For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందం మీ సొంతం అవ్వడానికి గ్రాండ్ మదర్స్ బ్యూటి టిప్స్ అండ్ ట్రిక్స్ ..!

|

ముఖం చూడ ఎంత నల్లగా తయారైందో...కాస్త సున్నిపిండో...పసుపో రాసుకోకూడదటే..? ఇదుగో ఈ మెంతుల పేస్ట్ తలకు రాసుకో..జుట్టు రాలడం ఆడిపోతుంది. ఒంటికి నలుగు పిండి పెట్టుకున్నావంటే చాలు..చర్మం సుకుమారంగా మారుతుంది. ఆ షాంపూ వాడతావెందుకే..జుట్టు రాలిపోతుంది. చక్కగా కుంకుడు కాయలతో తలంటుకోవచ్చుగా...

అమ్మమ్మలు, బామ్మల నోటి నుంచి తరచూ జాలువారే సౌందర్య చిట్కాలివి. మనం గమనిస్తే..ఇప్పటికీ వారి జుట్టు చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. వయస్సైనప్పటికీ శరీర ఛాయ మాత్రం మిసమిసలాడిపోతుంది. దీనంతటికీ కారణం వారు పాటించే సహజసిద్ధ సౌందర్య చిట్కాలే..ఇప్పటిలాగా అప్పట్లో మార్కెట్లో లెక్కకు మిక్కిలి సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో లేవు కదా..! అందుకే వాళ్ళు అలా చేశారు.

ఇప్పటిలాగా అప్పట్లో మార్కెట్లో లెక్కకు మించి సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో లేవు కదా..! అందుకే వాళ్లు అలా చేశారు..ఇప్పుడు మనకి ఆ అవసరం లేదని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పొరబడుతున్నట్లే. ఎందుకంటే బామ్మల నాటి చిట్కాల వల్ల మన సౌందర్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. అందుకే ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందాం..

పసుపు:

పసుపు:

సాధారణంగా అమ్మాయిలకు ఎక్కువగా ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకోమని చెబుతూ ఉంటారు మన అమ్మమ్మలు, బామ్మలు. అయితే దాన్ని మనం నవ్వుతూ కొట్టిపారేస్తాం..‘ఈకాలంలోనూ పసుపు రాసుకోవడమేంటి బామ్మా' అంటుంటాం. కానీ పసుపులో యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ సెప్టిక్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి.ఇవి మొటిమల సమస్య రాకుండా కాపాడుతాయి. అలాగే చర్మంపై ఏర్పడిన మచ్చలు, గీతలను కూడా తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం సాప్ట్ గా తయారవుతుంది. అంతే కాకుండా..మేనిఛాయ సైతం మెరుగుపడుతుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

నిద్ర తక్కువైన, కళ్లకు ఎక్కువ స్ట్రెస్ కలిగినా కంటి క్రింద నల్ల వలయాలు ఏర్పడుతుంటాయి. అంతే కాదు, కళ్ళు ఉబ్బినట్టుగా కూడా కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మన అమ్మమ్మలు ‘బంగాళదుంపని చక్రాల్లా సన్నగా కోసి...వాటిని కళ్లపై పెట్టుకో మని చెబుతుంటారు'. 5 నుండి 10 నిముసాలు అలా ఉండటం ద్వారా కళ్లను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అంతే కాకుండా బంగాళదుంపతో వేసుకునే ఫేస్ ప్యాక్ తో చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవచ్చు.ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. బంగాళదుంపలోని పోషకాలు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతాయి. పైగా మచ్చలను సైతం తొలగిస్తాయి.

