For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్రిష సౌందర్య రహస్యం ..ఈ వీడియో ద్వారా బట్టబయలు..!

|

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన చేయడం ఆయుర్వేద విధానంలో ఒక మార్గం. అయితే ఇది కేవలం ఒక ఆయుర్వేదానికే పరిమితం కాదు. ఆధునిక వైద్య చికిత్సతో పాటు మరెన్నో చికిత్సా ప్రక్రియల్లోనూ అవసరాన్ని బట్టి మర్దనను ఉపయోగించడం పరిపాటి. ఈ మర్దననే బాడీ మసాజ్‌గా అభివర్ణించవచ్చు.

కేరళ, ఆయుర్వేద గడ్డ: కేరళలో సమతుల్యమైన వాతావరణం, సహజ సంవృద్ధి కలిగిన అడవులు( మూలికలు మరియు ఔషధ మొక్కలు యొక్క సంపదతో)ఉన్నాయి. చల్లని రుతుపవన కాలం(జూన్ నుంచి జులై మరియు అక్టోబర్ నుంచి నవంబర్)లు ఆయుర్వేద చికిత్సలకు మరియు కాయకల్ప చికిత్స ప్యాకేజీలకు అనువైన కాలం. నిజం చెప్పాలంటే, భారతదేశంలో కేరళలో మాత్రమే ఇప్పుడు పూర్తి నిబద్ధతతో ఈ ఆయుర్వేద విధానం అమలవుతోంది. ఈ ఆయుర్వేద బాడీ మసాజ్ వల్ల ఆరోగ్యానికి మరియు అందానికి కూడా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆయుర్వేద బాడీ మసాజ్ లో మూడు ఆయుర్వేదిక్ మసాజ్ లు చాలా పాపులర్ అయినటువంటివి అవి 1. నవరక్కిజి, స్నేహధార మరియు స్నాన. ఈ క్రింది వీడియో గమనించినట్లైతే ఈ మూడు రకాల మసాజ్ లు మీరు చూడవచ్చు.
<center><center><style type='text/css'>#vogroll_4{border:none;margin:0px;}</style><iframe src='http://www.indiavideo.org/video-embed.php?f=ODkxMC4=' height='369' width='640' align='center' frameborder='0' marginwidth='0' marginheight='0'></iframe></center></center>
Video Courtesy: www.indiavideo.org

నవరక్కిజి (Navarakkizhi): ఇది భారతదేశంలో పురాతన వైద్య ఆయుర్వేదం ఒకటి. ఈ మసాజ్ బియ్యాన్ని కొన్ని వనమూలికలు మరియు నీటిలో నానబెడుతారు. దీన్ని ఆవిరి మీద ఉడికించి కుండలో పోసి దానికి వస్త్రం చుట్టి సంచిలో పెట్టి నింపుతారు. ఈ నవరక్కిజి రెండు ప్రక్రియలు. మొదటిది మూలికా తైలంతో బాడీ మసాజ్ చేయడం తర్వాత మూలికలు, నూనెల్లో ఉడికించిన బియ్యాన్ని సంచిలో వేసి మూతకట్టి చిన్న మూటతో బాడీ మసాజ్ అంటే నరాల మీద రుద్దుతారు. ఇది శరీరంలోని నొప్పులను నివారిస్తుంది. చాల సున్నితమైన ప్రదేశాల్లో తక్షణ ఉపశమనం అందిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు మరియు ఇతర కండర మరియు ఎముకల నొప్పుల నివారిస్తుంది.

స్నేహదార: ఇది ఆయుర్వేదిక్ మసాజ్ మరియు స్నానం. కొన్ని హేర్బల్ ఆయిల్స్ ను ఆవిరి మీద ఉడికించి, ఆ నూనెను శరీరానికి మొత్తానికి పట్టిస్తారు . తర్వాత మసాజ్ చేసి స్నానం చేయిస్తారు. దీని వల్ల అనేక ఆరోగ్య రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తుంది. బాడీపెయిన్స్, జీర్ణసమస్యలు, ఒత్తిడి వంటి వాటన్నింటికి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఈ ఆయుర్వేద బాత్ ను పంచకర్మ అని కూడా అంటారు. ఇది శరీర ఆరోగ్యానికి మేలు మాత్రమే కాదు ..చాలా రకాల బ్యూటీ బెనిఫిట్స్ కూడా అధికమే. ఇది చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేసి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

స్నాన: అభ్యంగన స్నానం చేయడం వినే ఉంటారు చాలామంది. కాని అభ్యంగన మసాజ్ చేస్తే శరీరం చాలా తేలికగా తయారవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అభ్యంగన మసాజ్ అనేది ఓ రకమైన ఆయుర్వేద మసాజ్. ఆయుర్వేదాన్ననుసరించి శరీరంలో మూడు రకాల దోషాలుంటాయి. వీటిని త్రిదోషాలని పిలుస్తారు. 1. వాత, 2. పిత్త మరియు 3. కఫం. ఈ దోషాలు ప్రతి మనిషి శరీరంలోను వారి వారి శరీర తత్వాలననుసరించి వాతావరణంలో వచ్చే మార్పులననుసరించి బయట పడతాయి. కాబట్టి ఈ మూడు పద్దతులను ఉపయోగించి అనేక రుగ్మతలకు స్వస్తి పలకడంతో పాటు..చక్కటి సౌందర్యాన్ని పొందవచ్చు.

మర్దనలో జాగ్రత్తలు: మర్దనచికిత్సను చేసే నిపుణులు శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు శరీర నిర్మాణాన్ని తెలుసుకోకుండా చేసే మర్దనతో నొప్పి మరింత పెరగవచ్చు. కాబట్టి శరీర నిర్మాణ తత్వాన్ని అనుసరించి మర్దన చేయడం ఈ చికిత్స ప్రక్రియలో అవసరం.
హీరోయిన్ త్రిష ఎప్పుడూ వార్తల్లో ఉండటం విశేషం. త్రిష ఓ ఆయుర్వేద థెరఫీ సెంటర్లో బాడీ మసాజ్ చేయించుకుంటున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి తాజాగా ఇంటర్నెట్‌లో సర్కులేట్ అవటం సంచలనాన్ని సృష్టించింది.

English summary

3 Ayurvedic Massages To Rejuvenate You | త్రిష సౌందర్య రహస్యం ..ఈ వీడియో ద్వారా బట్టబయలు..!

Ayurveda is the ancient science that uses herbal materials for healing several illnesses. Ayurvedic massages have several health and beauty benefits. These days, Ayurvedic treatment is suddenly in vogue.
Desktop Bottom Promotion