For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

|

తలనొప్పిగా ఉన్నప్పుడు కొంచెం కొబ్బరినూనెను తలకు రాసి మర్దనా (మాలిష్‌) చేస్తే తలనొప్పి తగ్గి ఎంతో రిలాక్స్‌గా ఉంటుంది. అలాగే మన శరీరంలోని భాగాలు ఏవైనా బాధించినప్పుడు వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది. చాలా మందికి మసాజ్‌ ఎలా చేయాలో తెలియక మసాజ్‌ పార్లర్లకు వెళ్తు న్నారు. ఇంట్లోనే ఉండి మసాజ్‌ ఎలా చేసు కోవాలో వైద్యులు వివరిస్తున్నారు. మన శరీర భాగాలైన చేతులు, కాళ్లు, కళ్లు, తల, మెడ మొదలైన భాగాలు విపరీతంగా బాధించినపుడు మనం మసాజ్‌ ఎలా చేయాలంటే...ఈ చిట్కాలను మీరు ఈ వీకెండ్ లో ప్రయత్నించి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

తలనెప్పిగా ఉన్నప్పుడు మనం కొంచెం కొబ్బరి నూనెను చేతిలో తీసుకుని మృదువుగా మునివేళ్లతో మసా జ్‌ చేయాలి. రెండు చేతులతో మసాజ్‌ చేయడం వలన తలకు రిలాక్స్‌గా ఉండడమే కాకుండా తలనెప్పి తగ్గు తుంది. రోజంతా పనిచేసే మెదడుకు బాగా విశ్రాంతి కావా లంటే ఈ మసాజ్‌ తప్పనిసరి.

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

ముఖానికి కూడా మసాజ్‌ చేయవచ్చు. దీనినే వాడుక భాషలో ఫేషియల్‌ అంటారు. ముఖానికి కనీసం అరగంట మాలిష్‌ చేయాలి. దీనివల్ల ముఖంపై ముడుతలు, నల్ల చారలు తొలగి చక్కని రంగును సంతరించుకుంటుంది.నూనెతో మృదువుగా మర్దనా చేయాలి. నుదుటి భాగం నుంచి ముఖం మొత్తానికి మసాజ్‌ చేయాలి. చేస్తున్నప్పుడు ఏ మాత్రం చేతి గోళ్లు ముఖానికి తగలకూడదు. కొబ్బరినూనెతో కూడా ఈ విధంగా మర్దనా చేయవచ్చు. మసాజ్‌ చేస్తున్నప్పుడు చెవులు, ముక్కు భాగాలను కూడా చేయాలి. అప్పుడు ముఖం కాంతివంతగా ఉంటుంది.

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

మెడ మరియు మసాజ్‌ చేసేటప్పుడు మొదట మెడ భాగాన్ని అటూ ఇటూ తిప్పుతూ మసాజ్‌ చేసుకోవాలి. ఆ తరువాత భుజా లను కూడా రెండు చేతుల్లో మెల్లిగా పైకి కిందికి మసాజ్‌ చేయాలి. అప్పుడు నొప్పి తగ్గి విశ్రాంతి ఉంటుంది.

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

చేతులకు మసాజ్‌ చేస్తున్నప్పుడు అరచేతులు, మోచేతులకు కూడా మర్దనా చేయవచ్చు. ఒకచేతిలో మెల్లిగా మసాజ్‌ చేయాలి. చేతివేళ్ల మధ్యన చేయాలి. జాయింట్లు నొప్పిగా ఉన్నప్పుడు ఈ విధంగా మంచి ఉపశమనం లభిస్తుంది.

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

బాడీ మసాజ్ వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు

కాళ్లకు మసాజ్‌ చేసేటప్పుడు కూర్చొని కాళ్లు రెండింటిని చాపి మోకాలి భాగం నుండి అరికాలి వరకు మర్దనా చేయాలి. రోజంతా తిరుగుతాం కాబట్టి కాళ్లకు విశ్రాంతిని కల్పించాలంటే మసాజ్‌ తప్పనిసరి. రెండు చేత కాళ్లకు మృదువుగా మాలిష్‌ చేస్తే కాళ్ల నొప్పులు తగ్గి నిదుర చక్కగా పడుతుంది. ఆయుర్వేద తైలాలను, ఆలివ్‌నూనెను, కొబ్బరి నూనెను మసాజ్‌ ఉపయోగించవచ్చు.

English summary

Body Massage And It's Benefits: Weekend Special

Body massage, one of the oldest methods of treatment is still taken to be one of the best ways to cure health disorders. Body massage is an art and it is used not only for beauty purposes but also to treat major health disorders like arthritis, nerve problem, body pain etc. It works on the phenomenon of touch and pressure.
Story first published: Saturday, March 22, 2014, 11:59 [IST]
Desktop Bottom Promotion