Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
నేను బాహుబలి దేవసేన ‘నా అందానికి నేనే పోటీ’...ఎవ్వరు వస్తారు ?
దేవసేనా అంటే దేవసేనానే, నాకు ఎవ్వరూ పోటీ లేరు, నేను ఎవ్వరికీ పోటీ కాదు, నా మాట నాదే, నా పంతం నాదే, నా అందం నాదే అంటూ స్వీటీ ‘అనుష్క శెట్టి'తేల్చి చెప్పింది.
దేవసేనా అంటే దేవసేనానే, నాకు ఎవ్వరూ పోటీ లేరు, నేను ఎవ్వరికీ పోటీ కాదు, నా మాట నాదే, నా పంతం నాదే, నా అందం నాదే అంటూ స్వీటీ 'అనుష్క శెట్టి'తేల్చి చెప్పింది. సూపర్ సినిమాతో సినీరంగంలో అడుగు పెట్టిన స్వీటీ 'అనుష్క'ఓ ఇంటర్వూలో చాల విషయాలు చెప్పింది.
స్వీటీ అంటే స్వీటీ అంతే. నాకు నేనే పోటీ, నాకు నేనే స్వీటీ అంటున్నారు అనుష్క.. అయితే అందం ఎలా వస్తోందో తేల్చి చేప్పింది మన కన్నడ 'ముద్దు గుమ్మ'అనుష్క. ఇలా సినిమాలు చేసుకుంటూ వెలుతాను, ఎందుకంటే నాలెక్కలు నాకుంటాయి, సినిమా లెక్కలు ఉంటాయి అంటున్నారు అనుష్క. మరి ఆమె మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..

దేవ సేనా అంటే
దేవసేనా అంటే ఎవరు ? అని తెలుగు ప్రజలను అడగవలసిన అవసరం లేదు. బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ దేవసేనా (అనుష్క) అంటే ఏవరు ? అనే విషయం తెలిసిపోతుంది.

వచ్చినా
సూపర్ సినియాలో సెక్సీ హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనుష్క ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంటారని సినీ పరిశ్రమ వర్గాలు ఊహించలేకపోయాయి.

కోడి రామకృష్ణ హ్యాండ్
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అరుంధతి సినిమాతో అనుష్కలో ఓ గొప్ప నటి ఉన్నారని ప్రంపంచానికి వెలుగు చూసింది.

తెలుగు, కన్నడ సెంటిమెంట్
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గతంలో అమ్మోరు సినిమాతో సౌందర్యకు స్టార్ డమ్ ఇచ్చారు. తరువాత అరుంధతి సినిమాతో అనుష్కకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చారు.

ఒక్క సినిమా హీరోతో సమానం
అరుంధతి అనే సినిమా అనుష్కను ఏంతో రేంజ్ కు తీసుకువెళ్లింది. ఆ ఒక్క సినిమా అనుష్క సినీ జీవితాన్నే మార్చేసింది.

ఇప్పటికీ జేజమ్మ
అనుష్కాని ఇప్పటికీ సినిమా ఇండష్ట్రీలో జేజమ్మ అనే పిలుస్తున్నారు. అనుష్క నిజంగా ఆ పాత్రకు న్యాయం చేశారని అనేక మంది ప్రముఖులు చెప్పడం విశేషం.

అనుకుంటారా
సెక్సీ క్యారెక్టర్ తో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ స్వీటీ అప్పట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న కథానాయికలకు ఊహించని షాక్ ఇచ్చారు.

నమ్మినందుకు
ఇప్పటికీ అక్కినేని కుటుంబ సభ్యులు ఇప్పటికీ రుణ పడి ఉన్నానని జేజమ్మ అలియాస్ దేవసేనా అలియాస్ అనుష్క ఏన్నోసార్లు చెప్పారు.

డీ గ్లామర్ రోల్
బాహుబలి సినిమాకు వెళ్లిన వారు చిరిగిన చీరలో అప్పుడప్పుడు కనిస్తూ చివరి వరకూ అనుష్క దర్శం ఇవ్వడంతో చూసి షాక్ కు గురైనారు.

అనుష్క అభిమానులు
అనుష్క అభిమానులు నిరాశాకు గురైనా సినిమా పూర్తి అయిన తరువాత రెండో భాగం ఉందని తెలుసుకుని సంతోషంలో మునిగిపోయి నేటి వరకు బాహుబలి-2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

వస్తారా
దేవసేనా అంటే ఓ పాత్ర, అనుష్క అనుష్కానే, ఎప్పటికీ మీ అనుష్కాగానే దర్శనం ఇస్తా అంటూ మన దేవయాని ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

నేను యోగా టీచర్, నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు
మొదట యోగా టీచర్, తరువాత నటి, నాకు ఏలా అందం కాపాడుకోవాలో బాగా తెలుసు అంటున్నారు స్వీటీ అనుష్క.

