For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ విధమైన బాడీ మసాజ్ లతో బరువు తగ్గించుకోవచ్చు...!

|

బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రయాత్నాలు చేసి విసిగెత్తిపోయారా?బరువు తగ్గించుకోవడానికి డయట్, యోగా, పిల్లేట్స్ మరియు ఇతర రకాలైన వ్యాయామాలు ఇవన్నీ కూడానూ బరువు తగ్గించడానికి సహాపడే పద్దతులే. ప్రక్రియలే..ఒక వేళ మీ శరీర తత్వాన్ని బట్టి కూడా బాడీ మసాజ్ చేయడం వల్ల మీ శరీరం స్లిమ్ గా మారవచ్చు . సాధారణంగా ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి మరియు శ్రమించిన శరీరం తాజా అనుభూతిని పొందడానికి మసాజ్ చేయించుకొంటుంటాం. అయితే బాడీ మసాజ్ బరువు తగ్గించడంలో ఉపయోగపడక పోవచ్చు. కానీ కొన్ని మసాజ్ పద్దతులను అనుసరించడం వల్ల ఆరోగ్యానికి చక్కటి ఫలితం ఉంటుంది. దాంతో బరువు తగ్గడానికి సహాపడుతుంది. అంతే. అదేలాగో చూద్దాం....

లిప్డ్ బ్రస్టింగ్ మసాజ్: ప్రస్తుత రోజుల్లో చాలా వ్యాయామ సెంటర్లలో లేదా స్పాలలో లేదా జిమ్ సెంటర్లలో ఈ విధంగా లిప్డ్ బ్రస్టింగ్ మసాజ్ ను ఉపయోగిస్తుంటారు . ఈ పద్దతి వల్ల ఫ్యాట్ సెల్ బ్రస్ట్ అయ్యి, అతి త్వరగా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అయితే ఈ లిప్డ్ బ్రస్టింగ్ మసాజ్ కు కొన్ని ప్రత్యేకమైన మసాజ్ ఆయిల్స్ తో పాటు కొన్ని టెక్నిక్స్ తెలుసుండాలి. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాటీ కరిగించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అందువల్లే బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో స్టొమక్ మసాజ్ చాలా సాధారణంగా ఉంది. మారిపోయింది. మంచి డైయటింగ్ తో పాటు, వ్యాయామం ఉన్నప్పుడే ఇలాంటి మసాజ్ ల వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉన్నది. ఒట్టి మసాజ్ లు చేసుకోవడం వల్ల ఎటుటుంటి ప్రయోజనం ఉండదు. బాడీని స్లిమ్ గా మార్చుకోలేరు. లిపిడ్ బ్రస్టింగ్ మసాజ్ తో, ఇంకా సాధారణ బాడీ మసాజ్ వల్ల కూడా మీరు బరువు తగ్గవచ్చు . సులభంగా బరువు తగ్గడంలో మసాజ్ ఎలా పనిచేస్తుంది అనేదానికి కొన్ని కారణాలున్నాయి...

Can Body Massage Aid Weight Loss....?

ఫ్లెక్సిబిలిటి: గోరువెచ్చని ఆయిల్ తో బాడీ మసాజ్ చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. దాంతో శరీరం వంచడానికి సులభతరం అవుతుంది. ఎప్పుడైతే శరీరం ఇటువంటి సులభం వంచగలుగుతామో ..అప్పుడే వ్యాయామం చేయాడానికి సులభంగా ఉంటుంది. ఇలా క్రమంగా చేయడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉన్నది.

జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది: సున్నితమైన బాడీ మసాజ్ వల్ల , శరీరం మొత్తం జీవక్రియలన్నీ విశ్రాంతి చెందుతాయి. ఎప్పుడైతే రిలాక్స్ పొందుతారో అప్పుడు తిరిగి శక్తిని పొందవచ్చు. అదే సమయంలోజీర్ణవ్యవస్త వేగవంతం అవుతుంది. దాంతో జీర్ణక్రియలు వ్రుద్ది చెందుతాయి. ఇక రకంగా ఇలా చేయడం వల్ల కూడా బరువు తగ్గేందుకు అవకాశం ఉంది.

రక్తప్రసరణను పెంచుతుంది: బాడీ మసాజ్ వల్ల, శరీరంలో మొత్తం రక్త ప్రసరణ బాగా అభివ్రుద్ది చేందుతుంది. ఫ్యాట్ మెటబాలిజ్ కూడా అభివ్రుద్ది చెందుతుంది. అన్ని అవయవాలకు కావల్సిన రక్తప్రసరణ సక్రమంగా అంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

స్కార్ టిష్యుష్: మజిల్స్ వదులైనప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పడు ఆ ప్రదేశంలో స్కార్స్ (చారలు)ఏర్పడుతాయి. ఇలా వ్యాయామం చేసిన తర్వాత కనబడుతుంటాయి. బాడీ మసాజ్ వల్ల చారలు తొలగిపోతాయి. కండరాలు వదులవుతాయి. దాంతో వర్కౌట్స్ చేయడానికి సులభం అవుతుంది.

ఒత్తిడి మాయం: బాడీ మసాజ్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుముఖం పడుతాయి. దాంతో బరువు పెరగడానికి కారణం అయ్యే జీవక్రియలు తగ్గుతాయి. దాంతో బరువు తగ్గవచ్చు . కాబట్టి డీ స్ట్రెస్సింగ్ మసాజ్ వల్ల మెటబాలైస్ ఫ్యాట అతి త్వరగా తగ్గుతుంది.

English summary

Can Body Massage Aid Weight Loss....? | బరువు తగ్గించే బాడీ మసాజ్...!


 Are you tired of trying different ways to lose weight fast? Diet, gym, yoga, pilates and several other kinds of exercises help you to lose weight. May be a body massage for weight loss can be a catalyst to slim you down. We usually go for a massage to relax and feel refreshed. The concept of having a body massage for weight loss may not have occurred to you.
Story first published: Tuesday, March 5, 2013, 10:43 [IST]
Desktop Bottom Promotion