నల్లని పాదాలు తెల్లగా మారాలంటే..మీ వంటింట్లోని రెండు మూడు పదార్థాలు చాలు

Posted By:
Subscribe to Boldsky

అందం విషయంలో పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మొత్తం అందంలో పాదాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. శరీరంలో బయటకు కనిపించే భాగాల్లో పాదాలు కూడా ఒకటి. అందుకే పాదాల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. పాదాలు చూడటానికి నల్ల, అశుభ్రంగా ఉన్నప్పుడు చూడటానికి అసౌకర్యంగా ఉంటాయి.

ముఖ్యంగా నీటిలోని మురికి, సబ్బుల్లోని ఘాటైన రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి పాదాలను దుమ్ము, ధూళి, సూర్యరశ్మి నుండి పాదాలను కాపాడుకోవడానికి షూ వేసుకోవాలి. అయితే షూ ఎన్ని రోజులని షూను వేసుకుంటాం? కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టి మంచి సాండిల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా హై హీల్స్ వేసుకోవాలనిపిస్తుంది.

అటువంటప్పుడు పాదాలను సూర్యరశ్మి నుండి వాతావరణ కాలుష్యం, దుమ్మ, ధూళి నుండి రక్షణ పొంది పాదాలను తెల్లగా మార్చుకోవాలనుకొనే వారు ఈ క్రింది చిట్కాలను పాటించండి.

నల్లని పాదాలు తెల్లగా మార్చే నిమ్మకాయ :

నల్లని పాదాలు తెల్లగా మార్చే నిమ్మకాయ :

నల్లని చర్మాన్ని తెల్లగా మార్చేటటువంటి సహజమైన బ్లీచ్ ఇది. సూర్మరశ్మికి గురిఅయ్యే కాళ్ళు చేతులు, పాదాలు, భుజాలు, ముఖంను నిమ్మరసంతో కొద్దిసేపు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నల్ల బడ్డ చర్మం తిరిగి పూర్వస్థితికి లేదా తెల్లగా మారుతుంది. డెడ్ స్కిన్ ఉండటం వల్ల చర్మం నల్లగా మారేలా చేస్తుంది. కాబట్టి ఈ డెడ్ స్కిన్ తొలగించడానికి నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది.

నల్లని పాదాలు తెల్లగా మార్చే వైట్ వెనిగర్-పసుపు పేస్ట్:

నల్లని పాదాలు తెల్లగా మార్చే వైట్ వెనిగర్-పసుపు పేస్ట్:

సాధారణంగా ఇంట్లోని శెనగపిండిని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. కొద్దిగా శెనగపిండిని పసుపుతో కలిపి, పెరుగు, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని పాదాలకు మాస్క్ లా అప్లై చేయాలి ఇరవై నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అందమైన ఆరోగ్యమైన పాదాలు మీ సొంతం అవుతాయి.

నల్లని పాదాలు తెల్లగా మార్చే హాట్ ఆయిల్ మసాజ్:

నల్లని పాదాలు తెల్లగా మార్చే హాట్ ఆయిల్ మసాజ్:

పాదాలు ఎండిపోయినట్లుగా మరియు చూడటానికి గరుకుగా ఉంటాయి. అందుకు కారణం కాళ్ళలోని నూనె గ్రంధులు. కాబట్టి పాదాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రతి రోజూ గోరువెచ్చని నూనెతో పాదాలకు మాయిశ్చరైజ్ చేయాలి. హాట్ ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజ్ గా మాత్రమే కాదు, డెడ్ స్కిన్ తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా పాదాలను శుభ్రపరుస్తుంది. చర్మంలోని దుమ్మ, ధూలిని తొలగించి శుభ్రపడేలా పాదాలు ఉండాలంటే గోరువెచ్చని లేదా హాట్ ఆయిల్ మసాజ్ చాలా బాగా సహాయపడుతుంది. కాలును స్ర్కబ్ చేసిన తర్వాత కాళ్ళకు మాయిశ్చరైజర్ తప్పక వాడాలి. ఇలా చేయడం వల్ల పాదాలు తెల్లగా మారుతాయి.

