For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ, ఇక్కడ ఎందుకు వెళ్ళేది, ఇంట్లో స్వయంగా చేసుకోండి బాడీ మసాజ్

By Staff
|

శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేది బాడీ మసాజ్. ఈ మద్యకాలంలో బయట సలూన్ల రూపంలో బాగా ఫేమస్ అయ్యాయి. సలూన్లకు బాడీ మసాజ్ కోసం వెల్లడం వల్ల సమయం వ్రుదా, ఖరీదైన పద్దతి. బాడీ మసాజ్ లో కొన్ని టెక్నిక్స్ తెలిసుండం వల్ల కొన్ని సమస్యలను ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

ఒళ్ళు నొప్పులు తగ్గించి, శరీరానికి ఒక విశ్రాంతిని కలిగించే మసాజ్. అయితే ఎంత మంది ఈ పద్దతిని ఇంట్లో పాటిస్తుంటారు చెప్పండి? ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ తో గడుపుతుండటం వల్ల బయట సలూన్లకు వెళ్లి గంటల తరబడి కాచుకుని, బాడీ మసాజ్ చేయించుకోవడానికి చాలా మంది సుముఖంగా ఉండారు. అలాంటి వారు ఇంట్లోనే బాడీ మసాజ్ చేసుకోవచ్చు.

body massage at home

బాడీ మసాజ్ వల్ల పొందే ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

ఇంట్లో బాడీ మసాజ్ అనగానే ఏదో ఒక నూనె తీసుకుని ఒళ్ళంతా పూసేసుకోవడం కాదు, మసాజ్ కు సరిపోయే నూనెలు ఎంచుకుని, శరీరంలో ప్రత్యేకమైన భాగాలకు అప్లై చేయాలి. అందుకు కొన్నినియమాలు తెలుసుండాలి.

బాడీ మసాజ్ లో కొన్ని ప్రతేకమైన భాగాల్లో కొద్దిగా ఒత్తిడి కలిగించడం వల్ల ఆ బాగాలకు రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు ఆటోమాటిక్ గా చర్మంలో గ్లో పెరుగుతుంది.

ఇంట్లో బాడీ మసాజ్ చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

స్టెప్ I

స్టెప్ I

బాడీ మసాజ్ కోసం హైవాటర్ కంటెంట్ ఉన్న బాడీ లోషన్ ఉపయోగించుకోవాలి. అలాగే బాడీ మసాజ్ కు కొబ్బరి నూనె, ఆవనూనె , నువ్వుల నూనె వంటి నూనెలను ఎంపిక చేసుకోవాలి. ఈ నూనెలను బాడీ మసాజ్ కు ఉపయోగించే ముందు గోరువెచ్చగా చేసి తర్వాత వాడుకోవాలి.

స్టెప్ II

స్టెప్ II

హాట్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేసుకోవడానికి ముందు, ఇంట్లో ఎవరు లేని సమయం, ఒక గదిలో చేసుకోవాలి. అలాగే దుస్తులు కూడా మినిమల్ గా ఉండాలి. నూనె దుస్తులుకు అంటుంది కాబట్టి, కురచ దుస్తులను ఎంపిక చేసుకోవాలి.

స్టెప్ III

స్టెప్ III

బాడీ మసాజ్ ను పాదాల నుండి ప్రారంభించాలి. చేతి వేళ్ళను బాడీ మసాజ్ ఆయిల్ ను అద్దుకుంటూ, కాలి వేళ్ళ మద్యన అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. తర్వాత కొద్దిగా మసాజ్ ఆయిల్ తో పాటు, బాడీ లోషన్, కూడా చేతిలోనికి తీసుకుని, పాదాల మీద పోసి అప్లై చేయాలి. లైనర్ డైరెక్షన్ లో కాలి నుండి పాదం వైపు గా మసాజ్ చేయాలి. పాదాలను పైన నుండి క్రిందికి వరకూ ఒకే రకమైన మసాజ్ చేయాలి. ఒక్కో పాదంకు కనీసం పది నిముషాల మసాజ్ అవసరం అవుతుంది. ఆయిల్ డ్రై అయిపోతుందనిపిస్తే మరింత ఆయిల్ అప్లై చేసుకోవచ్చు.

