జామ ఆకులతో ఎనిమిది సౌందర్య చిట్కాలు

Subscribe to Boldsky

జామ పండు వలన మన ఆరోగ్యానికి అపారమైన లాభాలున్నాయన్న విషయం మనందరికి తెలిసిందే! కానీ జామ ఆకులను కూడా సౌందర్య పోషణ నిమిత్తం వాడవచ్చని మీకు తెలుసా? మనలో చాలామందికి జామ ఆకులు, చర్మము మరియు జుట్టు అందాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించవచ్చని తెలియదు.

Beauty benefits of guava leaves

భారతదేశంలోని చాలా ఇండ్ల పెరళ్లలో జామ చెట్టు సాధారణంగా కనిపిస్తుంది. చాలా పురాతన కాలం నుండి భారతీయ స్త్రీలు జామ ఆకులను సౌందర్య పోషణకై ఉపయోగించడం అనేది ఉంది. జామ ఆకులు నొప్పి మరియు వాపు నివారణకు వాడతారు.యాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు దీనిలో ఉండటం వలన దీనిని కొన్ని రకాల చర్మ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు.

ఇప్పుడు మనం కూడా దీనిలోని విశేషాలను గూర్చి తెలుసుకుందాం.

1. బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది:

1. బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది:

జామ ఆకులు బ్లాక్ హెడ్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం. కొన్ని జామ ఆకులను తీసుకుని వాటిని నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత వీటికిి పసుపుని కలిపి మెత్తని ముద్దగా నూరాలి. దీనిని ముఖానికి పట్టించి మునివేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.

2. మొటిమలు మరియు మచ్చలను తగ్గిస్తుంది:

2. మొటిమలు మరియు మచ్చలను తగ్గిస్తుంది:

జామ ఆకుల్లో ఉండే యాంటీ-బాక్టీరియా తత్వం మొటిమలను కలుగజేసే కణాలను తొలగిస్తుంది. ఇవి చర్మం పై ఉండే నల్లని మచ్చలు, మరకలను తొలగిస్తాయి. కొన్ని జామ ఆకుల్ని తీసుకుని బాగా నలిపి వాటిని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశాల్లో లేక మొత్తం ముఖానికి పూసుకోవాలి. తర్వాత మామూలు నీటితో కడిగేయాలి. ఇలా ఎప్పటికప్పుడు చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

3. ముడుతలను తొలగిస్తుంది:

3. ముడుతలను తొలగిస్తుంది:

జామ ఆకులపై ముఖం పై ఉండే ముడుతలను, సన్నటి గీతలను తొలగించే లక్షణాలు ఉంటాయి. ఇవి మీ ముఖంపై ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. ఇలా జరగటం వల్ల మీ చర్మం మీద వయస్సు పై బడిన ఛాయలు కనిపించవు. కొన్ని జామ ఆకులను తీసుకుని నీటితో కలిపి మరిగించాలి. ఈ నీరు జామ యొక్క ఎసెన్స్ తో నిండి ఉంటుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా ముఖంపై పూసుకుంటే చర్మం కాంతివంతంగా మారి రంగు మెరుగవుతుంది.

4. దురదలను నివారిస్తుంది:

4. దురదలను నివారిస్తుంది:

జామ ఆకుల్లోని కొన్ని కారకాలు చర్మంపై మంట, దురద తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇవి కాలిన గాయాలను, చర్మ ఎలర్జీలను అవి కలిగించే బాక్టీరియాను చంపడం ద్వారా వాటిని త్వరగా మాన్పుతాయి. జామ ఆకులను రుబ్బి, ఆ రసాన్ని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. జుట్టు రాలడాన్ని అరికడుతుంది:

5. జుట్టు రాలడాన్ని అరికడుతుంది:

యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉన్నందున ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలకుండా ఇవి మంచి సహజ చికిత్స మాదిరిగా పనిచేస్తాయి. కొన్ని జామ ఆకులను నీటిలో వేసి ఇరవై నిమిషాల పాటు బాగా మరిగించి చల్లార్చండి. ఈ నీటితో జుట్టును, మాడును మర్దన చేసుకోండి. ఇలా పది నిమిషాల పాటు చేసి తరువాత చల్లని నీటితో కడిగేయండి.

6. మాడుకు సోకే అంటువ్యాధులను నివారిస్తుంది:

6. మాడుకు సోకే అంటువ్యాధులను నివారిస్తుంది:

జామ ఆకులు మాడుకు సోకే వ్యాధులను నివారిస్తాయి. జామ ఆకులను మరగించిన నీటితో మాడును 25 నిమిషాల పాటు మర్దన చేసి చల్లని నీటితో శుభ్రంగా కడిగేయండి. ఇది కండీషనర్ మాదిరిగా పనిచేస్తుంది. ఫలితం త్వరగా ఆశించే వారు ఇలా వారానికి రెండుసార్లు చేయండి.

7. జామ ఆకులు చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది:

7. జామ ఆకులు చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది:

జామ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్ లు మరియు కొన్ని ఇతర కారకాలు చర్మం మీద మృత కణాలను తొలగించడమే కాక బాక్టీరియాను చంపి ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందజేస్తాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారి ఛాయ మెరుగవుతుంది. జామ ఆకులను రుబ్బి,కొంచెం పసుపు మరియు కొంచెం రోజ్ వాటర్ కలపాలి. ఈ ముద్దను ముఖానికి మరియు మెడకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి.మెత్తని గుడ్డతో పొడిగా అయ్యేట్లు ముఖాన్ని తుడుచుకోండి.

8. నోటి శుభ్రతను సంరక్షిస్తుంది:

8. నోటి శుభ్రతను సంరక్షిస్తుంది:

నోటిని శుభ్రంగా ఉంచుకోవడం కొరకు జామ ఆకులను వాడటమనేది పురాతన చిట్కా. లేత జామ ఆకులను నీటిలో మరిగించి ఉప్పును కలిపి తయారు చేసిన ద్రావణాన్ని మౌత్ వాఁష్ గా వాడవచ్చు. దీనితో రోజుకు రెండు సార్లు నోరు పుక్కిలించండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Beauty Benefits Of Guava Leaves

    Have you ever wondered how guava leaves can help in enhancing beauty? Guava leaves have analgesic, anti-inflammatory, antimicrobial and antioxidant properties that help in curing skin and hair-related beauty issues. It helps in reducing wrinkles, prevents blackheads and dark spots from appearing on the skin. It also helps in reducing hair loss.
    Story first published: Tuesday, March 13, 2018, 10:45 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more