అమ్మ పాత్రలో
దేవసేనాగా నేను ఓ ప్రభాస్ (బాహుబలి-1) తల్లిగా కనిపిస్తాను. ఆ పాత్ర కోసం చేసే సమయంలో చాలా ఆనందంగానే గడిపాను అంటున్నారు మన స్వీటీ.

అసలు దేవసేనా
అసలు దేవసేనా పాత్ర మీరు చూడండి, అనుష్క అంటే ఏమిటి ? నా గ్లామర్ ఏమిటి ? అనే విషయం మీకే తెలుస్తోందని అనుష్క అంటున్నారు.

భార్యగా, తల్లిగా !
భార్యాగా, అమ్మ పాత్రలో మీరే నటిస్తున్నారు కదా అంటే, మొదటి భాగం చూశారు, బాహుబలి-2 సినిమా చూసిన తరువాత అభిమానులే డిసైడ్ చేస్తారని నేను ఎంత అందంగా ఉన్నానో అంటున్నారు మన స్వీటీ.

దేవుడు ఇచ్చిన వరం
నాకు ఇన్ని పాత్రలు పోషించడం దేవుడు ఇచ్చిన వరం అంటున్నారు అనుష్క. దేవసేనగా గుర్తింపు తెచ్చుకోవడం నాకు కలిసి వచ్చిన అదృష్టం అంటున్నారు.

సినిమాలో ఏం చేశారు
మీరే సినిమా చూస్తున్నారు కదా ? మీకు ఎలా అనిపిస్తే అలా ఊహిచుకోండి. నా పాత్రా ఎంత ప్రాముఖ్యమైందో ముందో మీకు తెలుసు, ఇప్పుడు కొత్తగా ఎందుకు ? అని అనుష్క అంటున్నారు.

హీరోకు దీటుగా
బాహుబలి సినిమాలో హీరోకు దీటుగా దేవసేనా పాత్ర ఉందని సమాచారం. ప్రభాస్ పాత్రతో సమానంగా నా పాత్ర ఉందని అనుష్క చెప్పకనే చెబుతున్నారు.

అందం ఎక్కడ ఉంటుందంటే ?
మహిళకు అందం వయసులో ఉండదు. ఆమె మనస్సులో, సంతోషంలో ఉంటుందని స్వీటీ మహిళలకు గుర్తు చేశారు.

అందం ఇలా రాదు
ఏవో కాస్మోటిక్స్ వాడితే అందం రాదని, మనసు ప్రశాంతంగా పెట్టుకుని, ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా ఉన్నప్పుడే మనం అందంగా కనపడుతాం అంటున్నారు స్వీటీ.

దేవసేనా కాదు
బాహుబలి-2లో నేను దేవసేనా, అనుష్కానా, అనే విషయం సినిమా చూసి మీరే చెప్పండి, మీ మనసులో ఏం ఉందో అని తెలుసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా అంటోంది స్వీటీ.

స్వీటీనా మజాకా
అనుష్కాను స్వీటీ అని ముద్దుగా పిలుచుకునే ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఇప్పుడు అనుష్కానా మజాకా అంటున్నారు.

సైజ్ జీరో అంటూ
సైజ్ జీరో సినిమా కోసం అమాంతం బరువు పెరిగిపోయిన అనుష్కా సినీ వర్గాలనే ఆశ్చర్యానికి గురి చేశారు. గ్రాఫిక్స్ లో సినిమా చెయ్యమని చెప్పినా వినకుండా అనుష్కా తన బరువు పెంచుకోవడానికి తెగించారు.

ఉత్కంఠగా ఉంది
బాహుబలి-2 లో తాను ఎంత అందంగా ఉన్నానో అని అభిమానులు చెప్పే విషయాలు తెలుసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని అనుష్క చెప్పింది.

ఒక్క రోజులో అనుష్క గురించి
ఒక్క రోజులో బాహుబలి-2 సినిమా విడుదల అవుతోంది. ఎంతో అందంగా కనపడుతానని చెబుతున్నా అనుష్క సినిమాలో ఇంక ఎంత అందంగా కనపడుతోంది అంటూ అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.



Click it and Unblock the Notifications











