీయ పెళ్లిళ్లు చెబుతాయి.

ఒకప్పుడు పెళ్లిళ్లలో ఇంట్లోనే గోరింట ఆకు తీసుకొచ్చి పేస్ట్ చేసి అందరూ అరచేతిలో డిజైన్స్ పెట్టుకుని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు అంత తీరిక లేక, బిజీ షెడ్యూల్స్ ఉండటంతో.. రెడీమేడ్ కోన్ లకు ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది.

హెన్నా (గోరింటా)ఆకులు యొక్కఆరోగ్య ప్రయోజనాలు హెన్నా (గోరింటా)ఆకులు యొక్కఆరోగ్య ప్రయోజనాలు

వివాహ వేడుకల్లో మెహంది పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పెళ్లికూతురు సిరి సంపదలు పొందాలని కోరుకుంటూ.. ఇలా మెహంది పెడతారు. పెళ్లికి ముందు రోజు ఈ మెహంది సెర్మనీ నిర్వహిస్తారు. అలాగే మెహందీ బాగా ఎర్రగా పండిందంటే.. తన భర్త ఎక్కువ ప్రేమిస్తాడని ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి పెళ్లికూతుళ్లకు గోరింటాకు ఎర్రగా పండాలంటే.. సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరి.

శుభ్రంగా చేతులు

శుభ్రంగా చేతులు

శుభ్రంగా ఉన్న చేతులపై మెహందీ అప్లై చేయడం చాలా అవసరం. మెహందీ పెట్టుకోవడానికి ముందు సోప్ వాటర్ తో చేతులను క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల మెహందీ ఎక్కువ సేపు మీ చేతులపై ఉంటుంది.. బాగా పండుతుంది.

పంచదార, నిమ్మరసం

పంచదార, నిమ్మరసం

మెహందీ పెట్టుకున్న తర్వాత చేతులపై నిమ్మరసం, పంచదార కలిపిన మిశ్రమం కాటన్ తో అద్దుకోవాలి. దీనివల్ల డిజైన్ ఆరిపోకుండా, రాలిపోకుండా ఉంటుంది. అలాగే నిమ్మరసంలో ఉండే సిట్రస్ ఎర్రగా పండటానికి సహాయపడుతుంది.

ఆవనూనె

ఆవనూనె

ఆవనూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీ చేతులలో మెహందీ బాగా ఎర్రగా మారాలని భావిస్తే.. గోరువెచ్చని ఆవనూనె తీసుకుని మెహందీ తొలగించడానికి అరగంట ముందు అప్లై చేయాలి.

నీళ్లు వద్దు

నీళ్లు వద్దు

మీ మెహందీ డార్క్ గా, అందంగా కనిపించాలి అనుకుంటే.. మెహందీని వాటర్ తో క్లీన్ చేసుకోకూడదు. చేత్తో తొలగించాలి.. లేదా రెండు చేతులు రుద్దుకుంటూ.. తొలగించాలి. కానీ నీళ్లు ఉపయోగించి అస్సలు తొలగించకూడదు.

సూర్యుడికి దూరంగా

సూర్యుడికి దూరంగా

మెహందీ పెట్టుకునేటప్పుడు సూర్యుడి కిరణాలు పడకుండా జాగ్రత్త పడాలి. మెహందీలో ఉండే ఆయిల్ కంటెంట్ సూర్య కిరణాలు గ్రహించి.. చర్మంపై ప్రభావం చూపే అవకాశముంది.

ఎర్రగా మారడానికి విక్స్

ఎర్రగా మారడానికి విక్స్

గోరింటాకు ఎర్రగా పండటానికి విక్స్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. పడుకోవడానికి ముందు విక్స్ లేదా ఐయోడెక్స్ తీసుకుని చేతులపై లైట్ గా రాసుకోవాలి. ఇది మెహందీ ఎర్రగా పండటానికి సహాయపడుతుంది.

గ్లోవ్స్

గ్లోవ్స్

మెహందిపై విక్స్ రాసుకున్న తర్వాత ప్లాస్టిక్ ట్రాన్సపరెంట్ గ్లోవ్స్ వేసుకోవాలి. వీటిని రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే బాడీలో వేడి ఉత్పత్తి అయి మెహందీ కలర్ పెరుగుతుంది.

English summary

Tips To Make Bridal Mehndi Darker & Beautiful

Mehendi has a very special significance when it comes to Indian weddings. In Indian marriages, mehendi is one of the most auspicious ingredients that is used to complete all the marriage festivities.
Story first published: Tuesday, December 15, 2015, 16:14 [IST]
Desktop Bottom Promotion