For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ పెయిన్స్ ను తగ్గించే ఐదు అద్భుతమైన మసాజ్ లు...!

|

ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపా రస్తులు, డెస్క్‌ జాబ్‌ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే వుంటారు. ప్రత్యేకించి వీరికి 30ఏళ్ళు వచ్చాయంటే ఇక అవి క్రమం తప్పకుండా వస్తూనే వుంటాయి. దీనికి కారణం దీర్ఘకాల సమయం వారు ఒకే చోట కూర్చొని వుండటం కూడాను.

Top 5 Massages For Body Pain Relief..

మరి ఈ నొప్పులకు మీరు పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్ల వేసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మసాజ్‌ ఉత్తమం అని చెప్పవచ్చు. మసాజ్‌ చేస్తే ఎటువంటి శారీరక నొప్పి అయినప్పటికీ తగ్గిపోతుంది. అయితే, ఈ మసాజ్‌లో ఎన్నో రకాలుంటాయి. త్వరితంగా నొప్పి తగ్గాలంటే ఏ రకమైన మసాజ్‌లు చేయాలి? అనేది పరిశీలిద్దాం.

థాయ్ మసాజ్‌ : థాయ్ మసాజ్‌ ఎంతో ఆనందం ఇస్తుంది. బ్యాంకాక్‌ సందర్శకులకు ఇది ఒక మంచి అనుభవం. ఈ మసాజ్‌లో శరీరంలోని ఎనర్జీ అంతా ఒక వరుసకు తెస్తారు. మసాజ్‌ చేసేవారు తమ చేతి వేళ్ళతో మరియు ఒక నల్లటి సూదంటు రాయితో శరీరంపై వున్న సున్నిత స్థానాలపై ఒత్తిడి తెస్తారు. మసాజ్‌ చేయించుకుంటే చాలు మీకు ఎంతో శక్తి వస్తుంది.

హాట్‌ స్టోన్‌ మసాజ్‌ : దీనినే కేరళ మసాజ్‌ అని కూడా అంటారు. ఇది కేరళ రాష్ట్రంలో పుట్టింది. మీ శరీర నొప్పి కనుక గట్టితనం లేదా గట్టి కండరా లవల్లని భావిస్తుంటే ఈ మసాజ్‌ మీకు మంచిది. వేడి చేసిన, వివిధ సైజుల రాళ్ళతో మీ శరీరంపైగల సున్నిత స్థానాలను మర్దన చేస్తారు. అప్పుడు మీకు నొప్పులు తగ్గి హాయి భావన కలుగుతుంది.

టిష్యు మసాజ్‌ : ఈ మసాజ్‌ చర్మంపై చేసినప్పటికీ చర్మం కింద పొరలవరకు చేరుతుంది. ఈ మసాజ్‌లో కలిగే ఒత్తిడి దెబ్బలు తగిలి కోలుకొనే వారికి ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. కనుక వైద్యులు బాధనుండి విముక్తి పొందాలంటే దీనినే సూచిస్తారు.

ఆరోమా థెరపీ మసాజ్‌ : ఈ ఆరోమా థెరపీ మసాజ్‌లో మీ ఇంద్రియాలను చైతన్యవంతం చేస్తారు. వివిధ రకాల వాసన నూనెలు మరియు సెంట్లు వంటివి మీ కండరాలను సడలించేందుకు రాస్తారు. ఒత్తిడి తగ్గించే భావనలు కలిగేలా చేస్తారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను కూడా వారు వాడతారు. ఈ మసాజ్‌ దేశంలోని అన్ని స్పాలలోను, మసాజ్‌ సెంటర్లలోను విరివిగా లభిస్తుంది. అది చేస్తే చాలు కనీసం ఐదు లేదా ఆరు రోజుల పాటు మీ శరీర కండరాలు ఎంతో సరళంగా హాయిగా భావిస్తాయి.

స్వీడిష్‌ మసాజ్‌ : స్వీడిష్‌ మసాజ్‌ కూడా సాధార ణమైనదే, మొదటి సారి మసాజ్‌ చేయించు కొనేవారికి ఇది మంచిది. శరీరం అంతా చేస్తారు. చక్కటి సున్నితమైన చేతి ఒత్తిడి కలిగిస్తారు. మెత్తటి దెబ్బలు వేసి బాధ నుండి విముక్తి చేస్తారు. సాధారణ శరీర నొప్పులకు బాగా పనిచేస్తుంది. కాని మసాజ్‌ మెళకువ కలిగిన వారు చేయాలి. చాలా కాలంగా శారీరక నొప్పులు వుంటే మాత్రం దీనికి బదులుగా పైన తెలిపిన నాలుగు మసాజ్‌లు బాగా పనిచేస్తాయి.

English summary

Top 5 Massages For Body Pain Relief.. | ఒళ్ళు నొప్పులకు తక్షణ ఉపశమనం ‘బాడీ మసాజ్’..!

Body pain is an unfortunate side effect of our stressful modern lifestyle. Most working professionals with desk jobs develop some type of body pain by the time they are 30. You can blame the long working hours or the sitting postures that brings in body pain. As it is neither advisable nor feasible to pop pain killers for body ache all the time; massage is one of the best alternatives for pain relief. Here are best massages that are most often recommended to relieve body pain.
Story first published: Friday, August 24, 2012, 13:27 [IST]
Desktop Bottom Promotion