For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెరీ సింపుల్ : బంగాళదుంప, నిమ్మరసంతో చంకల్లో నలుపుకు గుడ్ బై..!!

సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ తో అండర్ ఆర్మ్ లో డార్క్ ప్యాచెస్ ను నివారించుకోవచ్చు..

|

సాధారణంగా అమ్మాయిలకు అందంగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. అందం విషయంలో కాస్మోటిక్స్ మాత్రమే కాదు, వస్త్రాధారణ కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది. అయితే ఇష్టమైన స్లీవ్ లెల్ డ్రస్ లు వేయాలంటే కొంత మంది జంకుతుంటారు. ఎందుకంటే చంకల్లో నలుపు గురించి భయపడుతుంటారు. చంకల్లో నల్లగా డార్క్ ప్యాచెస్ ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని టెస్టెడ్ హెర్బల్ రెమెడీస్ ను ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది. ఎఫెక్టివ్ హోం రెమెడీస్ లో బంగాళదుంప ఒకటి. ఇది బహుమూలల్లో డార్క్ ప్యాచెస్ ను నివారించడం మాత్రమే కాదు, నలుపును కూడా క్రమంగా తగ్గిస్తుంది.

What Happens When You Apply Potato Juice & Lemon On Your Dark Armpits?

ముందుగా చంకల్లో డార్క్ ప్యాచెస్ ఎందుకు ఏర్పడుతాయన్న విషయం తెలుసుకోవాలి? చంకల్లో డార్క్ ప్యాచెస్ ఏర్పడటానికి కారణం హార్మోనుల్లో మార్పులు, జనెటిక్స్, డియోడ్రెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డార్క్ ప్యాచెస్ ఏర్పడుతాయి.

ఇటువంటి పరిస్థితిలో డియోడరెంట్స్ ఉపయోగించడం నివారించాలి. డియోడ్రెంట్స్ కు ప్రత్యామ్నాయంగా కొన్ని నేచురల్ పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం. కార్న్ స్ట్రార్చ్ పౌడర్ చెమటను నివారిస్తుంది. బహుమూలల్లో చెమట వాసన రాకుండా నివారిస్తుంది. ఇంకా వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి, చర్మానికి ఎలాంటి హాని జరగదు.

బహుమూలల్లో ఇన్ఫెక్షన్ నివారించాలంటే వదులైన దుస్తులు వేసుకోవాలి. థైరాయిడ్ ను చెక్ చేసుకోవాలి. రోజుకు బాడీకి సరిపడా 7 నుండి 8 గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా తాగాలి. టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయాలి. డెడ్ స్కిన్ లేయర్స్ ను తొలగించడం వల్ల చర్మ రంగుల్లో మార్పులు వస్తాయి. అందుకు కొన్ని సురక్షితమైన, ఎఫెక్టివ్ నేచురల్ పదార్థాలున్నాయి. వీటిని కనుక రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అండర్ ఆర్మ్ లో డార్క్ ప్యాచెస్ ను నివారించుకోవడానికి హోం రెమెడీస్ ను ఉపయోగించడానికి ముందు చర్మం మీద ప్యాచ్ టెస్ట్ ను చేసుకోవడం మంచిది. ఎలాంటి ఇరిటేషన్, మంట వంటివి లక్షణాలు కనబడకుంటే నేరుగా డార్క్ ప్యాచెస్ మీద అప్లై చేసుకోవచ్చు. అండర్ ఆర్మ్స్ లో గాయాలు, మొటిమలు వంటి లక్షణాలు కనబడితే, ఈ హోం రెమెడీస్, హెర్బల్ రెమెడీస్ ను ఉపయోగించడం మానేయాలి.

What Happens When You Apply Potato Juice & Lemon On Your Dark Armpits?

పొటాటో అండ్ లెమన్ జ్యూస్ : బంగాళదుంపలో నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని లైట్ గా మరియు బ్రైట్ గా మార్చుతాయి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్, , యాంటీసెప్టిక్ లక్షణాలు టానింగ్ ను తొలగిస్తుంది. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

బంగాళదుంప తొక్క తీసి, జ్యూస్ తియ్యాలి. అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి కాటన్ బాల్ ను డిప్ చేసి, డార్క్, బ్లాక్ ప్యాచెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత తడి టవల్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ నేచురల్ రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే చర్మం రంగులో తప్పనిసరిగా మార్పు కనబడుతుంది.

What Happens When You Apply Potato Juice & Lemon On Your Dark Armpits?

బేకింగ్ సోడ: ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని, వాటర్ తో మిక్స్ చేయాలి. స్మూత్ గా పేస్ట్ చేసి అండర్ ఆర్మ్ కు పేస్ట్ చేయాలి. పూర్తి డ్రైగా మారిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి స్క్రబ్ చేసి, తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడా డెడ్ స్కిన్ సెల్స్ ను ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. స్కిన్ టోన్ ను లైట్ గా మార్చుతుంది.

What Happens When You Apply Potato Juice & Lemon On Your Dark Armpits?

పెరుగు , పాలు: ఈ రెండింటి కాంబినేషన్ లో మాస్క్ వేసుకోవడం వల్ల వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, స్కిన్ టోన్ ను వైట్ గా మార్చుతుంది. ఒక టీస్పూన్ శెనగపిండి, లో కొద్దిగా పాలు, పెరుగు మిక్స్ చేసి, స్మూత్ గా పేస్ట్ చేయాలి.

తర్వాత దీన్ని అండర్ ఆర్మ్ లో ఉన్న డార్క్ ప్యాచెస్ మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

What Happens When You Apply Potato Juice & Lemon On Your Dark Armpits?

Dark armpit, no more, with these easy herbal remedies.
Desktop Bottom Promotion