For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటి వల్ల మీ జుట్టుకు & చర్మానికి కలిగే సౌందర్య ప్రయోజనాలు !

|

చాలామంది తమ రోజువారీ ఆహారంలో అరటిని తినడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అరటిలో ఉండే విటమిన్లు & మినరల్స్ అన్ని కూడా మన శరీరానికి అవసరమైనవే ఉంటాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అరటి, మీ జీర్ణక్రియకు దోహదపడటమేకాక మీ చర్మాన్ని మరింతగా మెరుగు పరుస్తుంది. అరటి వల్ల మనకు కలిగే చాలారకాల ప్రయోజనాల గురించి మనందరికీ బాగా తెలుసు.

మీరు అరటిని బాహ్యంగా ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు & చర్మానికి కలిగే ప్రయోజనాలను గూర్చి తెలుసుకొని ఆశ్చర్యపోతారు ! అరటిలో విటమిన్-A ఉన్న కారణంగా మీ చర్మాన్ని మరింత బాగా సంరక్షిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా చర్మం యొక్క సాగే గుణాన్ని పెంపొందించడంలో దోహదపడుతుంది.

అంతేకాకుండా, యూవీ కిరణాల దాటి నుంచి మీ చర్మం ప్రతిఘటించేలా చేయడంలో సహాయపడుతుంది, ముడతలను తగ్గిస్తుంది. అరటిలో ఉండే హైడ్రేటింగ్ ఏజెంట్లు మీ మాడును తేమగా ఉంచడంలో సహాయంపడటం వల్ల మీరు మరింత మృదువైన, ఒత్తయిన, ఆరోగ్యవంతమైన జుట్టును పొందుతారు.

చర్మము & జుట్టుకు సంబంధించి ఉన్న అనేక రకాల సమస్యలను పరిష్కరించడంలో అరటితో చేసే ప్యాక్లు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ముడతలను, మొటిమలను నిరోధించడం & జుట్టు చివర్లో పగుళ్ళు ఏర్పడటం వంటి అనేక ఇతరత్రా సమస్యలను పరిష్కరిస్తుంది.

ప్రకాశవంతమైన చర్మం కోసం :-

అరటితో చేసే ఫేస్ ప్యాక్ వల్ల డార్క్ స్పాట్స్, మచ్చలు తొలగిపోయేలా చేసి మీ చర్మాన్ని మరింత ప్రకాశించేలా చేస్తుంది.

కావలసినవి :

1 అరటిపండు

ఒక టీ స్పూన్ తేనె

తయారీ విధానం :

* అరటిని చిన్న ముక్కలుగా కట్ చేసి, గ్రైండర్లో వేసి బాగా మెత్తని పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూను తేనె జోడించి బాగా కలపాలి.

* ఇలా తయారైన పేస్టును ముఖానికి అప్లైచేసి, 15 నిమిషాల పాటు బాగా ఆరేలా ఉంచనివ్వాలి.

* ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

* మంచి ఫలితాలను పొందడానికి వారానికి ఒక్కసారైనా ఈ అరటి ఫేస్ మాస్క్ను ఉపయోగించాలి.

మొటిమలను నిర్మూలించడానికి :-

మీ ముఖంపై మొటిమలు & మచ్చలు వేదిస్తున్నాయా ? ఎవరైతే మొటిమలు మరియు నల్లమచ్చల తో బాధపడుతున్నారు ఇప్పుడు చెప్పే చిట్కా మీకు బాగా సహాయపడుతుంది.

కావలసినవి :

1 అరటిపండు

1 టీ స్పూన్ తేనె

1 టీ స్పూను నిమ్మరసం

తయారీ విధానం :

* అరటిని చిన్న ముక్కలుగా కట్ చేసి, గ్రైండర్లో వేసి బాగా మెత్తని పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూను తేనెను & నిమ్మరసాన్ని జోడించి బాగా కలపాలి.

* ఇలా తయారైన పేస్టును ముఖానికి అప్లైచేసి, 30 నిమిషాల పాటు బాగా ఆరేలా ఉంచనివ్వాలి.

* ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

* మంచి ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

పొడిచర్మాన్ని నివారించడం కోసం :-

మీ చర్మాన్ని హైడ్రేట్ ఇంకా ఉంచడంలో అరటి బాగా సహాయపడతుంది. అరటిని క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే మీరు మరింత మృదువైన, ఆరోగ్యవంతమైన చర్మాన్ని కలిగి ఉండేలా చేస్తుంది.

కావలసినవి :

1/2 అరటిపండు

1 స్పూను ఓట్మీల్

1 స్పూను తేనె

1 స్పూను గుడ్డు పచ్చసొన

తయారీ విధానం :

* ముందుగా అరటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి, ఆ తర్వాత ఓట్మీల్ను శుభ్రం చేసుకొని మెత్తని పొడిలా తయారుచేసి, అరటి పేస్ట్తో బాగా కలపాలి.

* ఆ మిశ్రమానికి తేనెను & గుడ్డు పచ్చసొనను జోడించి బాగా కలపాలి.

* ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి నేరుగా అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి.

* ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడిగా మార్చుకోవాలి.

* మెరుగైన ఫలితాల కోసం ఈ చిట్కాలను వారంలో రెండుసార్లు పాటించాలి.

జుట్టు చివర్లలో పగుళ్ళను నివారించడానికి :-

అరటిపండు విటమిన్ - A, C, E లతో పాటు, ఇతర మినరల్స్ను కూడా కలిగి ఉంటాయి. ఇది మీ జుట్టును తేమగా ఉంచి మరింతగా బలపరచడంతో పాటు, మీ జుట్టు చివర్లలో ఏర్పడే పగుళ్ళను కూడా నివారించడంలో సహాయపడుతుంది.

కావలసినవి :

బాగా మగ్గిన అరటిపండు 1

2 టేబుల్ స్పూన్ల పెరుగు

2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్

తయారీ విధానం :

* అరటి గుజ్జును చిక్కని పేస్ట్లా తయారుచేసుకోని దానికి పెరుగు & రోజ్ వాటర్ను జోడించి బాగా కలపాలి.

* ఇలా తయారైన మిశ్రమాన్ని తల కి అప్లై చేసి, 1 గంటవరకు ఆరేలా ఉంచాలి.

* షవర్ క్యాప్తో మీ జుట్టును ఒక గంట పాటు బాగా ఆరేలా వదిలివేయాలి.

* చివరగా, మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. మంచి ఫలితాల కోసం ఈ చిట్కాను వారంలో ఒకసారైనా పాటించాలి.

మృదువైన జుట్టు కోసం :-

మీకు కావలసినవి :

1-2 అరటిపండ్లు (బాగా ముగ్గినవి)

2 టేబుల్ స్పూన్లు తేనె

తయారీ విధానం :

* అరటి గుజ్జులా సేకరించి దానిని మెత్తని పేస్ట్లా తయారుచేసుకుని దానికి తేనెను జోడించండి.

* ఈ రెండు పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని మీ తలకు అప్లై చేయండి.

* అలా 30 నిముషాల పాటు బాగా ఆరనిచ్చిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

* వేగవంతమైన ఫలితాలను పొందడానికి వారంలో ఒకసారి ఈ అరటి హెయిర్ ప్యాక్ను తప్పక ఉపయోగించండి.

English summary

Beauty Benefits Of Banana For Hair And Skin

We can make effective banana face and hair masks that can help in resolving various skin and hair-related problems, such as combating wrinkles, removing pimples, split ends, frizzy hair and many more. Banana when mixed with other ingredients like honey, oatmeal, egg, etc., will help you to solve several skin and hair-related issues.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more