నల్లని పాదాలు తెల్లగా మార్చే కోకోనట్ వాటర్:

నల్లని పాదాలు తెల్లగా మార్చే కోకోనట్ వాటర్:

సూర్య రశ్మి వల్ల పాదాలు నల్లబడటం జరిగితే కోకోనట్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. పాదాలకు కొబ్బరి నీటితో మసాజ్ చేయాలి. సూర్యరశ్మి నుండి పాదాలను సంరక్షించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమడీ అని చెప్పవచ్చు. కాబట్టి స్నానానికి పదిహేను నిముషాల ముందు కొబ్బరి నీటితో మసాజ్ చేయాలి. ఈ హోం రెమడీస్ నల్లగా మారిన పాదాలను సహజంగా తెల్లగా మార్చడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మీరూ ప్రయత్నించి చూడండి.

నల్లని పాదాలు తెల్లగా మార్చే రోజ్ వాటర్..పాల‌పొడితో పాదాల‌కు పూత‌..

నల్లని పాదాలు తెల్లగా మార్చే రోజ్ వాటర్..పాల‌పొడితో పాదాల‌కు పూత‌..

పాదాలు అందంగా కనిపించాలంటే అదేపనిగా పెడిక్యూరే చేయించుకోవాలని లేదు. ఇంట్లోనే ఆ పని చేయొచ్చు. దాంతోపాటు పాదాలకు ఈ పూతలు వేసి చూడండి. పాదాలపై మట్టి, మురికి ఎక్కువగా చేరుతుంటాయి. వాటిని వదిలించాలంటే పాలపొడి చాలు. గులాబీనీళ్లలో పాలపొడి కలిపి పాదాలకు పూతలా వేయండి. కాసేపయ్యాక కడిగేస్తే చాలు.

నల్లని పాదాలు తెల్లగా మార్చే ముల్తానీమ‌ట్టితో పాదాలు అందంగా..

నల్లని పాదాలు తెల్లగా మార్చే ముల్తానీమ‌ట్టితో పాదాలు అందంగా..

ఎండిన నారింజ తొక్కల పొడికి కాస్త ముల్తానీమట్టి కలిపి నీళ్లతో పూతలా తయారుచేసుకోవాలి. దీన్ని పాదాలకు రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచిది.

నల్లని పాదాలు తెల్లగా మార్చే పాదాల ముడ‌త‌లు పొగొట్టేందుకు కీర‌దోస రసం..

నల్లని పాదాలు తెల్లగా మార్చే పాదాల ముడ‌త‌లు పొగొట్టేందుకు కీర‌దోస రసం..

చెంచా చొప్పున గంధం పొడి, టొమాటో గుజ్జూ, నిమ్మరసం, కీరదోస రసం తీసుకుని మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే పాదాల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కీరదోస రసం పాదాల చర్మం తెల్లగా, ఆరోగ్యంగా మారేలా చేస్తుంది.

నల్లని పాదాలు తెల్లగా మార్చే పాదాల‌కు శ‌న‌గ‌పిండి పూత‌..

నల్లని పాదాలు తెల్లగా మార్చే పాదాల‌కు శ‌న‌గ‌పిండి పూత‌..

రెండు చెంచాల చొప్పున సెనగపిండి, నీళ్లూ, అరచెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. దీన్ని పాదాలకు పూతలా వేసి పావు గంట తర్వాత కడిగేయాలి.

నల్లని పాదాలు తెల్లగా మార్చే బంగాళాదుంప

నల్లని పాదాలు తెల్లగా మార్చే బంగాళాదుంప

బంగాళాదుంప ముక్కల్ని పాదాలపై రుద్దినా చాలు. పాదాల్లోని మృతకణాలు పోతాయి. కోసిన నిమ్మచెక్కపై కాస్తంత ఉప్పు వేసి పాదాలపై రుద్దాలి. ఇది కూడా పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. దీంతో పాదాలు అందంగా, మృదువుగా మారతాయి. చూశారుగా మీరూ ట్రై చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Remedies to remove tan from feet and legs in Telugu

    Remedies to remove tan from feet and legs, Feet is one of the most highly exposed body part. That is why, your feet always looks tanned, dark and unclean. Your feet is safe from dirt and sun tan only if you wear covered shoes. But, for how long can you wear shoes? Some or the other day you would like to wear
    Story first published: Friday, September 1, 2017, 16:47 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more