మెంతులు :

మెంతులు :

జుట్టు రాలడం చుండ్రు సమస్య ఉన్నప్పుడు మెంతులతో హెయిర్ ప్యాక్ వేసుకోమని చెబుతూ ఉంటారు. గుప్పెడు మెంతులని రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి...మరుసటి రోజు మెత్తగా రుబ్బి తలకు ప్యాక్ లా వేసుకోవడం ద్వారా కుదుళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి. బామ్మల కాలంలో ఎక్కువగా పాటించిన చిట్కాల్లో ఇది కూడా ఒకటి. అందుకే ఇప్పటికీ చాలా మంది బామ్మల వెంట్రుకలు ఒత్తుగా, పొడుగ్గా ఉంటాయి. మెంతుల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది చిన్న వయస్సులో వచ్చే జుట్టు సమస్యలను నివారించడలో గొప్పగా సహాయపడుతాయి.,మెంతుల్లో ఉండే లెసిథిన్ జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది. అదే క్రమంలో జుట్టు రాలడం తగ్గిస్తుంది. మెంతుల్లోని నికోటిన్ యాసిడ్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు చుండ్రును కూడా తగ్గిస్తాయి.

సున్నిపిండి:

సున్నిపిండి:

పండగలకు, శుభకార్యాలకు నలుగుపిండితో స్నానం చేయించడం అందరికీత తెలసిన విషయమే. శెనగపిండి, పెసర పిండి , పసుపు వంటి పదార్థాలను మిశ్రమంగా చేసి దీన్ని తయారుచేస్తారు. ఒకప్పుడు మన బామ్మలు స్నానానికి సోపులకు బదులుగా నలుగుపిండినే ఉపయోగించే వారు. దీంతో వారి చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేది. నలుగుపిండితో చర్మాన్ని రుద్దుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ఎప్పటికప్పుడు తొలగిపోతాయి . చర్మం మీద చేరిన మురికి కారణంగా మూసుకుపోయిన చర్మగ్రంధుతుల తెరుచుకుంటాయి. చర్మానికి రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. జిడ్డు చర్మ కలవారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.

పాలు:

పాలు:

చలికాలంలో చర్మం , పెదాలు పగుళ్ళు ఏర్పడటం ఎక్కువ. ఈ సమస్య నుండి బయటపడాలంటే మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తుంటారు. ఇప్పుడంటే వీటిని ఉపయోగిస్తున్నాం..కానీ ఒకప్పుడు మన బామ్మలు చర్మం పగలకుండా ఉండేందుకు పాలు, పాల పదార్థాలను ఉపయోగించే వారు. ముఖ్యంగా చలికాలంలో పగిలిన చర్మానికి రోజూ తా వెన్నను రాసేవారు. ఇది చర్మాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడంతో పాటు పోషణనిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాలమీగడ సైతం వాడే వారు. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. పగిలిన పెదవులకు నెయ్యి రాసుకునే వారు. ఇది లిప్ బామ్ లా పనిచేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి పాలు , పెరగుు నలుగుపిండిలో కలిపి రుద్దుకోనే వారు. ఇలా చేస్తే చర్మం శుభ్రమవుతుంది, పోషణ అందుతుంది.

కుంకుడు కాయలు:

కుంకుడు కాయలు:

ప్రస్తుతుం మార్కెట్లో వివిధ రకాల షాంపులు అందుబాటులో ఉన్ానయి. కొన్ని కంపెనీలైతే మా షాంపులో కుంకుడు కాయలు ఉపయోగించాం అని ప్రకటనలు గుప్పిస్తుంటారు. వాటిని చూస్తున్నప్పుడు కుంకుడుకాయల్లో ఇన్ని ప్రయోజనాలున్నాయా? అన్నిపిస్తుంది. కుంకుళ్లను సహజసిద్దంగామైన సాంపుగా చెప్పుకోవచ్చు. ఇవి జుట్టునుశుభ్రపరచడంతో ాపటు కండీషనర్ గా కూడా పనిచేస్తాయి. అలాగే జుట్టు రాలడాన్ని సైతం నిరోధిస్తాయి. దీనిలోని ఔషధ గుణాలు చుండ్రుతో పాటు ఇతర సమస్యలు రాకుండా చేస్తాయి. ఇన్ని మంచి

English summary

Grandma Beauty Tips and Trick That Actually Work

Grandmothers, don't they have the best skin in the world? Not a pimple, not a scar, no blemishes and at times, the wrinkles on their face isn't that deep either. So, what is the secret behind our lovely grannies evergreen looks? Well, it surely is not the expensive beauty products or laser treatments.
Story first published: Wednesday, November 30, 2016, 12:13 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more