మెడ అందంగా..నాజూగ్గా కనబడాలంటే ..సింపుల్ టిప్స్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మహిళ అందం విషయంలో ముఖం తర్వాత మెడ . మెడ దగ్గర చర్మం వదులవ్వడం వల్ల మెడ అందాన్ని కోల్పోతుంది. మెడ మీద చర్మం లూజ్ అవ్వడానికి వివిధ కారణాలున్నాయి. వాటిలో ఒకట ఏజింగ్, పోషకాహార లోపం, స్కిన్ కేర్ లేకపోవడం వంటి కారణాల వల్ల నెక్ స్కిన్ వదులౌతుంది.

మెడ అందంగా కనిపించడం కోసం చాలా మంది మహిళలు కాస్మొటిక్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈపద్దతిలో కాస్మోటిక్స్ కరీదైనవి మాత్రమే కాదు, చర్మానికి హానికి కూడా ఎక్కువ కలిగిస్తాయి.

How To Naturally Tighten Loose Neck Skin

మెడ వద్ద వదులైన స్కిన్ ను తిరిగి పూర్వస్థితి తీసుకురావడానికి టైట్ గా మార్చడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.ఇవి వంద శాతం నేచురల్ గా పనిచేస్తాయి.హోం ట్రీట్మెంట్ లో వీటిని ట్రై చేసుకోవచ్చు.వీటి ద్వారా నెక్ స్కిన్ బ్యూటీ మెరుగుపడుతుంది.

అందుకు మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా స్కిన్ కేర్ లో కొన్ని పద్దతులను అనుసరించాలి. మరి ఆ నేచురల్ పద్దతులేంటో ఒకసారి తెలుసుకుందాం..

గోరువెచ్చని నూనెతో మాసాజ్ చేసుకోవాలి:

గోరువెచ్చని నూనెతో మాసాజ్ చేసుకోవాలి:

ఈ ప్రొసెస్ లో స్కిన్ టైట్ చేయడానికి ఎసెన్సియల్ ఆయిల్స్ ఎంపిక చేసుకోవాలి. ఉదా: కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ మొదలగునవి. వీటిలో ఏదో ఒక నూనె తీసుకుని, గోరువెచ్చాగా వేడి చేసి, మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ జరగుతుంది. వదులైన నెక్ స్కిన్ నేచురల్ గా టైట్ అవుతుంది.

ఎగ్ వైట్ మాస్క్

ఎగ్ వైట్ మాస్క్

ఎగ్ వైట్ లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మెడ, గొంతు బాగంలో వదులైన చర్మాన్ని టైట్ గా మార్చుతుంది.ఎగ్ వైట్ ను మెడమీద మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుడ్డు నుండి వైట్ ను వేరు చేసి, మెడ చుట్టూ అప్లై చేయాలి. 10 నిముసాల తర్వాత క్లాత్ తో తుడిచి గోరువెచ్చనినీటితో శుభ్రం చేసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

సాగిన చర్మాన్ని టైట్ గా మార్చడంలో సహాయపడే నేచురల్ రెమెడీస్ లో యాపిల్ సైడర్ వెనిగర్ ఒకటి. అందుకే దీన్ని ఎక్కువా మహిళలు ఉపయోగిస్తుంటారు . కొద్దిగా నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ వేసి మెడకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత మంచి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారంలో ఒకటి రెండు సార్లు చేసకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చర్మాన్ని కాంతివంతంగా మార్చే క్రీమ్

చర్మాన్ని కాంతివంతంగా మార్చే క్రీమ్

చర్మాన్ని కాంతివంతంగా మార్చే మీ బ్యూటీ కిట్ లోని క్రీమ్ తీసుకుని అప్లై చేయాలి. ఈ నేచురల్ క్రీమ్ ను రెగ్యులర్ గా అప్లై చేసుకోవాలి. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల అద్భుతంగా సహాయపడుతుంది.

నెక్ ఎక్సర్ సైజ్

నెక్ ఎక్సర్ సైజ్

మెడకు సంబంధించిన వ్యాయామం, యోగా చేయాలి. వీటి వల్ల మెడ అందంగా, నాజూగ్గా మారడమే కాదు, మెడ చుట్టూ స్కిన్ టైట్ గా మారుతుంది. రెగ్యులర్ గా చేస్తేమరింత ఎఫెక్టివ్ గాఫలితం ఉంటుంది. ఖర్చులేదు, సులభమైనది. నేచురల్ పద్దతి.

మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి

మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి

మెడకు నేచురల్ గా మాయిశ్చరైజర్ అప్లై చేయడం మంచిది. దాంతో నెక్ స్కిన్ కు సరిపడా అవసరమయ్యే తేమ అందుతుంది. చర్మం సాగకుండా నివారిస్తుంది. రోజుకు రెండు సార్లు అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది.

విటమిన్ ఇ ఆయిల్ :

విటమిన్ ఇ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ ఉంటుంది. అంతే కాదు యాంటీఆక్సిడ్స్ అధికంగా ఉంటాయి, వదులైన చర్మం టైట్ గా మార్చుతుంది.

ఆలివ్ ఆయిల్ ను విటమిన్ ఇ క్యాప్య్సూల్ తీసుకుని, అందులోని ఆయిల్ ను తీసి మెడకు అప్లై చేసి, మసాజ్ చేయాలి.

ఇది స్కిన్ టైట్ గా మార్చుతుంది. ఈ మిరాక్యులస్ హోం ట్రీట్మెంట్ ను వారానికి కొకసారి తప్పకుండా చేయవచ్చు,

ఎసెన్సియల్ ఆయిల్

ఎసెన్సియల్ ఆయిల్

ఎసెన్షియల్ ఆయిల్లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది వదులైన స్కిన్ ను టైట్ గా మార్చుతుంది. అందుకు జోజోబ ఆయిల్ ఆలివ్ ఆియల్ ను ఉపయోగించుకోవచ్చు. దీన్ని మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.సాగిన చర్మం టైట్ గా తిరిగి పూర్వ స్థితికి వస్తుంది. ఇలా వారానికొకసారిచేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది

అరటి మరియు నిమ్మరసం

అరటి మరియు నిమ్మరసం

బాగా మగ్గిన అరటిపండులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, మెడను ప్యాక్ లా వేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాలకొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. . మెడ అందంగా తయారవుతుంది.

English summary

How To Naturally Tighten Loose Neck Skin

Bid adieu to loose skin around the neck for long with the help of these suggested tips! Take a look.
Story first published: Saturday, May 13, 2017, 12:00 [IST]
Subscribe Newsletter