స్టెప్ IV

స్టెప్ IV

పాదం నుండి, మోకాళ్ళ వరకూ మసాజ్ చేయాలి. మోకాళ్ళ నొప్పులు లేకున్నా, ఆ ప్రదేశంలో మాత్రం చాలా సున్నితంగా మసాజ్ చేయాలి. ఎందుకంటే శరీరం మొత్తనానికి చాలా తక్కువ బ్లడ్ సర్కిలేషన్ పాయింట్ అదే కాబట్టి. మోకాళ్ళను మసాజ్ చేయడానికి చేతిలోనికి ఆయిల్ తీసుకుని మోకాళ్ళకు అప్లై చేసి సర్కులర్ మోషన్ లో అప్లై మసాజ్ చేసుకోవాలి.

స్టెప్ V

స్టెప్ V

మోకాళ్ళ నుండి తొడల వరకూ మసాజ్ చేయాలి. ఈ భాగాలు నూనె ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి, కాస్త ఎక్కువగానే నూనె వేడి చేసుకోవాలి. మొదట తొడల లోపలి బాగాలకు గోరువెచ్చని నూనె అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత పైబాగంలో సర్కిల్స్ లో మసాజ్ చేయాలి. తర్వాత పైభాగంలో మసాజ్ చేయాలి. తొడల లోపలి వైపు మసాజ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తొడలకు మసాజ్ చేయునప్పుడు లైనర్ స్ట్రోక్ ను మెయింటైన్ చేయాలి. అంటే మోకాళ్ళ నుండి పొట్టవైపుకు చేయాలి.

శారీరక...మానసిక ఉల్లాసాన్నించే 6 బాడీ మసాజ్ లుశారీరక...మానసిక ఉల్లాసాన్నించే 6 బాడీ మసాజ్ లు

స్టెప్ VI

స్టెప్ VI

ఇప్పుడు పొట్ట ఉదరం, ఈ ప్రదేశంలో చాలా సున్నితంగా, కొంచెం సమయం తీసుకుని మసాజ్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ కు కూడా నూనె ఎక్కువ అవసరం అవుతుంది. పొట్ట ఉదరంలో గోరువెచ్చని నూనె అప్లై చేసిన తర్వాత సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి.

స్టెప్ VII

స్టెప్ VII

ఫైన స్టేజ్ బాడీ మసాజ్, అదే చేతులు. చేతులకు కూడా కొంచెం సమయం తీసుకుని సున్నితంగా మాసాజ్ చేసుకోవాలి. ఎడమచేతిలో కుడి చేతి భుజం నుండి క్రిందికి చేతి వేళ్ళ వరకూ గోరువెచ్చని నూనె అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. తిరిగి సర్క్యులర్ మోషన్ లో మెడకు వైపు కూడా మసాజ్ చేయాలి. అదే విధంగా కుడి చేతితో ఎడమ చేతి భుజం నుండి చేతి వేళ్ళ వైపు వరకూ మసాజ్ చేయాలి.

స్టెప్ VIII

స్టెప్ VIII

బాడీ మసాజ్ పూర్తి అయిన తర్వాత చివరిగా తిరిగి రెండు చేతులతో బాడీ మొత్తం ఒకసారి మసాజ్ చేసుకోవాలి. చేతులను కొంచెం ఎక్కువ సేపు మసాజ్ చేయాడానికి ఎక్స్ ట్రా నూనె తీసుకుని మసాజ్ చేయాలి.

English summary

Body Massage At Home | At Home Body Massage | How To Do Body Massage | Body Massage By Yourself

Step-by-step guide on how you can do a body massage at home all by yourself.
Desktop Bottom Promotion