For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: మసాజ్ తో జర భద్రం:- గాయమైన కాలుకు మసాజ్ చేయడంతో, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..!

గాయ‌మైంద‌ని మ‌సాజ్ చేస్తే… అది విక‌టించి అత‌ని ప్రాణాలే పోయాయి..! ఎలాగో తెలుసా..?

|

సహజంగా శరీరంలో ఏ భాగంలో అయినా గాయం అయితే... లేదంటే వాపు, నొప్పి ఉంటే అక్క‌డ మ‌సాజ్ చేసుకుంటాం. దీంతో నొప్పి పోతుంది, కాబ‌ట్టి వాపు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిట్కాలను పాటించడం సహజం. అయితే కాలు నొప్పితో విలవిలలాడుతున్న కుమారుడి బాధను చూడలేక మసాజ్‌ చేసింది ఓ తల్లి. దీని వ‌ల్ల నొప్పి పోయి త‌న కొడుకు కోలుకుంటాడ‌ని ఆ త‌ల్లి భావించింది. ఆ మసాజ్ తన కొడు ప్రాణాలు తీసుకుంటుందని ఊహించలేకపోయింది ఆ తల్లి.

23-year-old Delhi man dies after mother massages his injured ankle

మసాజ్ ఆరోగ్యానికి మంచిదే, మేలు చేస్తుందనే తెలిసు..కానీ తెలియక చేసిన పొరపాటు వల్ల కొడుకు ప్రాణాలు పోయాయి. అసలు మసాజ్ వల్ల ఎందుకు చనిపోయాడు ఈ ఘటన ఎక్కడ జరిగింది..ఎలా జరిగిందో తెలుసుకుందాం..

ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువకుడు

ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువకుడు

ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువకుడు గతేడాది బ్యాడ్మింటన్‌ ఆడుతూ గాయపడ్డాడు. డాక్టర్లు అతడి ఎడమ కాలు చీలమండలం (Ankle) విరిగిపోయినట్లు గుర్తించారు.

 కాలుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ స్లాబ్ సాయంతో కట్టుకట్టారు

కాలుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ స్లాబ్ సాయంతో కట్టుకట్టారు

దాంతో అతడి కాలుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ స్లాబ్ సాయంతో కట్టుకట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దాన్ని తొలగించినా.. కదలకుండా గట్టిగా కట్టు కట్టడం వల్ల అతడి మడమ భాగంలో రక్తం గడ్డకట్టి (Blood clot or Dvt) నొప్పి ఎక్కువైంది. డివిటి (డీప్ వీన్ థ్రోంబోసిన్ )కారణంగా శరీరంలో ఏభాగంలో అయినా బ్లడ్ క్లాట్స్ ఉంటే అత్యంత ప్రమాధకర స్థితిగా డాక్టర్లు సూచిస్తారు.

కాలు మడమలో డివిటి-

కాలు మడమలో డివిటి-

కాలు మడమలో డివిటి-రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో నొప్పిని భరించలేక తల్లడిల్లిపోతున్న కొడుకుని చూసి, అతడి తల్లి.. నూనె రాసి కాలుకు మసాజ్‌ చేసింది.

30 నిమిషాల పాటు చేసిన మసాజ్ చేయడం వల్ల

30 నిమిషాల పాటు చేసిన మసాజ్ చేయడం వల్ల

30 నిమిషాల పాటు చేసిన మసాజ్ చేయడం వల్ల ఊపిరితిత్తులకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు 5X1 cm ఉన్న బ్లడ్ క్లాట్ ను రక్తంతో ప్రసరించి ఊపిరితిత్తుల్లో చేరి, అక్కడ మూసుకుపోవడంతో.. అతడు స్పృహ కోల్పోయాడు.

అప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి

అప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి

అప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా పడిపోవడంతో వెంటనే అతణ్ని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అత‌ను మృతి చెందాడు..!

కాలిలో రక్తం గడ్డకట్టినప్పుడు మసాజ్‌ చేయడం వల్ల

కాలిలో రక్తం గడ్డకట్టినప్పుడు మసాజ్‌ చేయడం వల్ల

అతని మరణానికి కారణాలను తెలుసుకోవడానికి.. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు.. కాలిలో రక్తం గడ్డకట్టినప్పుడు మసాజ్‌ చేయడం వల్ల అది ప్రాణాపాయంగా మారిందని నిర్ధారించారు.

అది విన్న తర్వాత..

అది విన్న తర్వాత..

అది విన్న తర్వాత.. ఆ తల్లి కుప్పకూలిపోయింది. తన చేతులారా తానే..తన కొడుకుని చంపుకున్నానని ఆ తల్లి కన్నీరుమున్నీరైంది.

మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ఆ యువ‌కుడి కేసును ప్ర‌చురించారు

మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ఆ యువ‌కుడి కేసును ప్ర‌చురించారు

ఈ సంఘ‌ట‌న ఢిల్లీలో గతేడాది అక్టోబ‌ర్ 31న జ‌రిగింది. కాగా ఇటీవ‌లే ప‌బ్లిష్ అయిన ఓ మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ఆ యువ‌కుడి కేసును ప్ర‌చురించారు.

వార్త ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది

వార్త ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది

ఈ క్ర‌మంలో అత‌ని వార్త ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఆ యువ‌కుడి కాలిలో 5 సెంటీ మీట‌ర్ల మేర ర‌క్తం గ‌డ్డ క‌ట్టింద‌ట‌.

కాస్తా ర‌క్త నాళం ద్వారా ఊపిరి తిత్తుల‌కు చేరి స్పృహ కోల్పోవ‌డం

కాస్తా ర‌క్త నాళం ద్వారా ఊపిరి తిత్తుల‌కు చేరి స్పృహ కోల్పోవ‌డం

అది కాస్తా ర‌క్త నాళం ద్వారా ఊపిరి తిత్తుల‌కు చేరి స్పృహ కోల్పోవ‌డంతో అత‌ను చ‌నిపోయాడ‌ట‌. అత‌న్ని పోస్ట్‌మార్టమ్ చేసిన వైద్యులు ఆ విష‌యం చెప్పారు.

స‌రైన అవ‌గాహ‌న లేకుండా

స‌రైన అవ‌గాహ‌న లేకుండా

స‌రైన అవ‌గాహ‌న లేకుండా చాలా బ‌లంగా కాలిపై మ‌సాజ్ చేయ‌డం వ‌ల్లే అలా జ‌రిగింద‌ని వైద్యులు తెలిపారు.

తెలిసీ తెలియ‌కుండా మ‌సాజ్ చేస్తే

తెలిసీ తెలియ‌కుండా మ‌సాజ్ చేస్తే

తెలిసీ తెలియ‌కుండా మ‌సాజ్ చేస్తే ఇలా ర‌క్తం గ‌డ్డ క‌ట్టే ప్ర‌మాదం ఉంటుద‌ని, తద్వారా ప్రాణాపాయ స్థితులు సంభ‌విస్తాయ‌ని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు.!

English summary

23-year-old Delhi man dies after mother massages his injured ankle

In a cautionary episode, a 23-year-old man, who developed deep vein thrombosis (DVT) following an ankle injury while playing badminton, died after his mother massaged his leg to ease the pain.
Desktop Bottom Promotion